Gundeninda GudiGantalu Today episode September 16th : నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి ఏంటి ఆంటీ ఇంట్లో ఉండాలా వద్దా.. మీకు అరుపులు వినిపించలేదా..? రూం నుంచి బయటకు వచ్చేవరకు బాలు ఎలా గోల చేశాడో.. అసలు వీడికి రూమ్ ఎందుకు ఇవ్వాలి అని మనోజ్ అంటాడు.. దానికి సత్యం వాడు ఇన్నిరోజులు బయట పడుకోలేదా.. అందరు సమానంగా ఉండాలి. అమ్మ చెప్పినట్లే నేను చేస్తున్న నువ్వు కంగారు పడకు.. లేదంటే గది వేయించడానికి డబ్బులు ఇవ్వండి అంటాడు. నానమ్మ చెప్పినట్టు చేయాలి కదరా అందుకే నేను కూడా ఏం మాట్లాడలేకపోయాను అని ప్రభావతి చేతులెత్తేస్తుంది. దాంతో ఇక రోహిణి మనోజ్ కింద పడుకోవడానికి ఒప్పుకుంటారు..
బాలు రూమ్ లో ఎలా ప్రశాంతంగా నిద్రపోతాడు నేను చూస్తానని మనోజ్ పదేపదే తలుపు కొట్టి విసిగిస్తూ ఉంటాడు. ఇక బాలు కోపం వచ్చేసి అక్కడున్న వస్తువులన్నిటిని దుప్పట్లో మూటకట్టి పంపిస్తాడు. మళ్లీ ఎవరో డోర్ కొడుతున్నారని చూస్తే మీనా ఎదురుగా కనిపిస్తుంది. వీరిద్దరి మధ్య రొమాన్స్ హైలెట్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ప్రభావతీ చేత షాప్ ఓపెనింగ్ చేస్తే బాగుంటుందని ఇంట్లోని వాళ్ళందరూ అంటారు. దాంతో ప్రభావతి సంతోషంతో గాల్లో ఎగిరిపోతూ ఉంటుంది. మనోజు అమ్మచేతే షాప్ ఓపెనింగ్ చేస్తానని అనడంతో ఆమె సంతోషంలో మునిగిపోతుంది. తర్వాత రోజు ఉదయం అందరూ షాప్ దగ్గరికి వెళ్తారు. షాప్ ఓనర్ వచ్చి మిగిలిన డాక్యుమెంట్స్ అన్నీ మనోజ్ కి ఇచ్చి వెళ్తాడు. ఇక రిబ్బన్ కట్ చేయడానికి ప్రభావతి వెయిట్ చేస్తూ ఉంటుంది. కామాక్షి అక్కడికి వచ్చింది..
బ్యూటీ పార్లర్ పొద్దున్నే తెరవరు కదా అందుకే బ్యూటిషన్ ని ఇంటికి తీసుకుని వచ్చి మరి రెడీ అయి వచ్చేలాగా ఈ టైం అయింది. మీరంతా నాకోసం వెయిట్ చేస్తున్నారా ఇంక కాని వదిన రిబ్బన్ కట్ చేయు అని కామాక్షి అంటుంది. నీకోసం కాదు ఒక ఇంపార్టెంట్ వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నాను అని ప్రభావతి అంటుంది. శోభన కారులోంచి దిగుతుంది. మమ్మీ నా వి ఐ పి అని శృతి అంటుంది. నేనే పిలిచాను గొప్ప వాళ్ళని పిలిస్తే మన షాపు కూడా గొప్పగా ఉంటుందని అందుకే పిలిచాను అని అంటుంది ప్రభావతి.
మరి మీనా వాళ్ళ అమ్మని ఎందుకు పిలవలేదు అని సత్యము అడుగుతాడు. ఇంటి మీద రూపాయి పెట్టిన అదిరిపోయి కూడా అమ్ముడుపోని వాళ్ళని పిలిస్తే ఏమొస్తుంది అని ప్రభావతి అంటుంది. ఇక రిబ్బన్ కట్ చేసి షాప్ ని ఓపెన్ చేస్తుంది. మనోజ్ ని ఓనర్ సీట్ లో కూర్చోమని ప్రభావతి చెప్తుంది. ఇక మనోజ్ ని చూసిన అందరూ మురిసిపోతారు. రోజులు పార్కులో పడుకోవడం, గుడి దగ్గర అడుక్కోవడం వంటివి చేశాడు ఇప్పుడు వాడిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని బాలు కూడా పొగడ్తల వర్షం కురిపిస్తాడు..
అందరూ ఎవరికి కావాల్సిన సామాన్లు కొనుక్కుంటుంటే.. వీణ మాత్రం ఇంట్లోకి కావాల్సిన మిక్సీని కొనుక్కోవాలని అనుకుంటుంది.. బాలు దాని రేటు కూడా చాలా ఎక్కువగానే ఉంది ఇంట్లోకి అవసరం అంటావా అని అడుగుతాడు. శోభన మీ కాస్ట్ లో ఖరీదైన సోఫా ఏది ఉందొ అది చెప్పు అని అడుగుతుంది. ఇక ఆ సోఫా నీ శోభన లక్షల 50 వేలు పెట్టి కొంటుంది. చూసావా కామాక్షి డబ్బు ఉన్నోళ్లు డబ్బున్నోల్లే.. లక్ష యాభై వేలు పెట్టి సోఫా కొనింది అని ప్రభావతి గాల్లో తేలిపోతుంది.
ఇక మీనాక్షి మిక్సీ కొనడం చూసి ఈ మిక్సీ నువ్వు ఎందుకు కొన్నావ్ ఇప్పుడు మన షాపులనేదే కదా మనం తీసుకొని వెళ్దాంలే అని ప్రభావతి అంటుంది. ఇంట్లో రోజుకో రిపేరు వస్తుంది దాన్ని రిపేర్ చేయడానికి నాకు పని అయిపోతుంది అని మీనా అంటుంది. ఇక శృతి తనకు కావలసిన వస్తువులు తెచ్చుకుంటుంది. ఒకవైపు సత్యం మీనా చేత బోని చేస్తే మంచిదని అంటున్న సరే ప్రభావతి మాత్రం వదినగారు చేతనే చేయించాలి ఆమె లక్ష యాభై వేలు పెట్టి సోఫాను కొన్నారు అని అంటుంది.
Also Read: బిగ్ బాస్ 9 నామినేషన్స్.. అతనే సెకండ్ ఎలిమినేట్..? ఒక్కొక్కరికి షాక్..
ఇక మొత్తానికి శోభన ఫస్ట్ బోనీ చేస్తుంది. ఆ తర్వాత మీనా కూడా కొనుగోలు చేస్తుంది. ఇక రోహిణిని విజ్జి కావాలనే ఏదో ఒకటి అంటూ ఉంటుంది. అందరూ కలిసి షాప్ ని గ్రాండ్ గా ఓపెన్ చేసేస్తారు. అయితే అందరూ సంతోషంగా ఉన్నా సరే ప్రభావతి మీనా ను గోరంగా అవమానిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..