నటుడు మాధవ్ 2022లో నటించిన ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఈ చిత్రంలో ఆయన ప్రముఖ శాస్త్రవేత్త నంబి నారాయణన్ పాత్రను పోషించాడు. ఈ క్యారెక్టర్ కోసం ఆయన చాలా బరువు పెరిగాడు. సినిమా తర్వాత కేవలం 21 రోజుల్లోనే ఆయన బరువు తగ్గడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంత బరువు ఇంత త్వరగా ఎలా తగ్గాడు? అని ఆరా తీశారు. అయితే, ఆయన జిమ్ కు వెళ్లకుండా, వర్కౌట్స్ చేయకుండా బరువు తగ్గడం నిజంగా ఆసక్తికలిగించింది. ఇంతకీ ఆయన బరువు ఎలా తగ్గాడంటే..
తన బరువు తగ్గడంలో ఆహారం తినే సమయం, తినే విధానం కీలక పాత్ర పోషించినట్లు చెప్పాడు. అంతేకాదు, ఉపవాసం పాటించినట్లు వెల్లడించాడు. ఆహారాన్ని తినే సమయంలో హడావిడిగా కాకుండా చక్కగా నమిలి తిన్నట్లు చెప్పాడు. సాయంత్రం 6.45 గంటలకే డిన్నర్ పూర్తి చేసేవాడు. తాజాగా వండిన ఆహారం మాత్రమే తీసుకునేవాడు. ఉదయం ఎక్కువ సేపు నడిచేవాడు. రోజూ వీలైనంత త్వరగా నిద్రపోయేవాడు. నిద్రకు కనీసం గంటన్నర ముందు టీవీ, ఫోన్ చూడ్డం మానేసేవాడు. హైడ్రేటెడ్ గా ఉండేవాడు. రోజంతా చక్కగా నేచురల్ డ్రింక్స్ తీసుకునేవాడు.
మాధవ్ చాలా వరకు సంపూర్ణ ఆహారం తీసుకునేవాడు. అదీ నేచురల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకునే వాడు. ఆకు కూరలు, కూరగాయలతో పాటు సులభంగా జీర్ణమయ్యే భోజనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఎక్కువగా ప్రాసెస్ చేయబడిన ఫుడ్స్ అస్సలు తీసుకునేవాడు కాదు. జాగ్రత్తగా తినడం, ఒకేరకమైన శారీరక శ్రమ, సరైన విశ్రాంతి, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆయన బరువు సులభంగా తగ్గింది.
No exercise, No running… 😏
21 நாட்களில் மாதவன் உடல் மாற்றம், அது எப்படி சாத்தியம்? 🤔 pic.twitter.com/ssrATrqOnr— Aadhavan® (@aadaavaan) July 17, 2024
మాధవన్ ఆహారపు అలవాట్ల గురించి ఆరోగ్య నిపుణుడు డాక్టర్ పాల్ మాణిక్యం కీలక విషయాలు వెల్లడించారు. బరువు తగ్గడంలో ఆహారం, ఫిట్ నెస్ అనేది చాలా ముఖ్యం అన్నారు. బఆహారాన్ని పూర్తిగా నమలడం బరువు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. “ఎక్కువగా నమలడం వల్ల సహజంగా తినే వేగం తగ్గుతుంది. మెదడుకు సంతృప్తి సంకేతాలను గుర్తించడానికి అదనపు సమయం ఇస్తుంది. అదనపు కేలరీలను తీసుకునే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఈ అలవాటు జీర్ణ ప్రక్రియను పెంచుతుంది. శరీరం పోషకాలను మరింత సమర్థవంతంగా సేకరించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో గట్ హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తుంది. భోజనం తర్వాత శరీరం శక్తి వ్యయాన్ని స్వల్పంగా పెంచుతుంది. దీనిని థర్మోజెనిసిస్ అని పిలుస్తారు. మొత్తంగా ఇవన్నీ కలిపి ఆరోగ్యకరమైన బరువును మెయింటెయిన్ చేయడానికి సాయపడుతుంది” అన్నారు.
‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ జూలై 2022లో విడుదల అయ్యింది. ఈ సినిమా రూ. 25 కోట్ల బడ్జెట్ తో రూపొందితే, రూ. 50 కోట్లు సాధించింది. ఈ చిత్రం ప్రముఖ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితాన్ని ఆవిష్కరించింది. ఈ చిత్రంలో సిమ్రాన్ హీరోయిన్ గా నటించింది.
Read Also: పానీ పూరి తిని.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.. హైదరాబాద్ యువకుడికి భయానక అనుభవం!