BigTV English
Advertisement

Amaravathi Inner Ring Road Case: అమరావతిలో కాలిన కాగితం.. చెప్పే కథేంటి..?

Amaravathi Inner Ring Road Case:  అమరావతిలో కాలిన కాగితం.. చెప్పే కథేంటి..?
Amaravathi Inner Ring Road Case
Amaravathi Inner Ring Road Case

Amaravathi Inner Ring Road Case: తాడేపల్లి సీఐడీ ఆఫీస్.. పక్కనే తగలబడుతున్న పేపర్లు.. వాటిపై హెరిటేజ్, ఇన్నర్‌ రింగ్ రోడ్డు అని కనిపిస్తున్న పేర్లు. దట్సీట్.. ఇప్పుడీ మంట తాడేపల్లి కాంపౌండ్‌లో కాదు.. ఏపీ పాలిటిక్స్‌లో మొదలైంది. ఏ కేసులో అయితే చంద్రబాబు అరెస్ట్ అయ్యారో.. అదే కేసు పత్రాలు కాలిపోవడం ఓ చిచ్చును రేపింది. ఇంతకీ సీఐడీ పేపర్లను కాల్చింది ఎవరు? ఎందుకు కాల్చారు?


మీకు తెలంగాణ ఎన్నికల ముందు సీన్స్‌ గుర్తున్నాయా? సరిగ్గా ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కొన్ని కీలక ఆఫీసుల్లో వరుసగా అగ్ని ప్రమాదాలు జరిగాయి. కీలక డాక్యుమెంట్స్‌ అన్ని అగ్నికి ఆహుతయ్యాయి..అంటే ఫ్యూచర్‌లో కేసుల్లో ఇరుక్కున్నా ఎలాంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడటం అన్నమాట.. ఇప్పుడు ఏపీలో కూడా ఇలాంటి సీన్సే జరుగుతున్నాయి. సరిగ్గా ఎన్నికల ముందు డాక్యుమెంట్స్‌ తగలబడుతున్నాయి. అయితే ఏకంగా అధికారులే ఇక్కడ డాక్యుమెంట్స్‌ను తగులబెడుతున్నారు. ఇదే ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణమవుతోంది.

ఏపీ సీఐడీ.. గత కొన్నేళ్లుగా వివాదాలకు కేరాఫ్‌గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఆయన కుమారుడు లోకేష్‌ టార్గెట్‌గా పనిచేస్తుందన్న ప్రచారం ఉంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేసి రాజమండ్రి జైలుకు కూడా పంపింది సీఐడీ.. ఇవే కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులు, హెరిటేజ్‌పై కేసులు, ఫైబర్‌ నెట్‌లో కేసులు.. రాజధాని భూములకు సంబంధించిన కేసులన్ని కూడా సీఐడీనే డీల్ చేస్తుంది.


Also Read: ఏలూరులో తనిఖీలు.. 72 కిలోల బంగారం, లక్షల్లో నగదు స్వాధీనం..!

అలాంటి సీఐడీ ఆఫీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఓ సీన్ జరిగింది. ఈ సీన్స్‌ చూడండి.. ఓ సీఐడీ అధికారి కొన్ని డాక్యుమెంట్స్‌ను బయటికి తీసుకొచ్చారు. ఎవరిని దగ్గరికి రానివ్వలేదు.. పక్కనే కుప్పగా పోసి నిప్పు పెట్టారు. దీంతో ఈ ఇష్యూ వెనక ఏదో కుట్ర ఉందన్న ప్రచారం మొదలైంది. అయితే ఈ ప్రచారం నిజమని నమ్మేలా అక్కడ సీన్స్ కనిపించాయి. ఆ డాక్యుమెంట్స్‌లో హెరిటేజ్‌ పేరు కనిపించింది.ఇన్నర్‌ రింగ్ రోడ్డు కేసు డాక్యుమెంట్‌ అని కనిపించింది. దీంతో అక్కడ రగులుతున్న నిప్పుకు గాలి తోడైంది. టోటల్ మీడియా అటెన్షన్ ఆ పేపర్లపై పడింది.

