Nellore News: పని పాటా లేని కొందరు యువకులు పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తుంటారు. వారికి దొరికితే తాము బుక్కైపోతామని భావిస్తారు. చివరకు గంగమ్మ ఒడికి చిక్కారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. అసలు మేటరేంటి?
సోమవారం రాత్రి పేకాట ఆడేందుకు 17 మంది యువకులు నెల్లూరు సిటీలోని పెన్నా నదిలోకి వెళ్లారు. ఒక్కసారిగా నీరు రావడంతో వారంతా షాకయ్యారు. సరదాగా ఆనందించడానికి వస్తే నీరు చుట్టుముట్టడంతో హడలిపోయారు. తమను కాపాలంటే కేకలు పెట్టారు. వెంటనే గుర్తించిన స్థానికులు, అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఈ తతంగం నాలుగైదు గంటలపాటు సాగింది. చివరకు నదిలో ఆటలు ఆడేందుకు వెళ్లిన యువకులు క్షేమంగా బయటపడడంతో వారి కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. నగరంలో ఎక్కడ పేకాట ఆడుతున్నా పోలీసులు దృష్టి పెట్టడంతో నెల్లూరు పట్టణంలో 17 మంది యువకులు టీమ్‌గా ఏర్పడ్డారు.
పోలీసుల టార్చర్ నుంచి తప్పించుకోవాలంటే నదిలోకి వెళ్లి పేకాట ఆడుకోవాలని నిర్ణయించారు. అనుకున్నట్లుగా అందులో నదిలోకి వెళ్లి పేకాట ఆడుతున్న సమయంలో ఒక్కసారి డామ్ గేట్లు ఓపెన్ చేశారు. వెంటనే నీరు వారిని చుట్టిముట్టింది. ఒక్కసారిగా వారంతా షాకయ్యారు. ఏం చెయ్యాలో కాసేపు తర్జనభర్జన పడ్డారు. నదిలో ఉండే చనిపోవడం భావించి కేకలు వేయడం మొదలుపెట్టారు.
ALSO READ: ఏపీలో ఐదు డిఫెన్స్ క్లస్టర్లు, ఉత్తరాంధ్ర-సీమకు మహార్ధశ
వంతెన మీదుగా వెళ్తున్న స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక శాఖ-పోలీసులు-రెవెన్యూ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. బ్రిడ్జిపై నుంచి నిచ్చెనతో కిందకు దిగి కొంత మందిని రక్షించారు. రాత్రివేళ కావడంతో అంతా చీకటిగా ఉంది. ఆక్సా లైట్ ఏర్పాటు చేైసిన నవాబుపేట పోలీసులు కిందకు దిగి గాలింపు చర్యలు చేపట్టారు.
తొలుత 9 మందిని రక్షించారు. మిగతావారు ప్రాంతం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు పట్టుకుంటే అరెస్టు చేస్తారని భయపడ్డారు. చివరకు వారి నుంచి క్లారిటీ రావడంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు పోలీసులు. దీంతో యువకుల కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి.
పెన్నా నదిలో చిక్కుకుపోయిన 10 మంది యువకులు
నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీ వద్ద పెన్నా నదిలో చిక్కుకుపోయిన యువకులు
పేకాట ఆడేందుకు నది మధ్యలోకి వెళ్లిన యువకులు
సోమిశిల డ్యామ్ నుంచి నీటిని విడుదల చేసిన క్రమంలో ఒక్కసారిగా నదిలో చుట్టుముట్టిన నీరు
స్థానికల సమాచారంతో నది మధ్యలో… pic.twitter.com/SHdjNPZVwc
— BIG TV Breaking News (@bigtvtelugu) September 16, 2025