Universe: ఈ లోకంలో దేవుడిని నమ్మే ఆస్తికులు, నమ్మని నాస్తికులూ ఉన్నారు. అయితే, ఈ విశ్వాన్ని నడిపించేది దేవుడని ఆస్తికులు, సైన్స్ అని నాస్తికులు అంటుంటారు. ఈ ప్రశ్న శతాబ్దాలుగా శాస్త్రవేత్తలు, దైవశాస్త్రజ్ఞులు, సామాన్యుల మదిలో మెదులుతూనే ఉంది. ఇది ఆస్తికులు, నాస్తికుల మధ్య చర్చకు కూడా దారి తీసింది. ఈ ప్రశ్న మన ఉనికి గురించి మరింత లోతుగా తెలుసుకునే అవగాహనను కల్పిస్తుంది. కొత్త ఇన్వెన్షన్ లు, దృక్కోణాలు ఈ చర్చను మరింత ఇంట్రెస్టింగ్ గా చేస్తున్నాయి.
సైన్స్ గురించి చెప్పుకుంటే అది కనిపించే ఆధారాలు , పరీక్షించదగిన థియరీలతో ఈ విశ్వాన్ని వివరిస్తుంది. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఈ విశ్వం 1380 కోట్ల సంవత్సరాల క్రితం ఒక చిన్న బిందువు నుంచి ప్రారంభమైందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గ్రావిటీ, క్వాంటం మెకానిక్స్ వంటి భౌతిక నియమాలు గ్రహాల కక్ష్యలు నుంచి అణువుల పనితీరు వరకు అన్నిటినీ బాగా వివరిస్తాయి. ఈ విశ్వం కొన్ని నిర్దిష్ట నియమాలతో నడుస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బ్లాక్ హోల్స్ నుంచి DNA వరకూ, దైవ శక్తి అవసరం లేని నమూనాలను మనం ఎన్నెన్నో చూస్తూనే ఉన్నాం.
ఈ ఆధునిక కాలంలో జరుగుతున్న కొత్త కొత్త ఇన్వెన్షన్లు ఈ ఆలోచనను మరింత బలపరుస్తున్నాయి. 2021 లో ప్రవేశపెట్టిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్, బిగ్ బ్యాంగ్ తరువాత కేవలం 20 కోట్ల సంవత్సరాల్లో ఏర్పడిన గెలాక్సీలను ఫోటో తీసింది. CERNలో జరిగే ఎక్స్పరిమెంట్లు ప్రామాణిక మోడల్ ను చూపిస్తున్నాయి, ఇది ఒరిజినల్ పవర్, సెల్స్ గురించి స్పష్టంగా వివరించడమే కాదు ఈ ఎక్స్పరిమెంట్లు విశ్వాన్ని సైన్స్ ద్వారా ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చని చెబుతున్నాయి.
ఎంత బాగా వివరించినా దేనికైనా కొన్ని లిమిట్స్ అంటూ ఉంటాయి. అయితే, సైన్స్ కి కూడా కొన్ని లిమిట్స్ ఉన్నాయి, అది “ఎలా” అన్నది చెప్పగలదు, కానీ “ఎందుకు” అన్న విషయాన్ని మాత్రం పూర్తిగా వివరించకుండా, తడబడుతుంది. ఈ విశ్వం అనేది ఎందుకు ఉంది? గ్రావిటేషనల్ ఫోర్స్ వంటి ప్రాక్టికల్ రూల్స్ జీవం సాధ్యం అయ్యేలా సమతుల్యంగా ఎందుకు ఉన్నాయి? ఇలాంటి ప్రశ్నలు కొంతమందిని దైవిక ఆలోచన వైపు నడిపిస్తాయి. “సైన్స్, దేవుడు ఒకరినొకరు వ్యతిరేకించరు. ఈ విశ్వంలోని క్రమం, సంక్లిష్టత ఒక ఉద్దేశం ప్రకారమే ఏర్పడ్డాయన్న ఆలోచనను సూచిస్తాయని లండన్‌లోని దైవశాస్త్రవేత్తలు చెబుతున్నారు.
దైవిక ఆలోచనను క్రిటిసైజ్ చేసేవారు, తెలియని విషయాలను దేవుడికి ఆపాదించడం ‘గాడ్ అఫ్ ది గ్యాప్స్’ విధానమని అంటారు. గతంలో పిడుగులు, వ్యాధులను దైవిక శక్తికి ఆపాదించారు, కానీ వాతావరణ శాస్త్రం, జీవశాస్త్రం వచ్చిన తరువాత వాటిని బాగా వివరించాయి. మనం విశ్వ చరిత్రను సైన్స్ ద్వారా వివరిస్తున్న కొద్దీ, దైవిక వివరణలకు ఛాన్స్ తగ్గుతోందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ చర్చ మానవ అనుభవాలను తాకుతుంది. సైన్స్ ఆనందం, ప్రేమ వంటి ఇతర భావోద్వేగాలను న్యూరాలజీ, కెమిస్ట్రీ వంటి వాటితో వివరిస్తుంది. కానీ దేవుడిని నమ్మే చాలామందికి ఇవి కూడా దైవికంగా అనిపిస్తాయి. ఏ సమీకరణం మానవ ఆత్మను బంధించలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మనం విశ్వం లోతుకి చూస్తున్న కొద్దీ, సైన్స్-దేవుడు అన్న ప్రశ్న ఎప్పటికి అంతుచిక్కకుండా మిగిలిపోతుంది. దీనికి కారణం ఏంటంటే అటు సైన్స్ పరంగా ఇటు దైవం పరంగా బలమైన వాదనలు, కొన్నిటికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఒకటి ఇంకొకదాన్ని పూర్తిగా మూగ చేయలేకపోతోంది. ప్రస్తుతానికి, తెలుసుకోవాలనే కోరిక, నమ్మకం, ఆశ్చర్యంతో సమాధానాల కోసం పరిశోధనలు కొనసాగుతున్నాయి.