మాములుగానే ఎలక్షన్ టైమ్.. ఈ ఇష్యూను అడ్వాంటేజ్‌గా తీసుకుంది టీడీపీ. చూశారా.. తప్పుడు కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను ఎలా తగలెట్టేస్తున్నారో చూడండి అంటూ విమర్శలు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు.

ప్రస్తుతం సీఐడీ చీఫ్‌గా రఘురామిరెడ్డి ఉన్నారు. ఆయనపై టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని. ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేశారు.
సో సిట్యూవేషన్స్‌ అన్ని టీడీపీ ఆరోపణలకు బలం చేకూర్చేలానే కనిపించాయి. బట్‌.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్టే నిజంగానే సీఐడీ అధికారులు తప్పుడు కేసులు నమోదు చేశారా? అందుకే భయపడి పేపర్లను తగలబెట్టేశారా? ఫైనల్‌గా సీఐడీ మానం వీడింది. టీడీపీ నేతలే కాదు. సామాన్యుల మెదళ్లలో తిరుగుతున్న ప్రశ్నలకు సీఐడీ సమాధానం చెప్పింది. హేరిటేజ్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు మాత్రమే కాదు. మరో మూడు కేసుల్లో ఇప్పటికే చార్జ్‌షీట్లు వేశాం.. ఒక్కో చార్జ్‌షీట్‌లో 8 నుంచి 10 వేల పేజీలున్నాయి.. వాటిని నిందితులకు కూడా ఇచ్చేశాం అని తెలిపింది. అయితే చార్జ్‌షీట్‌లు ప్రింట్ చేసే టైమ్‌లో కొన్ని సరిగా ప్రింట్ కాలేదని.. అలాంటి కాపీలను కాల్చివేయడం సిబ్బంది డ్యూటీ అంటూ క్లారిటీ ఇచ్చింది.

Also Read: MLC Iqbal joining tdp: వైసీపీకి మరో షాక్, టీడీపీలోకి ఎమ్మెల్సీ ఇక్బాల్, కారణం అదేనా?

అయితే ఈ క్లారిటీ కూడా ఇప్పుడు మరో కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారింది. టీడీపీ నేతలు ఇప్పుడు మరికొన్ని డౌట్స్‌ను రెయిజ్‌ చేస్తున్నారు. ఎలక్షన్ టైమ్.. ప్రస్తుతం ప్రతీది సెన్సిటివ్ ఇష్యూనే.. అందుకే తాడేపల్లిలో మొదలైన చిన్న నిప్పు.. ఏపీ పాలిటిక్స్‌లో దావాలనంలా మారింది. అయితే సీఐడీ ఇష్యూతో టీడీపీ ఏమాత్రం సాటిస్‌ఫై కావడం లేదు. ఈ ఇష్యూను ఈసీతోనే తేల్చుకుంటామని చెబుతోంది.

Related News

Amadalavalasa: ఆముదాలవలస లో వైసీపీ ముక్కలవుతుందా?

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

Top 20 News @ 9 PM: గ్రోత్ హబ్‌గా విశాఖ, కేటీఆర్‌కి వ్యతిరేఖంగా పోస్టర్స్

Spurious Ghee: కోటి సంతకాల సంగతి దేవుడెరుగు.. ముందు కల్తీ నెయ్యిలోనుంచి బయటపడేదెలా?

CM Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్.. ఇక తప్పు జరిగితే రెస్పాన్సిబిలిటీ మినిస్టర్లదే: సీఎం చంద్రబాబు

AP Cabinet Decisions: రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.. మరిన్ని కీలక నిర్ణయాలు

Top 20 News @ 8 PM: కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు ఆరోపణలు, ఉపాధ్యాయుడు దాడి.. వినికిడి కోల్పోయిన విద్యార్ధి

Top 20 News @ 7 PM: ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్.. త్రిషా ఇంటికి బాంబు బెదిరింపు..!

Big Stories

×