Nindu Noorella Saavasam Serial Today Episode: ఫారెస్ట్‌లోకి వెళ్లాక పార్థు దగ్గర రివాల్వర్ ఉందని గమనించిన మనోహరి ఎలాగైనా పార్థు గన్ లేకుండా చేయాలని ఆలోచించి ఇక్కడ మనం ఏంకాంతంగా ఉంటే మధ్యలో ఈ గన్ గోల ఏంటి..? అది కారులోనే పెట్టొచ్చు కదా..? అంటూ తన మాటలతో పార్థును కన్వీన్స్ చేస్తుంది. మనోహరి మాటలకు కన్వీ్న్స్ అయిన పార్థు వెళ్లి గన్‌ను కారులో పెట్టి వస్తాడు. అప్పుడే మనోహరి రౌడీలకు సైగ చేస్తుంది. రౌడీలు ముఖాలక మాస్కులకు పెట్టుకుని కత్తులు పట్టుకుని పార్థుకు ఎదురుగా వస్తారు. మర్యాదగా మీ దగ్గర ఉన్న నగలు, డబ్బులు ఇచ్చేయమని బెదిరిస్తారు.
మనోహరి భయపడినట్టు నటిస్తూ.. పార్తు బంగారం డబ్బులు ఇచ్చేద్దాం అంటుంది. అందుకు పార్థు వద్దు మనోహరి రేయ్ ఎవర్రా మీరంతా నేను ఎవరో తెలుసా..? నేనో ఐపీఎస్ ఆఫీసర్‌ను నా దగ్గరకే వచ్చి బెదిరిస్తున్నారా..? మిమ్మల్ని పట్టుకుని జైళ్లో వేస్తాను అంటూ బెదిరిస్తుంటే.. రౌడీలు కోపంగా అసలు నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్తే కదా అంటూ అటాక్ చేస్తారు. పార్థు రౌడీలను కొడుతుంటాడు. పార్థు దెబ్బలకు రౌడీల చేతుల్లో ఉన్న కత్తులు జారి పడిపోతాయి. అంతా గమనిస్తున్న మనోహరి కోపంగా వాడిని చంపడం వీరి వల్ల కావడం లేదు ఇక నేను పార్థును చంపేస్తాను అంటూ అటూ ఇటూ చూస్తుంది. అక్కడే పడిపోయిన కత్తి చూసి తీసుకుని పార్థును పొడిచేందుకు మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంది.
అప్పుడే అమర్, మిస్సమ్మ వస్తారు. పార్థు రౌడీలతో ఫైట్ చేయడం చూసి అమర్ గట్టిగా పార్థు అంటూ పిలుస్తూ పరుగెడుతుంటాడు. అమర్ మాటలు విని మనోహరి షాక్ అవుతుంది. చేతిలో ఉన్న కత్తి పడేసి తిరిగి చూస్తూ భయపడినట్టు నటిస్తూ.. అమర్ త్వరగా రా అమర్ వాళ్లు పార్థును చంపేస్తున్నారు అంటుంది. అమర్ పరుగెత్తుకుంటూ వెళ్లి రౌడీలను కొడుతుంటాడు. కొద్దిసేపటికి రౌడీలు పారిపోతారు.
రౌడీలు పారిపోయాక అమర్ అనుమానంగా మీరు ఇంత డీప్ ఫారెస్ట్ లోకి ఎందుకు వచ్చారు అని అడిగితే మా సంగతి సరే మీరు ఎందుకు ఎలా వచ్చారు అని పార్థు అడుగుతాడు. మిస్సమ్మే పట్టుపట్టి మరీ ఇక్కడకు తీసుకొచ్చింది అని అమర్ చెప్పగానే.. మనోహరి షాక్ అవుతుంది. అంటే మేము ఇటు వస్తున్నామని దీనికి తెలిసిపోయిందా..? అని భయపడుతుంది. భాగీ గారు మీకెలా తెలుసు మేము ఇక్కడకు వచ్చామని అని పార్థు అడిగితే.. ఏమో అలా అనిపించింది.. మా అక్కే నన్ను ఇటువైపు తీసుకొచ్చిందేమో అని చెప్పగానే.. పార్థు ఆశ్చర్యంగా ఆరుంధతి గారు తీసుకురావడం ఏంటి అని అడిగితే..
అవును పార్తు భాగీ ఒక్కోసారి వాళ్ల అక్క ఆత్మతో మాట్లాడుతుంది అని చెప్పగానే.. అవునా..? అంటూ పార్థు ఆశ్చర్యపోతాడు. అవునని మా అక్కే ఇటువైపు నన్ను నడిపించి ఉండొచ్చు పైగా మనోహరి మా అక్కకు ఫ్రెండ్ కదా అని చెప్తుంది. ఇంతకీ వాళ్లెవరు ఎందుకు దాడి చేశారు అని అమర్ అడిగితే వాళ్లు దారిదొపిడీ దొంగలట నగలు డబ్బు కోసం దాడి చేశారు అని పార్థు చెబితే.. అసలు మీ దగ్గర పెద్దగా నగలు, డబ్బు లేదు కదా ఎందుకు దాడి చేశారు అని మిస్సమ్మ అనుమానిస్తుంది. మనోహరి షాక్ అవుతుంది. అప్పుడే అమర్ సరే ఇంటికి వెళ్దాం పదండి అంటూ అందరినీ తీసుకుని ఇంటికి బయలుదేరుతాడు.
మరోవైపు ప్రచండ పూజ చేస్తుంటాడు. అప్పుడే వాళ్ల శిష్యుడు వచ్చి గురువు గారు ఈసారైనా ఆ పిల్లను బంధిస్తారా..? అని అడిగితే.. ఆ పిల్లలో ఉన్న అరుంధతి శక్తిని బంధించి తీరుతాను. అందుకే ఫైనల్‌గా అఘోర తాంత్రిక పూజ చేస్తున్నాను ఈ పూజలో ఆ ఆత్మ ఆట కట్టిస్తాను అని చెప్తుంటే.. ఇక్కడ ఇంట్లో ఉన్న బుజ్జమ్మ ఉలిక్కిపడుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.