BigTV English
Advertisement

Manchu Vishnu: అలా చేసిన రోజు బ్రతికున్నా చచ్చినట్టే – మంచు విష్ణు..!

Manchu Vishnu: అలా చేసిన రోజు బ్రతికున్నా చచ్చినట్టే – మంచు విష్ణు..!

Manchu Vishnu: మంచు విష్ణు తన కన్నప్ప మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపెడుతున్నారు. ఇందులో భాగంగా మంచు విష్ణు తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో చేసిన కామెంట్లు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఆ రోజు నేను బతికున్నా చచ్చిన కిందే లెక్కా అంటూ మంచు విష్ణు మాట్లాడిన మాటలు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. మరి ఇంతకీ మంచు విష్ణు అంత ఎమోషనల్ గా ఎందుకు మాట్లాడారు.. ఆయన మాటల వెనుక ఉన్న అర్థం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


అలా చేస్తే బ్రతికున్నా.. చనిపోయినట్టే – మంచు విష్ణు

మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప మూవీ.ఈ సినిమా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని చాలాసార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు జూన్ 27న రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. ఇందులో భాగంగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న ఈ సినిమాకి కొద్దిరోజుల ముందు నుండే ప్రమోషన్స్ మొదలు పెట్టేసారు. మంచు విష్ణు అలా తన ప్రమోషన్స్ కోసం యూస్ కూడా వెళ్లారు. అక్కడ కూడా ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ నిర్వహించారు. అయితే తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న మంచు విష్ణు తండ్రితో బంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మంచు విష్ణు తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. మా నాన్న ఆనందమే నాకు ముఖ్యం. ఆయన ఆనందం కోసం నేను ఏదైనా చేస్తాను. ఆయన ఆనందంగా లేకపోతే నాకు ఏది అవసరం లేదు.. ఆయనకి చెడ్డ పేరు తీసుకువచ్చిన రోజు నేను బతికున్న చచ్చిన కిందే లెక్క.ఆరోజు ఎప్పటికీ తీసుకురాను. ఆయన పేరు నిలబెట్టడానికే ప్రయత్నిస్తాను కానీ చెడగొట్టేలా ఎప్పుడు చేయను.చెడ్డ పేరు తీసుకువచ్చిన రోజు ఒక కొడుకుగా నేను చచ్చిన కిందే లెక్క అంటూ కుటుంబంలో ఉన్న గొడవల గురించి మంచు విష్ణు ఎమోషనల్ కామెంట్స్ చేశారు.


మంచు విష్ణు పై నెటిజన్స్ ట్రోల్స్..

ఇక ఈయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొడుకు అంటే ఇలా ఉండాలి అని కొంతమంది సపోర్ట్ చేస్తే మరికొంత మందేమో ఉన్న ఆస్తంతా నీ ఒక్కడికే రావాలి అని, తమ్ముడి మీద తండ్రికి కోపం పెంచుతూ తండ్రిని బుట్టలో వేస్తున్నావ్ అంటూ విమర్శిస్తున్నారు. ఇక ఈ విమర్శలు రావడానికి కారణం చాలా రోజుల నుండి మంచు మనోజ్ విష్ణు గురించి కొన్ని షాకింగ్ విషయాలు బయటపెడుతున్నారు. మంచు విష్ణు ఆస్తి కోసమే తండ్రిని తనవైపుకి మళ్లించుకున్నారని, ఆస్తి కోసమే ఇదంతా నాటకం ఆడుతున్నారంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే మంచు మనోజ్ తో మంచు మోహన్ బాబు, మంచు విష్ణు గొడవలు ఏర్పడుతున్న విషయం తెలిసిందే. ఇక తండ్రికి తగ్గట్టుగానే నడుచుకుంటూ తండ్రికి అనుకూలంగానే మంచు విష్ణు కామెంట్లు చేస్తుండడంతో ఇలా ఆయనపై వార్తలు వైరల్ అవుతున్నాయి.

Samantha,: సమంత – రాజ్ డేటింగ్ కి స్వస్తి.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్.. స్టార్ నటి ఆశీర్వాదం..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×