E-Paper
Advertisement

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

ట్రావెల్ బస్సు బోల్తా,  హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది
Advertisement

Anantapur Accident:  శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదానికి గురైన హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తోంది. ఘటన సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. అసలు ఘటన ఎలా జరిగింది?

అనంతపురం జిల్లాలో ట్రావెల్ బస్సు

అనంతపురం జిల్లా రూరల్ మండలం పామురాయి సమీపంలోని గురువారం తెల్లవారుజామున శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. ప్రమాదానికి గురైన బస్సు హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తోంది. NL 02-B 5222 నంబర్ బస్సు ఇది. ఘటన సమయంలో సుమారు 30 మంది వరకు ప్రయాణికులు అందులో ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు నిద్రలో ఉన్నారు. ఏం జరిగిందో తెలుసుకునే సరికి బస్సులో బోల్తా పడింది. ఘటనతో ఒక్కసారిగా అలర్టయిన ప్రయాణికులు, తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేశారు.

హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్తున్న బస్సు

Advertisement

ప్రమాదం వెనుక అతివేగంగా కారణమని ఆరోపించారు ప్రయాణికులు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అదృష్టవశాత్తు ప్రయాణికులు ఎవరికీ ప్రాణహాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు సంబంధించి డ్రైవర్‌ని విచారిస్తున్నారు పోలీసులు.

ALSO READ: టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్,

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×