Ram Charan:రామ్ చరణ్ (Ram Charan).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన.. మొదట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఇలాంటి కటౌట్ తో హీరోగా సక్సెస్ అవుతారా? అంటూ చాలామంది అవమానించారు. అయినా అవన్నీ ఎదుర్కొని..తన రెండవ సినిమా ‘మగధీర’ తోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు రామ్ చరణ్. ఆ తర్వాత భిన్నవిభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రామ్ చరణ్..’ఆర్ఆర్ఆర్’ సినిమా చేసి ఏకంగా గ్లోబల్ స్థాయి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఈ సినిమాతో అరుదైన గౌరవాలు కూడా అందుకున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ‘పెద్ది’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు రామ్ చరణ్. ‘ఉప్పెన’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్న బుచ్చిబాబు సన (Bucchibabu Sana) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇందులో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తోందని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమాలో రామ్ చరణ్ కు తల్లిగా వీజీ చంద్రశేఖర్ (Viji chandra shekhar) నటిస్తున్నట్లు సమాచారం.
అసహనం వ్యక్తం చేస్తున్న మెగా ఫ్యాన్స్..
అయితే ఇందులో ఫైర్ అవడానికి ఏముంది అని ఆలోచిస్తున్నారా..? అసలు కిటుకంతా ఇక్కడే ఉంది. ఎందుకంటే ఈమె ‘అఖండ’ సినిమాలో బాలయ్య బాబు(Balakrishna) కి తల్లిగా నటించింది. ఇప్పుడు అలాంటి ఈమెను రాంచరణ్ సినిమాలో రామ్ చరణ్ కు తల్లిగా తీసుకోవడంపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రి వయసు ఉన్న వ్యక్తికి తల్లిగా నటించిన ఈమె.. ఇప్పుడు రామ్ చరణ్ కి తల్లిగా చేయడం ఏంటి? ఇండస్ట్రీలో ఎంతమంది నటీనటులు ఉన్నారు కదా ఈమెను తీసుకోవడం ఏంటి? అంటూ ఫైర్ అవుతున్నారు. మరి ఈ విషయంపై దర్శకుడు బుచ్చిబాబు సనా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
వీజీ చంద్రశేఖర్ కెరియర్..
వీజీ చంద్రశేఖర్ విషయానికి వస్తే.. ప్రముఖ నటిగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. సినిమాలలోనే కాదు సీరియల్స్ లో కూడా నటించి ఆకట్టుకుంది. తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన విజి చంద్రశేఖర్.. పదుల సంఖ్యలో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది. ‘అళగి’ అనే టెలివిజన్ సీరియల్ ద్వారా తన నటనతో మంచి గుర్తింపును అందుకున్న ఈమె.. సినిమాలు, సీరియల్స్ అంటూ తీరిక లేకుండా పనిచేస్తుంది. అంతేకాదు వెబ్ సిరీస్లలో కూడా నటించింది. రియాల్టీ షోలు, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కూడా మంచి గుర్తింపును సొంతం చేసుకుంది వీజీ చంద్ర శేఖర్. ఇక అఖండ సినిమాలో బాలకృష్ణకు తల్లిగా నటించిన ఈమెను ఇప్పుడు రామ్ చరణ్ కి కూడా తల్లిగా తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలోనే.. మెగా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు