Adabidda Nidhi Scheme-2025: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒకొక్కటిగా అమలు చేస్తోంది కూటమి సర్కార్. సూపర్ సిక్స్‌లో కేవలం ఒకటి లేదా రెండు పథకాలు మాత్రమే మిగిలివున్నాయి. తాజాగా మహిళలకు ఇవ్వనున్న మరో పథకం ‘ఆడబిడ్డ నిధి’ పథకం అమలపై దృష్టి సారించింది. దీనిపై సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు.
అమరావతిలో సోమవారం కలెక్టర్ల సమావేశంలో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు. సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ‘ఆడబిడ్డ నిధి’ స్కీమ్‌పై నోరు విప్పారు. ఈ పథకం అమలకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ఈ పథకంపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పడంతో దీనిపై క్లారిటీ వస్తుందని అంటున్నారు అధికారులు.
ఆడబిడ్డ నిధి స్కీమ్ కింద 18 నుండి 59 ఏళ్ల మధ్య మహిళలు ప్రతి నెలా 1,500 రూపాయలు అందుకోనున్నారు. ఏడాదికి రూ.18 వేలు ఆర్థిక సాయం అందించనుంది. అర్హులైన ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. 18 ఏళ్లు నిండిన బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలు అర్హులు.
ఎంపికైన లబ్ధిదారులకు ప్రతీ నెల వారి బ్యాంకు అకౌంట్లో 1500 రూపాయలు జమ చేయనుంది ప్రభుత్వం. ఈ పథకం కోసం లబ్దిదారులు ఆధార్ కార్డ్, వయసు నిర్ధారణ, బ్యాంక్ పాస్ బుక్ ఉండాల్సిందే. 2024-2025 బడ్జెట్‌లో ఈ పథకం కోసం రూ.3,341.82 కోట్లు నిధులు కేటాయించింది ప్రభుత్వం. బీసీ మహిళలకు రూ.1069.78 కోట్లు కేటాయించింది.
ALSO READ: పెన్నానదిలో పేకాట.. అడ్డంగా బుక్కైన యువకులు
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళల కోసం రూ.629.37 కోట్లు, మైనారిటీ ఆడ బిడ్డలకు రూ.83.79 కోట్లు, మిగతాది ఎస్సీ, ఎస్టీ వర్గాల మహిళల కోసం కేటాయించింది. ఈ పథకానికి అధికారిక వెబ్‌సైట్ అందుబాటులోకి రాలేదు. ఈ పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి ఆనం వెల్లడించిన విషయం తెల్సిందే.
దేశంలో అతిపెద్ద సంక్షేమ పథకం 64 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు ఇస్తోంది. తల్లికి వందనం ద్వారా చదువుకునే అందరి విద్యార్ధికి ఆర్ధిక సాయం చేసినట్టు చెప్పారు. దీనివల్ల ఎడ్యుకేషన్ సెక్టార్ లో పెను మార్పులు రానున్నట్లు చెప్పారు. ఉచిత బస్సు స్త్రీశక్తి పథకం ఆర్ధిక వ్యవస్థలో చాలా మార్పు వచ్చాయన్నారు. ఇది సాధ్యం కాదని చాలామంది చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇక దీపం-2 పథకం ద్వారా ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తోంది కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ ద్వారా మొదటి విడత రూ.7000 ఇచ్చింది. మరో రెండు విడతల్లో 13 వేలు ఇవ్వనుంది. ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర తరపున రూ.15000 ఇవ్వనుంది. దీనికి అక్టోబరు ఒకటి నుంచి శ్రీకారం చుట్టనుంది కూటమి సర్కార్.
సంపద సృష్టించి, ఆదాయాన్ని పెంచి, సంక్షేమం అమలు చేస్తామని చెప్పాం. అదే విధంగా సూపర్ సిక్స్‌ను సక్సెస్ చేశాం.
* దేశంలోనే అతిపెద్ద సంక్షేమ పథకం పెన్షన్లు. 64 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు ఇస్తున్నాం
* తల్లికి వందనం ద్వారా చదువుకునే ప్రతి విద్యార్ధికి ఆర్ధికసాయం చేస్తున్నాం
*… pic.twitter.com/fqxkqWxiHW— Telugu Desam Party (@JaiTDP) September 15, 2025