BigTV English

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Sanju Samson :  ఐపీఎల్ లో అత్యంత నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ ఒకరు. అయితే గత కొద్ది రోజుల నుంచి అతను రాజస్థాన్ రాయల్స్ జట్టుకి వీడ్కోలు పలుకనున్నాడనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఐపీఎల్ 2026 సీజన్ కంటే ముందు స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్ మెన్ సంజూ కొత్త అవకాశాలను అన్వేశిస్తున్నారని.. త్వరలో జైపూర్ ఫ్రాంచైజీని వీడాలని నిర్ణయించుకున్నారని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఈ విషయం పై సంజూ శాంసన్ స్పందిస్తూ.. తాను రాజస్థాన్ రాయల్స్ కి వీడ్కోలు పలుకుతున్నానని వస్తున్న వార్తలపై అంతా ఆ దేవుడికే తెలుసు అని చెప్పాడు. అలాగే తన మనస్సులో ఉన్న కోరికను మాత్రం బయటపెట్టాడు. అది ఏంటంటే..?


Also Read :  Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

6 సిక్స్ లు కొట్టాలని డ్రీమ్.. 


ఆరు బంతుల్లో 6 సిక్స్ లు కొట్టాలని తన డ్రీమ్ అని చెప్పాడు. ప్రస్తుతం సంజూ శాంసన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం విశేషం. ఇక ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకి పదేళ్ల కు పైగా ఆడిన ఈ స్టార్ ప్లేయర్.. ఇప్పుడు ఆ జట్టును వీడబోతున్నారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. ఐపీఎల్ 2026 సీజన్ కి ముందు కొత్త అవకాశాలను వెతుక్కునేందుకు వేరే జట్టులోకి వెళ్తాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ తో తనకు ఉన్న అనుబంధం గురించి ఇటీవలే సహచర క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తో ఓ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను వెల్లడించాడు. “రాజస్థాన్ రాయల్స్ జట్టు నాకు కేవలం ఒక ఫ్రాంచైజీ మాత్రమే కాదని.. తన క్రికెట్ కెరీర్ కి పునాది వేసిన కుటుంబం అని వివరించారు. తాను కేరళలోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి యువకుడిని. నన్ను నేను నిరూపించుకోవాలని చూస్తున్నప్పుడు రాహుల్ ద్రవిడ్ సార్, మనోజ్ బడాలే సార్ నాకు అవకాశం కల్పించారు.

CSK లోని సంజూ శాంసన్..? 

ప్రధానంగా ప్రొఫెషనల్ క్రికెట్ లో స్థిరపడకముందే వారు నా కెపాసిటీని నమ్మారు. ఆ నమ్మకం నా కెరీర్ ను మలుపు తిప్పింది. ఈ ఫ్రాంచైజీతో నాకు చాలా మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి” అని చెప్పుకొచ్చారు. మరోవైపు సంజూ శాంసన్ ఐపీఎల్ 2026 కి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్లే అవకాశం ఉంది. ఎం.ఎస్. ధోనీ రిటైర్మెంట్ గురించి ప్రతీ సీజన్ లో చర్చ జరుగుతోంది. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సంజూ శాంసన్ ను ఓ దీర్ఘకాలిక కెప్టెన్ గా చూస్తున్నట్టు సమాచారం. సంజూ శాంసన్ 203లో రాజస్థాన్ రాయల్స్ లో చేరారు. దాదాపు 12 ఏళ్ల పాటు కీలక ఆటగాడిగా ఉన్నారు. ఇప్పటివరకు 144 ఐపీఎల్ మ్యాచ్ లు ఆడి 4వేలకు పైగా పరుగులు సాధించారు. ఈ ప్రదర్శన కారణంగా టీమిండియా టీ-20 జట్టులో రెగ్యులర్ ఫ్లేయర్ గా మారారు. రాబోయే ఆసియా కప్ లో భారత జట్టు తరపున సంజు శాంసన్ కీలక పాత్ర పోషించనున్నారు. 

?igsh=NDRzMGludXNhNTQ2

Related News

Asia Cup 2025 : బంగ్లా చిత్తు… ఫైనల్ కు పాకిస్తాన్.. టీమిండియాతో బిగ్ ఫైట్

PAK Vs BAN : పాకిస్తాన్ కి షాక్.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs BAN : ఇండియానా… అదెక్కడుంది? బంగ్లాదేశ్ అభిమాని ఓవరాక్షన్

PAK Vs BAN : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Smriti Mandana : స్మృతి మంధానకు ఘోర అవమానం… ఆ ఫోటోలు వైరల్ చేసి!

Abhimanyu Easwaran : 25 సెంచరీలు, 30 అర్థ శతకాలు చేసినా ఛాన్స్ దక్కడం లేదు…అభిమన్యు ఏం పాపం చేశాడు రా !

Inzamam-ul-Haq : అభిషేక్ శర్మ బ్యాట్ లో చిప్స్.. అందుకే దారుణంగా ఆడుతున్నాడు

Asia Cup 2025 : అభిషేక్ శర్మ రనౌట్… దుబాయ్ స్టేడియంలో ఏడ్చేసిన లేడీ

Big Stories

×