BigTV English

Gold Seized in Eluru: ఏలూరులో తనిఖీలు.. 72 కిలోల బంగారం, లక్షల్లో నగదు స్వాధీనం!

Gold Seized in Eluru: ఏలూరులో తనిఖీలు.. 72 కిలోల బంగారం, లక్షల్లో నగదు స్వాధీనం!
Gold Seize
Gold Seize

Gold Seize in Eluru during the Elections 2024: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఏలూరు జిల్లాలో భారీగా బంగారం పట్టుబడింది. ఏలూరులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా భారీగా బంగారం, వెండి ఆభరణాలు, లక్షల్లో నగదు పట్టుకున్నారు.


ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోకి నలుమూలల నుంచి వచ్చే వాహనాలను ప్రత్యేక స్క్వాడ్ బృందాలతో నిరంతరం తనిఖీ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఏలూరు జిల్లా కలపర్ను టోల్ గేట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ఒక కారులో 50 కిలోల బంగారం, వెండి, మరో కారులో 22 కిలోల బంగారం, వెండి ఆభరణాలను గుర్తించి పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.


Also Read: జనసేనకు చిరంజీవి భారీ విరాళం.. ఎన్ని కోట్లో తెలుసా..?

హనుమాన్ జంక్షన్ వద్ద పోలీసులు ఓ కారులో రూ.15 లక్షల నగదును గుర్తించి వాటిని పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న వాహనదారుల వద్ద సరైన గుర్తింపు పత్రాలు లేకపోవడంతో పోలీసులు వాటిని సీజ్ చేశారు. ఈ బంగారాన్ని విజయవాడ నుంచి భీమవరానికి తరలిస్తుండగా పట్టుకున్నామని పోలీసులు అధికారులు వెల్లడించారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×