BigTV English

Ambati on BRO movie : బ్రో మూవీపై వివాదం.. పృథ్వీ డాన్స్ పై అంబటి ఫైర్..

Ambati on BRO movie : బ్రో మూవీపై వివాదం.. పృథ్వీ డాన్స్ పై అంబటి ఫైర్..
Ambati Rambabu fires on BRO movie

Ambati Rambabu fires on BRO movie(Telugu cinema news): పవర్ స్టార్ బ్రో మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. అదే సమయంలో ఈ సినిమాలో ఓ డ్సాన్స్ స్వీకెన్స్ పై వివాదం రేగింది. ఓ పొలిటికల్ రీయల్ సీన్ ను బ్రోలో పేరడీ చేయడమే ఈ వివాదానికి మూలకారణం. ఈ ఏడాది సత్తెనపల్లె నియోజకవర్గంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు గిరిజన మహిళలతో కలిసి సరదాగా డాన్స్ చేశారు. ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సంబరాల రాంబాబు అంటూ కొందరు కామెంట్స్ చేశారు. అయితే ఆ సీక్వెన్స్‌ను బ్రో సినిమాలో నటుడు పృథ్వీతో పేరడీ చేసి చూపించారు. అప్పడు అదే వివాదాన్ని రేపుతోంది.


పృథ్వీ బ్రో మూవీలో శ్యాంబాబు క్యారెక్టర్‌ చేశారు. మంత్రి అంబటి రాంబాబు ఉద్దేశించే ఈ పాత్రను డిజైన్ చేశారని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు చురకలు అంటించారు. గెలిచినోడి డాన్స్ సంక్రాంతి .. ఓడినోడి డాన్స్ కాళరాత్రి .. అంటూ ట్వీట్ చేశారు.ఈ ట్వీట్ ను నేరుగా పవన్‌ కల్యాణ్‌కే ట్యాగ్‌ చేశారు.

పేరడీ సీన్‌ పేరుతో తనను హేళన చేసే ప్రయత్నం చేశారని మంత్రి అంబటి రాంబాబు ఫైరయ్యారు. పవన్‌పై విమర్శలు గుప్పించారు. పవన్‌ది శునకానందమని మండిపడ్డారు. తనను రాజకీయంగా ఎదుర్కొనలేకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. సంక్రాంతికి తాను చేసిన డ్యాన్ ను ఆనందతాండవంగా పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా నెగ్గి.. మంత్రి అయిన ఆనందంలో చేశానన్నారు. తాను ఎవరి దగ్గరో ప్యాకేజీ తీసుకునో డ్యాన్సులు చేయనని స్పష్టం చేశారు. అసలు రాజకీయాలకు పవన్‌ సింక్‌ అవ్వడు అంటూ అంబటి రాంబాబు సెటైర్లు చేశారు.


Related News

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Big Stories

×