BigTV English

TikTok Deal: టిక్‌టాక్ అమెరికా సొంతం!..యువత ఫుల్ ఖుషీ అన్న ట్రంప్

TikTok Deal: టిక్‌టాక్ అమెరికా సొంతం!..యువత ఫుల్ ఖుషీ అన్న ట్రంప్

TikTok Deal: సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ రీఎంట్రీ ఇవ్వనుందా? ఈ విషయంలో అమెరికా వెనక్కి తగ్గిందా? చైనాతో అగ్రరాజ్యం ఒప్పందం కుదుర్చుకుందా? మళ్లీ యూత్ దగ్గరకు టిక టాక్ రానుందా? అవుననే సంకేతాలు ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. దీనిపై చైనాతో చర్చలు ఎంతవరకు వచ్చాయి?


సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ గురించి చెప్పనక్కర్లేదు. తక్కువ సమయంలో ప్రపంచవ్యాప్తంగా యువతీ యువకులను ఆకట్టుకుంది. 2025 లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతీ నెలా 1.59 బిలియన్ నుంచి 1.8 బిలియన్ల యూజర్లు యాక్టివ్‌గా ఉన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఈ లెక్కన టిక్ టాక్ ఎంత పవర్‌ఫుల్ గా మారిందో చెప్పనక్కర్లేదు.

2029 నాటికి ఆ సంఖ్య 2.3 బిలియన్లకు చేరుకుంటుందని ఓ అంచనా. 15 సెకన్ల వీడియోను సృష్టించడానికి ఈ యాప్ యువతీయువకులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా జోక్స్‌ క్లిప్స్‌, వీడియో సాంగ్స్‌, సినిమా డైలాగ్స్‌కు తగ్గట్లుగా లిప్‌-బాడీ మూమెంట్స్‌ ఇవ్వడం దీని ప్రత్యేకత. ప్రస్తుతం టిక్ టాక్ 38 భాషలు భాషల్లో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.


చైనా టెక్ కంపెనీ బైటీ డ్యాన్స్‌ ఈ టిక్‌టాక్‌ను రూపొందించింది. 2016లో డౌయిన్‌ పేరుతో చైనా మార్కెట్లోకి వచ్చింది. ఆ తర్వాత ఏడాది టిక్‌టాక్‌ పేరుతో అంతర్జాతీయ మార్కెట్లలోకి ఈ యాప్‌ అడుగుపెట్టేసింది. 2018 నాటికి టిక్ టాక్‌కు ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ల వినియోగదారులను ఉన్నారు.

ALSO READ: లండన్ నిరసనలు.. గుణపాఠం ఎవరికి?

అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో అమెరికాలో టిక్ టాక్ క్లోజ్ అయ్యింది. అక్కడి న్యాయస్థానం ఆదేశాలతో యాప్ తన సేవలను నిలిపివేసింది. అమెరికా యూజర్ల డేటాను మాతృ సంస్థ బైట్ డాన్స్ ద్వారా చైనా ప్రభుత్వానికి చేరవేస్తోందని అగ్రరాజ్యం ప్రధాన ఆరోపించింది. దీన్ని నిషేధించేందుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది.

చైనా టెక్ కంపెనీ దాన్ని వదులు కోవాలని, లేకుంటే నిషేధం ఎదుర్కొంటారని హెచ్చరించింది. జరిగిన పరిణామాల నేపథ్యంలో టిక్ టాక్‌ను ఎలాన్ మస్క్ దక్కించుకుంటారనే వార్తలు బలంగా వినిపించాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రియాక్ట్ అయ్యారు.

దీని విషయంలో అమెరికా-చైనా అధికారుల మధ్య సమావేశం బాగా జరిగిందని ప్రకటించారు. దేశంలో యువత ఎక్కువగా కాపాడాలని కోరుకునే సంస్థ టిక్ టాక్ అని దీనిప చైనాతో ఓ ఒప్పందం కుదిరిందని ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. టిక్‌టాక్‌ యాజమాన్య హక్కులు అమెరికాకు దక్కాలన్నదే అంతిమ లక్ష్యమన్నారు ట్రంప్.

టిక్‌టాక్‌ యాజమాన్య హక్కులపై అమెరికా-చైనాల మధ్య ఒప్పందం కుదిరిందని అమెరికా ఆర్థిక మంత్రి బీసెంట్‌ ప్రకటించారు. టిక్‌టాక్‌ సమస్యల పరిష్కారానికి ప్రాథమిక స్థాయిలో ఒప్పందంపై ఇరువైపులా ఏకాభిప్రాయం కుదిరిందని చైనా అంతర్జాతీయ వాణిజ్య చెప్పారు. టిక్ టాక్ వ్యవహారంపై మరో వారంలో పూర్తిగా క్లారిటీ రావచ్చని అంటున్నారు.

Related News

Anti-immigrant Sentiment: లండన్ నిరసనలు.. ఎవరికి పాఠం, ఎవరికి గుణపాఠం?

Donald Trump: అక్రమ వలసలే అన్నిటికీ కారణం.. భారత సంతతి వ్యక్తి దారుణ హత్యపై ట్రంప్ స్పందన

London: నిరసనలతో దద్దరిల్లిన లండన్‌.. లక్షమంది హాజరు, అదే ప్రధాన ఎజెండా?

Japan Population: జపాన్‌లో వందేళ్లకు పైబడిన వారు 1,00,000 చేరువలో.. కారణం ఇదేనట

Russia Earthquake: మరోసారి రష్యాను వణికించిన భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ!

Nepal: నేపాల్ పార్లమెంట్ రద్దు.. తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి

Musk Vs Ellison: మస్క్ ని మించిన మొనగాడు.. ప్రపంచ నెంబర్-1 కుబేరుడు అతడే

Big Stories

×