BigTV English

NTR vs Balayya : బాబాయ్ పక్కన లేడా ? సక్సెస్ తర్వాత తారక్ రాగం మారిందా ?

NTR vs Balayya : బాబాయ్ పక్కన లేడా ? సక్సెస్ తర్వాత తారక్ రాగం మారిందా ?

NTR vs Balayya : నందమూరి ఫ్యామిలీకి, ఎన్టీఆర్‌కి ఈ మధ్య అస్సలు పొసగడం లేదని తెలుస్తుంది. ఎన్టీఆర్ అంటే బాలయ్య అండ్ ఫ్యామిలీ మొత్తం ఫైర్ అవుతున్న సందర్భాలు ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. అలాగే నందమూరి ఫ్యామిలీకి అన్నదమ్ములు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా అంతే దూరాన్ని పాటిస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది.. వీరి మధ్య ఏ చిన్న విషయం జరిగినా… అటు రాజకీయంగా, ఇటు సినిమా పరంగా పెద్ద రచ్చే జరుగుతుంది.


ఇప్పుడు వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ మరోసారి పెద్ద దుమారాన్నే లేపాయి. తెలుగు దేశం తమ్ముళ్లు, బాలయ్య అభిమానులు గుర్రుగా ఉన్నారు. అంతే కాదు, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఇంతకు ఎన్టీఆర్ ఏం అన్నాడు ? తమ్ముళ్లు ఎక్కడ అప్‌సెట్ అయ్యారు ? ఎన్టీఆర్ పై వస్తున్న ట్రోల్స్ ఏంటి అనేవి ఇప్పుడు చూద్దాం.

నిన్న (ఆదివారం) రాత్రి యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ వార్ 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ మూవీ ఈ నెల 14న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఆ ఈవెంట్ నిర్వహించారు.


నాకు ఎవరూ లేరు – ఎన్టీఆర్

ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ… తనకు ఎవరూ లేరని, తన పక్కన అమ్మ, నాన్న మాత్రమే ఉన్నారని చెప్పుకొచ్చాడు. ఇప్పుడే ఇదే తెలుగు తమ్ముళ్లును ఫైర్ అయ్యేలా చేసింది. గతం మర్చిపోవడం ఏంటి అంటూ ఎన్టీఆర్ పై ఆయన కామెంట్స్ పై మండిపడుతున్నారు.

నాకు ఎప్పటికీ కింగ్ బాబాయే – ఎన్టీఆర్

కెరీర్ తొలినాళ్లలో ఎన్టీఆర్ స్పీచ్‌ను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. అప్పట్లో సినిమా ఈవెంట్స్‌లో తారక్ మాట్లాడాని మాటల పేపర్ కట్టింగ్స్‌ను సోషల్ మీడియాలో పెట్టి, ఎన్టీఆర్‌ను ట్యాగ్ చేస్తున్నారు.

అందులో… తనకు కింగ్ ఇప్పటికీ ఎప్పటికీ బాబాయే అని ఎన్టీఆర్ అన్న మాటలు ఉన్నాయి. అలాగే, తాను ఈ స్థితిలో ఉన్నానంటే, దానికి కారణం తాతయ్య, నాన్నగారు, బాలయ్య బాబాయే అని అన్న మాటలు కూడా ఉన్నాయి. అలాగే ఆ ఈవెంట్‌లోనే బాబాయ్ బాలకృష్ణ కాళ్లు తారక్ మొక్కాడు. వీటినే ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు, బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

గతం మర్చిపోయావా ఏంటి ? – అభిమానులు

కెరీర్ సెట్ అయ్యే వరకు బాబాయ్, నందమూరి వంశం అని చెప్పుకున్నాడని, ఇప్పుడు కెరీర్ సెట్ అయ్యాకా.. తనకు ఎవరు లేరని, తన కెరీర్ సెట్ అవ్వడానికి కారణం తానే అని చెప్పుకుంటున్నాడు అంటూ బాలయ్య అభిమానులు ఫైర్ అవుతున్నారు. గతంలో ఎన్టీఆరే చెప్పిన ఇప్పుడు ఆయన మర్చిపోయినా.. అందరికీ గుర్తున్నాయని కౌంటర్ వేస్తున్నారు.

Related News

Chaitanya Reddy: కార్మికుల డిమాండ్లు నెరవేర్చలేము.. సినిమా బిజినెస్ కాదు!

Producer Skn: నిర్మాత సంచలన నిర్ణయం, ఇండస్ట్రీ సమస్యలు క్లియర్ అయ్యేవరకు….

Brahmanandam: తండ్రి అయిన బ్రహ్మానందం రెండో కొడుకు.. ఫోటోలు వైరల్!

Prabhas: ప్రభాస్ ను చూసి నేర్చుకోవాల్సిందే, అలా కాలర్ ఎత్తే అర్హత తనకు మాత్రమే ఉంది

Jr NTR: ఎన్టీఆర్ కాలర్ కథ ఇదే… ఎత్తిన ప్రతిసారి రిజల్ట్ ఎలా ఉందంటే ?

Coolie: 14 న సినిమా రిలీజ్ అయితే 15న ఈవెంట్, ఎవరా క్రియేటివ్ జీనియస్.?

Big Stories

×