Vijayawada News: హోటల్స్, రెస్టారెంట్ లో మనం ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు అప్పుడప్పుడు తప్పిదాలు జరుగుతూనే ఉంటాయి. ఒకటి ఆర్డర్ చేస్తే హోటల్ సిబ్బంది మరొక ఫుడ్ ను తీసుకురావడం మనం తరుచుగా వార్తల్లో వింటూనే ఉంటాం. కొన్ని సార్లు కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేసే సందర్భాలు కూడా ఉంటాయి. దీనికి హోటల్ సిబ్బంది సారీ చెప్పి వెంటనే వారు చెప్పిన ఫుడ్ తీసుకొస్తారు. కానీ విజయవాడలో ఓ హోటల్ సిబ్బంది ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ కాకుండా వేరే ఫుడ్ ఎందుకు ఇచ్చారని అడిగినందుకు డైరెక్ట్ కత్తితో రప్పారప్పా పీకను కోసేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
ఇలా స్టార్ట్ అయ్యింది గొడవ…
విజయవాడ నగరంలోని వెల్ కమ్ హోటల్ లో ఈ ఘటన జరిగింది. శనివారం రాత్రి ఓ అబ్దుల్ కరీమ్ అనే యువకుడు టిఫిన్ కోసం హోటల్ కు వెళ్లాడు. మెనూ మొత్తం చూసేసి కరీమ్ ఉప్మా దోశ ఆర్గర్ ఇచ్చాడు. హోటల్ సిబ్బంది మిస్టేక్ లో ఉప్మా దోశకు బదులు ప్లెయన్ దోశను పార్సిల్ కట్టారు. యువకుడు ఇంటికి వెళ్లి పార్సిల్ ఓపెన్ చేయగానే ఉప్మా దోశకు బదులు ప్లెయిన్ దోశ దర్శనమిచ్చింది. దీంతో కరీమ్ నేరుగా హోటల్ వద్దకు వెళ్లి.. తాను చెప్పిన ఆర్డర్ కాకుండా వేరే ఫుడ్ ఎందుకు పార్సిల్ కట్టారని అక్కడున్న సిబ్బందిని నిలదీశాడు. అంతే.. ఇక హోటల్ సిబ్బందికి, అబ్దుల్ కరీమ్ కు మధ్య వాగ్వాదం స్టార్ట్ అయ్యింది.
పీక రప్పారప్పా కోసేశారు.. 12 కుట్లు..?
ఈ వాగ్వాదం కాస్త.. పెద్ద గొడవకు దారి తీసింది. సిబ్బందికి, కరీంకు మధ్య మాటా మాట పెరిగి చివరకు దాడి చేసుకునే వరకు వెళ్లింది. దీంతో ఆవేశంలో హోటల్ సిబ్బందిలో ఒకరు కరీమ్ పై కత్తితో దాడికి దిగాడు. దాడిలో కరీమ్ మెడకు తీవ్ర గాయాలు అయ్యాయి. దాడి అనంతరం కరీమ్ అక్కడ జరిగిన పరిస్థితిని అంతా వీడియోలో చూపించాడు. అబ్దుల్ కరీం మెడభాగం పై తీవ్రగాయం కావడంతో డాక్టర్లు 12 కుట్లు వేసి వైద్యం అందించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కొత్త పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బాధితుడు సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేశాడు. వేరే ఫుడ్ ఆర్డర్ ఇచ్చారని అడిగినంత మాత్రాన కత్తితో పీక కోస్తారా.. అని ఓ వ్యక్తి హోటల్ సిబ్బందిని అడగినట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
ALSO READ: Ichthyosis Vulgaris: ఇదో వింత వ్యాధి, లక్షణాలు గుర్తించకపోతే ప్రాణాలకే ప్రమాదం
మరీ ఇంత ఘోరమా..?
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఓ నెటిజన్ ఈ విధంగా కామెంట్ చేశాడు. ఫుడ్ ఆర్డర్ తప్పుగా ఇవ్వడమే కాకుండా.. తిరిగి యువకుడిపైనే దాడి చేయడం ఏంటి..? అని కామెంట్ చేసుకొచ్చాడు. మరి కొంతమంది.. ‘ప్రశ్నించినందుకు కత్తితో అంత ఘోరంగా దాడి చేస్తారా..? ఇలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఫైరవుతున్నారు.
ఆర్డర్ ఇచ్చిన దోశ కాకుండా వేరే దోశ ఇచ్చారేంటని అడిగినందుకు కత్తితో దాడి
శనివారం రాత్రి విజయవాడ వెల్కమ్ హోటల్లో ఉప్మా దోశ ఆర్డర్ చేసిన అబ్దుల్ కరీం, ఏంటికి వెళ్లిచూడగా ప్లెయిన్ దోశ ఉండడంతో. తిరిగి హోటల్ కు తీసుకొచ్చి అడగగా మాటలు పెరిగి, సిబ్బంది కత్తితో గాయపరిచారు. #Vijawada pic.twitter.com/JOda2OjPiX
— Swetcha Daily News (@SwetchaNews) September 15, 2025
ALSO READ: Prasar Bharati: ప్రసార భారతిలో ఉద్యోగాలు.. అక్షరాల రూ.80,000 జీతం.. ఈ అర్హత ఉంటే చాలు