Smart phones 2025: ఈ రోజుల్లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలంటే సగటు ఖర్చు రూ.30వేల పైగా అవుతుంది. కానీ మధ్యతరగతి కుటుంబాలకు ఇది భారంగా మారింది. మీకు అందుబాటులో ఉండే, అందమైన డిజైన్, ప్రీమియం ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు కేవలం రూ.20,000 లోపు అందుబాటులో ఉన్నాయి. పనితీరు, శక్తివంతమైన కెమెరా, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్‌తో కూడిన ఈ ఫోన్లు మీకు అందుబాటులో ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు? ఈ బడ్జెట్‌లో ఉత్తమ ఫోన్‌ను మీరే ఎంచుకోండి!
CMF Phone 2 Pro
సిఎంఎఫ్ ఫోన్ 2 ప్రో కేవలం 15,999 రూపాయల నుండి లభిస్తుంది. దీని ప్రత్యేకత యూనిక్ బ్యాక్ ప్యానెల్, స్క్రూ-బేస్డ్ యాక్సెసరీలు, ప్రీమియం లుక్. 6.77-అంగులాల అమోలేడ్ డిస్‌ప్లే 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ విజువల్స్ ఇస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెసర్ రోజువారీ టాస్క్‌లు, లైట్ గేమింగ్‌కు సరిపోతుంది. 50ఎంపి ప్లస్ 50ఎంపి ప్లస్ 8ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరాతో ఫోటోలు స్పష్టంగా వస్తాయి. 5000mAh బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఒక రోజు వినియోగానికి సరిపోతుంది.
OnePlus Nord CE 4 Lite
వన్‌ప్లస్ నార్డ్ సిఈ 4 లైట్ ఫోన్ గురించి మాట్లాడితే.. 19,999 రూపాయల వద్ద ప్రారంభమవుతుంది. 6.67-ఇంచ్ అమోలేడ్ డిస్‌ప్లే సూర్యకాంతిలో కూడా స్పష్టమైన విజువల్స్ ఇస్తుంది. 5500mAh బ్యాటరీని 80డబ్ల్యూ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా కొద్ది నిమిషాల్లోనే ఛార్జ్ చేయవచ్చు. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ రోజువారీ మల్టీటాస్కింగ్‌లో స్మూత్‌గా పనిచేస్తుంది, కెమెరా 50ఎంపి ప్లస్ 16ఎంపి ఫ్రంట్ సెట్‌తో మంచి ఫోటోలు ఇస్తుంది.
Also Read: Smartphone Comparison: పోకో X7 ప్రో vs ఓప్పో F31 vs రియల్మీ P4 ప్రో.. ఏది బెస్ట్?
Realme P3
రియల్‌మీ పి3 16,999 రూపాయల వద్ద, ఐపి69 రేటింగ్‌తో వాటర్, డస్ట్ రెసిస్టెంట్. 6.67-ఇంచ్ అమోలేడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్, 50ఎంపి ప్లస్ 16ఎంపి కెమెరా, 6000mAh బ్యాటరీ, 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ రెండు రోజుల వినియోగానికి సరిపోతుంది.
Oppo K13
ఒప్పో కె13 గురించి మాట్లాడుకుంటే, ఈ ఫోన్ 17,999 రూపాయల వద్ద 7000mAh బ్యాటరీ, 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్, 6.67-ఇంచ్ అమోలేడ్ డిస్‌ప్లే, 50ఎంపి కెమెరా, కలర్ఓఎస్ 15 తో లాంగ్ బ్యాటరీ లైఫ్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.
Tecno Pova Curve
టెక్నో పోవా కర్వ్ గురించి మాట్లాడితే, ఇది కేవలం15,999 రూపాయల వద్ద, 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలేడ్ డిస్‌ప్లే 144హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 64ఎంపి ప్లస్ 13ఎంపి కెమెరా, 5500mAh బ్యాటరీ, AI ఫీచర్స్, డాల్బీ అట్మాస్ సౌండ్ వంటి ప్రత్యేక ఫీచర్స్ అందిస్తుంది. 20,000 రూపాయల లోపు ఈ ఫోన్‌లు బడ్జెట్ యూజర్లకు అద్భుతమైన ప్రాముఖ్యతను ఇస్తాయి. బ్యాటరీ, కెమెరా లేదా స్టైల్ అవసరాలను బట్టి మీకు సరిపడిన ఫోన్ ఎంచుకొని ఆన్‌లైన్ రివ్యూలను పరిశీలించి కొనడం మంచిది.