Dharma Mahesh : ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకటి పోతే మరొకటి హాట్ టాపిక్ గా మారుతున్నాయి.. మొన్నటి వరకు హీరో రాజ్ తరుణ్, లావణ్య మ్యాటర్ వైరల్ అయిన విషయం తెలిసిందే.. దాని గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు కానీ ఇటీవల మరొకరి చర్చ వైరల్ గా మారింది. టాలీవుడ్ యంగ్ హీరో ధర్మ మహేష్ తన భార్యను వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ వార్తలు వినిపించాయి. అతనిపై ఆయన భార్య కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులకు తల బొప్పి కట్టేలా ట్విస్టుల మీద ట్విస్టులు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు ఆయన భార్య మీడియా చానల్స్ కి ఇంటర్వ్యూ లిస్టు అనేక విషయాలను షేర్ చేసుకున్నారు. తాజాగా ఈ హీరో తన భార్య గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. అలాగే ఆర్జే శేఖర్ భాష కూడా వీళ్ల మ్యాటర్ లో ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తుంది.. ఆయన ఏమంటున్నారంటే..
లావణ్య, రాజ్ తరుణ్ కేసులో ఆర్జే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయిన విషయం తెలిసిందే.. ఈయన ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ కేసు మరింత ఊపు అందుకుంది. ఇప్పుడు హీరో ధర్మ మహేష్ కేసులో కూడా ఆర్జె శేఖర్ బాషా ఇన్వాల్వ్ అయ్యారు. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. గౌతమి కంటే ధర్మ చాలా చిన్నవాడని, ఇతని కుటుంబం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ మద్ధతుదారులు. గౌతమి చౌదరి కుటుంబం ఫస్ట్ నుంచి వైసీపీయేనని, దాంతో ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించకపోవడంతో ధర్మ మహేశ్ ఆత్మహత్య వరకు వెళ్లడంతో పెళ్లి చేశారు. పెళ్లికి ముందే ఇతను అనేక వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేసినట్లు బయటపెట్టాడు..
మహేష్ స్టార్ట్ చేసిన గిస్మత్ బ్రాండ్ పై అనేక వివాదాలు తలెత్తాయి. ఇప్పటివరకు ఆయన భార్య గౌతమి దీని గురించి ఎటువంటి ఆధారాలు చూపించలేకపోయింది. ఎల్ఎల్‌బీ గ్రాడ్యుయేట్ కాబట్టి వ్యవస్థ ఎలా పనిచేస్తుందో బాగా తెలుసు.. పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టిన తర్వాత మీడియాకు పదే పదే ఇంటర్వ్యూలు ఇచ్చి కేసును ముందుకు నడిపాలన్న ఒక ఉద్దేశ్యంతోనే ఆమె ఇలా చేస్తుంది తప్ప.. ఆమె దగ్గర ఎటువంటి ఆధారాలు లేవని శేఖర్ బాషా అంటున్నారు. గిస్మత్ బ్రాండ్ నాది, నా సొంతమని ఆమె చెబుతోంది.. కానీ అది నిజం కాదు. పెళ్లికి ముందే ధర్మ మహేశ్ ఆ బ్రాండ్ స్టార్ట్ చేశాడు. పెళ్లి తర్వాత ఆమె కూడా తన సహకారంతో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది తప్ప ఆమెకు దానికి ఎటువంటి సంబంధం లేదు అని శేఖర్ భాషా తేల్చి చెప్పేశారు.. కేవలం దాన్ని తీసుకోవడానికి ఈ కేసులు పెడుతుందని గౌతమి కుట్రను బయటపెట్టాడు ఆర్జె శేఖర్ బాషా..
ఆ బ్రాండ్ ని తనకి ఇవ్వాలని అనేకసార్లు ధర్మతో గొడవ పడినట్లు ఆర్జే అంటున్నారు. ఇప్పుడు ఆమె చేస్తున్నా పోరాటం కేవలం దానికోసమే అని ఆయన అంటున్నారు. గౌతమి వాళ్ళ నాన్నకు చంద్రబాబు నాయుడు పై రాళ్లు విసిరిన దానికి కేసు ఉందని తెలిపాడు. దాని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని సంచలన విషయం బయటపెట్టారు. సీఎం పై రాళ్లు విసిరాడన్న ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు చేశారు అయితే ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయింది ఇప్పటివరకు ఈ కేసు నుంచి బయటపడలేదు. ఇలాంటి నేర చరిత్ర ఉన్న కుటుంబంలో గౌతమి పెరిగింది. ఆమెకు కూడా అలాంటి అలవాట్లే ఉంటాయి కదా అంటూ శేఖర్ బాషా అన్నారు.. మరి దీనిపై గౌతమి చౌదరి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..