హీరో కంపెనీ నుంచి మరో ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులోకి రాబోతోంది. మోస్ట్ పాపులర్ మోడల్ అయిన స్ప్లెండర్ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేయబోతోంది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్‌లలో స్ప్లెండర్ ప్లస్ ఒకటి. ఈ బైక్ ఎలక్ట్రిక్ వెర్షన్ లో వస్తే బాగుంటుందని చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఎలక్ట్రిక్ స్ప్లెండర్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది. ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 400 కి.మీ రేంజ్ ను అందించబోతున్నట్లు తెలిపింది. ఇక బైక్ కు సంబంధించిన ధర, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
తాజాగా రిపోర్టుల ప్రకారం ఈ బైక్ 4.2kWh సామర్థ్యం గల లిథియం-అయాన్ బ్యాటరీతో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యాన్ని కలిగి ఉంటుంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 45 నిమిషాలు మాత్రమే పడుతుంది. పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత ఈ బైక్ ఏకంగా 400 కిలోమీటర్లు హాయిగా నడిపే అవకాశం ఉంటుంది. హీరో ఎలక్ట్రిక్ బైక్ 5.2kW శక్తివంతమైన BLDC ఎలక్ట్రిక్ మోటారుతో రానుంది. ఇది కేవలం 3 సెకన్లలో గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు ఉంటుందని తెలుస్తోంది.
హీరో ఎలక్ట్రిక్ బైక్ త్వరలోనే మార్కెట్లోకి విడుదల కానుంది. చూడ్డానికి అచ్చ పాత బైక్ లాగే కనిపించనుంది. ఈ బైక్ లో మీరు 5.5-అంగుళాల AMOLED టచ్ స్క్రీన్, వాయిస్ కంట్రోల్, అప్లికేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, రివర్స్ మోడ్, రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, USB ఛార్జింగ్ పోర్ట్ మొదలైన పలు ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
Read Also: షాకింగ్.. రైలు నుంచి విడిపోయిన బోగీలు, గంట వ్యవధిలో ఏకంగా రెండుసార్లు!
తాజా నివేదికల ప్రకారం హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ వెర్షన్ 2026 నాటికి మార్కెట్లో లాంచ్ అవుతుందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ధర దాదాపు రూ. 69000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ బైక్ మార్కెట్లోకి వస్తే, ఇప్పటి వరకు ఉన్న అన్ని ఎలక్ట్రిక్ బైకులను తలదన్నే అవకాశం ఉంటుంది. ఇండియాలో ఇప్పటికే నెంబర్ వన్ బైక్ గా హీరో స్ప్లెండర్ గుర్తింపు తెచ్చుకుంది. ఎలక్ట్రిక్ వెర్షన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా అదే దూకుడును కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే కంపెనీ ఈ బైక్ కు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంటుంది.
Read Also: ప్రత్యేక రైళ్ల బుకింగ్ షురూ.. వెంటనే పండుగ సీజన్ టికెట్లు బుక్ చేసుకోండి!