Urvashi Rautela:బెట్టింగ్ భూతాన్ని పారద్రోలడానికి కేంద్రం గట్టి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ బెట్టింగ్ భూతం మాయలో పడి ప్రాణాలు కోల్పోతున్న ప్రజలను, యువతను కాపాడడానికి కేంద్రం కంకణం కట్టుకుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే టాలీవుడ్ పై పంజా విసిరిన ఈడీ అధికారులు.. దాదాపు 29 మంది సెలబ్రిటీలను విచారించారు. అందులో దగ్గుబాటి రానా (Daggubati Rana), మంచు లక్ష్మి (Manchu Lakshmi), ప్రకాష్ రాజ్ (Prakash Raj) వంటి దిగ్గజ సెలబ్రిటీలు కూడా ఉండడం గమనార్హం. ఇక వీరిందర్నీ విచారించిన అధికారులు ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే నిన్న ప్రముఖ రాజకీయ నాయకురాలు , మాజీ మంత్రి మిమీ చక్రవర్తి (Mimi Chakraborty)ని విచారించగా.. నేడు ఈడి ముందుకు బాలయ్య బ్యూటీ ఊర్వశీ రౌటేలా (Urvashi Rautela) హాజరుకానున్నారు. దీంతో అక్కడి పరిస్థితి ఉత్కంఠగా మారింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రముఖ నటి ఊర్వశి నేడు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరుకానున్నారు. ముఖ్యంగా ఈమె చేసిన బెట్టింగ్ ప్రమోషన్ గురించి అధికారులు ఈమెను ప్రశ్నించనున్నారు. అలాగే ఈ బెట్టింగ్ ప్రమోషన్ కోసం ఈమె తీసుకున్న డబ్బు, జరిపిన లావాదేవీలపై కూడా ఆరా తీయనున్నట్లు సమాచారం. ఇకపోతే ఇప్పటికే ఈ కేసులో మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ లకు ఈడి నోటీసులు పంపించి మరీ వీరిని విచారణ జరిపింది. ఇక ఈనెల 4వ తేదీన శిఖర్ ధావన్ ను ఏకంగా ఎనిమిది గంటల పాటు ఈడీ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. మరి నేడు విచారణకు హాజరుకానున్న ఊర్వశీ అక్కడ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.
ఊర్వశీ కెరియర్..
ఊర్వశీ కెరియర్ విషయానికి వస్తే.. ఉత్తరాఖండ్ హరిద్వార్ కి చెందిన ఈమె నటిగా, మోడల్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. హిందీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఊర్వశి.. తెలుగు సినిమాలలో కూడా నటిస్తోంది. మిస్ దివా యూనివర్స్ 2015 టైటిల్ ను గెలుచుకున్న ఈమె 2013లో ‘సింగ్ సాబ్ ది గ్రేట్’ అనే సినిమాతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత సనమ్ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4, పాగల్ పంతి వంటి చిత్రాలలో నటించింది.
ALSO READ:Ram Charan: పెద్ది కోసం బాలయ్య తల్లి.. పెదవి విరుస్తున్న ఫ్యాన్స్.. అసలేమైందంటే?
ఊర్వశీ సినిమాలు..
ఇక కన్నడ పరిశ్రమలో మిస్టర్, ఐరావత వంటి చిత్రాలతో ఆకట్టుకున్న ఊర్వశి.. తమిళ్ సినిమాలలో కూడా నటించింది. అలా 2022లో ది లెజెండ్ సినిమాలో కనిపించి ఆశ్చర్యపరిచింది. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ద్వారా తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇందులో “వేర్ ఇస్ ద పార్టీ” అనే ప్రత్యేక పాటలో తన పెర్ఫార్మెన్స్ తో అందరినీ అలరించింది. తర్వాత గత ఏడాది బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్ ‘ సినిమాలో లీడ్రోల్ పోషించి మెప్పించింది. ఇప్పుడు బెట్టింగ్ యాప్ కేసులో ఇరుక్కున్న ఈమె దీని నుంచి ఎలా బయటపడతారో చూడాలి.