E-Paper
Advertisement

Puttaparthi: సత్యసాయి శతజయంతి ఉత్సవాలు.. ఐశ్వర్యరాయ్, సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Puttaparthi: సత్యసాయి శతజయంతి ఉత్సవాలు.. ఐశ్వర్యరాయ్, సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

Puttaparthi: సత్యసాయి జన్మించి 100 ఏళ్లు గడిచిపోయిందన్నారు బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్.ఆయన మనతో లేకపోయినా ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది గుండెల్లో ఎప్పటికీ ఉంటారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రజలకు సత్యసాయి చేసిన సేవలను గుర్తుచేశారు. సత్యసాయి నేర్పిన పాఠాలు, మార్గదర్శకత్వం, ఆచరించిన విధానాలు ఎప్పటికీ మనతో ఉంటాయన్నారు.

నిజమైన నాయకత్వం అంటే భగవంతుడికి, ప్రజలకు సేవ చేయడమేనని బాబా చెప్పేవారని తెలిపారు. సత్యసాయి ఛారిటీ ద్వారా ఏటా వేల మంది విద్యార్థులకు ఉచితంగా విద్య అందుతోందని, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో పేదలకు ఉచితంగా అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు.

Advertisement

ప్రధాని నరేంద్రమోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్. ఎప్పటిలాగే ప్రభావవంతమైన, స్ఫూర్తిదాయకమైన మీ మాటలను వినడానికి తాను ఎదురు చూస్తున్నానని అన్నారు. సత్యసాయి శతాబ్ది వేడుక.. పవిత్రతకు, మీ తెలివైన ప్రేరణాత్మక మాటల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మీ నాయకత్వం, మనిషికి సేవ చేయడం, దేవునికి సేవ అనే స్వామి సందేశాన్ని గుర్తు చేస్తుందన్నారు.

పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె, క్రమశిక్షణ, అంకిత భావం, భక్తి, దృఢ సంకల్పం, వివక్షత లక్షణాలు ఆధ్యాత్మిక జీవనానికి అవసరమైనవి ఐదు ముఖ్య లక్షణాలుగా చెప్పారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి ఇచ్చిన సందేశాన్ని గుర్తు చేసుకున్నారు.

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్య సాయిబాబా 100వ జయంతి వేడుకలు బుధవారం మొదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, మాజీ క్రికెటర్ సచిన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఈ సందర్భంగా మాట్లాడారు. శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బాబాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఐదో తరగతి చదివే రోజుల్లో తన జుట్టు కూడా సాయిబాబా జుట్టు మాదిరిగా ఉండేదని ఫ్రెండ్స్ చెప్పేవారని అన్నారు. అందుకే హెయిర్ కట్ చేయించుకునేందుకు తాను ఇష్టపడలేదన్నారు. 90వ దశకంలో తొలిసారి సత్యసాయిని కలిశానని చెప్పారు. నా మనసులో ఉన్న ప్రశ్నలకు అడగకుండానే బాబా సమాధానం చెప్పారని వివరించారు.

ప్రజల్ని జడ్జ్ చేయవద్దని, వారిని అర్థం చేసుకోవాలని సత్యసాయి చెప్పిన మాటలను గుర్తు చేశారు. వరల్డ్ కప్‌లో తాను ఆడినప్పుడు భావోద్వాగాలు అధికంగా ఉండేవని, ఆ సమయంలో బెంగుళూరులో తాను ఉన్నట్లు వివరించారు. సత్యసాయిబాబా ఫోన్ చేశారని, ఆ తర్వాత ఓ పుస్తకం పంపారని మనసులోని మాట బయటపెట్టారు. అది నాలో సానుకూల దృక్పథాన్ని, స్ఫూర్తిని నింపిందన్నారు. ఆ ఏడాది తాము ట్రోఫీ గెలుచుకున్నామని, అది తనకు గోల్డెన్ మూమెంట్స్ అని వెల్లడించారు.

 

 

https://twitter.com/bigtvtelugu/status/1991035108976177571

 

 

 

 

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×