Watch Video : క్రికెట్‌లో అనేక వింత సంఘటనలు జరుగుతుంటాయి. మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా గల్లీ క్రికెట్ లో అయిన చిత్ర, విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈ మధ్యకాలంలో బౌలర్లు రివర్స్ బంతి వేసి బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయడం, లేదా బ్యాట్స్‌మెన్లు రివర్స్‌లో బ్యాటింగ్ చేసి సిక్సులు, ఫోర్లు కొట్టడం వంటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు మంచి ఆదరణ లభిస్తున్నప్పటికీ, ఇండియాలో గల్లీ క్రికెట్‌కు ప్రత్యేక స్థానం ఉంది. పంట పొలాల వద్ద, గల్లీలలో, చిన్న చిన్న మైదానాలలో, పాఠశాలలు, కళాశాలల్లో కూడా క్రికెట్ ఆడుతుంటారు. పండుగ సమయాల్లో చిన్న చిన్న గ్రామాలలో టోర్నమెంట్లను కూడా నిర్వహిస్తారు, ఆ ఆటలలో వివిధ రకాల బంతులను ఉపయోగిస్తారు. తాజాగా ఇలాంటిదే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
Also Read : Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6
వెరైటీ స్టేడియం.. వెరీ ఫన్నీ
ఆ క్రికెట్ గేమ్ ని చూసిన వారు ఎవ్వరూ నవ్వకుండా ఉండలేరు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఆ వీడియోను పరిశీలించినట్టయితే.. బౌలర్ పెద్ద బోర కింద డౌన్ నుంచి బౌలింగ్ చేయగా.. బ్యాటర్ గడ్డ మీద పైన బ్యాటింగ్ చేస్తున్నాడు. బంతిని బాదిన బ్యాటర్ పరుగెత్తకుండా వికెట్ల వద్ద నుంచి బౌలర్ బౌలింగ్ చేసే వరకు జారుబండ టైప్ లో అవుతల వైపు వికెట్ల వరకు డౌన్ లో జారుకుంటూ వికెట్ల వద్దకు వచ్చాడు. మరో బ్యాటర్ బోర మీదికి పైకి పరుగెత్తుకుంటూ వెళ్లాడు. ఇలా పరుగులు తీస్తున్న వీడియో ని సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. క్రికెట్ ని ఇలా కూడా ఆడుతారా..? ఇదేం క్రికెట్ రా బాబు.. పాకుకుంటూ పోయి కూడా పరుగులు తీయవచ్చా..? అని కామెంట్స్ చేస్తున్నారు. మళ్లీ అందులో బురద కూడా ఉండటం విశేషం. బ్యాటర్ జారుకుంటూ బురదలో కూడా పడటం.. మళ్లీ మరో రన్ కోసం బోర పైకి పరుగెత్తడం కాస్త వెరైటీగానే అనిపించింది.
వెరైటీ బ్యాట్ తో క్రికెట్
ఈ మధ్య కాలంలో ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు క్రికెట్ లో ఇప్పుడు రకరకాల బంతులతో పాటు రకరకాల బ్యాట్స్ లను కూడా వినియోగిస్తున్నారు. బ్యాట్ లు చెక్క బ్యాట్, ప్లాస్టిక్ బ్యాట్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. తక్కువ ధరకు ప్లాస్టిక్ బ్యాట్లకు మంచి గిరాకీ లభిస్తోంది. చెక్క బ్యాట్లకు ధర ఎక్కువ.. బరువు ఎక్కువ అని యువకులు, కాలేజీ కుర్రాళ్లు ఎక్కువగా ప్లాస్టిక్ బ్యాట్లతోనే క్రికెట్ ఆడుతున్నారు. పల్లెటూర్లలో ఈ మధ్య ప్లాస్టిక్ బ్యాట్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయిందనే చెప్పవచ్చు. ప్లాస్టిక్ బ్యాట్లు, టెన్నిస్ బంతులతో క్రికెట్ మ్యాచ్ లు ఆడుతున్నారు. కొన్ని పండుగ వేళలలో అయితే.. వీటి వినియోగం విపరీతంగా ఉంటుంది. తాజాగా ఓ బ్యాట్ వైరల్ అవుతోంది. అది వుడ్ తో తయారు చేసిన బ్యాట్.. ఆ బ్యాట్ చాలా వెడల్పు కలిగి ఉండటంతో బంతి ఎంత దూరంతో వచ్చినా.. ఎంత హైట్ లో వచ్చినా బ్యాట్ తో చాలా సులభంగా పరుగులు చేయవచ్చు. దీంతో బ్యాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Slope pro max 😂 pic.twitter.com/MkGlbV720f
— Out Of Context Cricket (@GemsOfCricket) August 10, 2025