Malaika Arora : హీరోయిన్లు మరింత అందంగా కనిపించడానికి నిత్యం తమ బాడీని ఫిట్ ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు జిమ్ములకు వెళ్తూ చెమటలు కక్కేస్తుంటారు. కుర్ర హీరోయిన్ల నుంచి సీనియర్ హీరోయిన్ల వరకు అందరూ తమ ఫిజిక్ ని అలానే మెయింటైన్ చేయాలని అనుకుంటారు.. అయితే కొందరు 50 ప్లస్ లో ఉన్న వాళ్లు సైతం జిమ్ లో భారీ వర్కౌట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు జిమ్ లో కష్టపడుతుంటారు. తాజాగా హాట్ బ్యూటి మలైక అరోరా జిమ్ వర్కౌట్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో వదిలింది. అవే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకుంది. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక సాంగ్ కి అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఇప్పటికీ ఆ సాంగ్ ట్రెండ్ అవుతూనే ఉంది. అయితే ఈమె వయసు పెరుగుతున్న కూడా తరగతి అందంతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తుంది. అదంతా అందంగా ఉండడానికి కారణం జిమ్ లో భారీగా వర్కౌట్లు చేయడమే అని చాలా సందర్భాల్లో బయటపెట్టింది. తాజాగా తన పెట్ డాగ్ తో కలిసి జిమ్ లో వర్క్ అవుట్లు చేసింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి కాస్త నెట్టింట ట్రోల్స్ కి గురవుతున్నాయి.
మలైకా తన పప్పీ తో కలిసి యోగాభ్యాసం ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోగ్రాఫ్, పూల్ లో స్పెషల్ గాగుల్స్ తో కనిపించిన ఫోటోగ్రాఫ్, ఫైవ్ స్టార్స్ లో ఆహారం స్వీకరించే విధానం ఇలా అన్నీ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. ప్రస్తుతం కుక్కతో యోగాలు చేస్తున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఫోటోను చూసిన నెటిజన్లు దారుణంగా కామెంట్లు పెడుతున్నారు.. ఆఖరికి కుక్కను కూడా వదలవా ఇలా చేస్తున్నవేంటి అని ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి ఆ ఫోటోలు అయితే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి..
Also Read : ఆ బ్రాండ్ కోసమే గౌతమి ఇంత కుట్ర చేసిందా..? ఆర్జే చెప్పిన పచ్చి నిజాలు..
బోని కపూర్ తనయుడు అర్జున్ కపూర్ తో కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ఏ పార్టీలోనూ.. పబ్బులకు కలిసి వెళ్లేవారు. ఇంట్లో ఏదైనా ఫెస్టివల్స్ జరిగినా ఇంకేదైనా కార్యక్రమాలు జరిగినా ఈమె కచ్చితంగా హాజరయ్యేది. వీళ్ళ రిలేషన్ ను చూసి చాలామంది త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారని అనుకున్నారు. గణేష్ ఏమైందో తెలియదు కానీ వాళ్ళిద్దరూ బ్రేకప్ చెప్పేసారు.. ప్రస్తుతం అర్జున్ కపూర్ తన సినిమాల మీద ఫోకస్ చేశారు. మలైకా కూడా సినిమాల్లో నటించేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది.
?igsh=dTl0aXVwemI0ZDlx