Hyderabad News: హైదరాబాద్‌లో వారం రోజులుగా చీకటి పడితేచాలు భారీ వర్షం కుమ్మేస్తోంది. ఆ వాతావరణం పైన కనిపిస్తున్న వ్యక్తికి ఎంతగా నచ్చిందో తెలీదు. అలాంటి సమయం, క్షణాలు ఇక రావని భావించాడు. ఏమాత్రం ఆలస్యం చేయలేదు. హైదరాబాద్ సిటీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకి కారులో వెళ్తే తన ఆలోచనను అమలు చేసే ప్రయత్నం చేశాడు. ఇంతకీ మేటరేంటని అనుకుంటున్నారా? అక్కడికి వచ్చేద్దాం.
శనివారం రాత్రి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే రోడ్డుపై కారు సన్‌రూఫ్ నుండి ఓ వ్యక్తి బయటకు కనిపించాడు. ఆ వ్యక్తి మద్యం సేవించి, ధూమపానం చేస్తూ కెమెరాకు చిక్కాడు. అదే రూట్లో వెళ్తున్న ఓ వ్యక్తి ఈ తతంగాన్ని తన సెల్‌ఫోన్ కెమెరాలో బంధించాడు. కెమెరా తీయడం గమనించిన ఆ వ్యక్తి మరింతగా రెచ్చిపోయాడు.
ఆ వ్యక్తికి ఒక చేతిలో మద్యం, మరో చేతిలో సిగరెట్ పట్టుకుని ఉన్నట్లు ఆ వీడియోలో కనిపించింది. వీలు చిక్కినప్పుడల్లా బాటిల్ పైకి ఎత్తుతూ గొంతు తడుపుకునే ప్రయత్నం చేశాడు. ఈ రూట్లో తనను ఎవరు చూస్తారు.. ఏ పర్వాలేదని ధీమాతో ఉన్నాడు. అది TS 12 EV 9233 నెంబరు గల కారు.
ఈ విధంగా యువకుడు ఎంజాయ్ చేశాయి. మనం చేసినా కెమెరాలు ఏమీ చేయలేవని భావించాడో, తన మనసులోని కోరిక తీర్చుకున్నాడో తెలీదు. ఈ విధంగా అడ్డంగా బుక్కయ్యాడు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసుల దృష్టి ఆ వ్యక్తిపై పడింది.
ALSO READ: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి, ట్విస్ట్ తెలిస్తే
మోటారు వాహనాల చట్టం-తెలంగాణ ఎక్సైజ్ చట్టం ప్రకారం రోడ్లపై వాహనాల మీద మద్యం సేవించడం నిషేధం. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్ కాల్చడం, మద్యపానం చేయడం నేరం కూడా. మొత్తానికి యువకుడు అడ్డంగా బుక్కయ్యాడు.
అన్నట్లు మధ్యకాలంలో రాత్రి వేళ కార్లపై వేగంగా వెళ్లినప్పుడు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు యువతీయువకులు. ఆ మధ్య యూపీ, ఉత్తరాఖండ్ జాతీయ రహదారులపై కారు సన్‌రూఫ్‌పై యవ జంటలు రెచ్చిపోయిన సంగతి తెల్సిందే. స్థానికుల సమాచారం పోలీసులు వారిని అడ్డగించి భారీగా ఫైన్ వేసిన ఉదంతాలు లేకపోలేదు.
A man was caught on camera drinking alcohol and smoking while standing out of a car’s sunroof on Aramghar Road leading to Hyderabad Airport on Saturday night, August 9.
According to the person who recorded the video, the incident took place as the vehicle, bearing registration… pic.twitter.com/Fu9MqE80ZE
— The Siasat Daily (@TheSiasatDaily) August 10, 2025