Animal Park Update : ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ దర్శకుడిగా పేరు గాంచిన సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ‘యానిమల్’ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. సాధారణంగానే సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో డేర్ సన్నివేశాలతో పాటు హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి అనే విషయం తెలిసిందే. యానిమల్ సినిమాలో మాత్రం రణబీర్ కపూర్ ని చాలా భిన్నంగా చూపించారు. అలాగే తండ్రి మీద అపారమైన ప్రేమ ఉన్న కొడుకుగా.. భార్య మీద ప్రేమ ఉన్న భర్తగా..ఇలా అన్ని కోణాల్లో రణబీర్ కపూర్ ని చూపించారు. అయితే ఈ సినిమాలో ఉన్న హింసాత్మక సన్నివేశాలను చాలామంది విమర్శించారు కూడా.. అయినా సరే ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇదంతా పక్కన పెడితే.. 2023 లో వచ్చిన యానిమల్ మూవీకి సీక్వెల్ గా యానిమల్ పార్క్ ఉంటుందని సినిమా చివర్లోనే హింట్ ఇచ్చేశారు డైరెక్టర్. దాంతో యానిమల్ పార్క్ మూవీలో రణబీర్ కపూర్ మరింత వైల్డ్ గా కనిపించబోతున్నట్టు ఇప్పటికే వార్తలు వినిపించాయి.
అయితే తాజాగా రణబీర్ కపూర్ ఇంస్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడుతూ యానిమల్ పార్క్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం రణబీర్ కపూర్ ఇచ్చిన అప్డేట్ తో అభిమానులు చాలా ఎక్సైట్ అవుతున్నారు. మరి ఇంతకీ యానిమల్ పార్క్ పై రణబీర్ కపూర్ ఇచ్చిన క్రేజీ అప్డేట్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
also read:OG Movie Tickets : టికెట్ కొంటే బిర్యానీ ఫ్రీ… పవన్ మూవీకి ఇవేం తిప్పల్రా సామి
ఆసక్తి పెంచిన రణబీర్ కపూర్..
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రణబీర్ కపూర్ హీరోగా.. రష్మిక మందన్నా హీరోయిన్ గా..త్రిప్తి డిమ్రీ సెకండ్ హీరోయిన్ గా.. బాబీ డియోల్ విలన్ గా.. అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన యానిమల్ మూవీ 2023 లో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ త్వరలోనే రాబోతుంది అంటూ తాజాగా ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు రణబీర్ కపూర్. ఆయన తన ఇంస్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడుతూ.. “యానిమల్ పార్క్ సినిమా గురించి చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. 2027 లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వబోతోంది.ప్రస్తుతం సంగీతం గురించి,పాత్రల గురించి సందీప్ రెడ్డి వంగా తో చర్చిస్తున్నాను…ఈ మూవీ సెట్స్ లో పనిచేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నాను..” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
స్పిరిట్ మూవీ అయిపోయిన వెంటనే..
రణబీర్ కపూర్ వ్యాఖ్యలతో బీటౌన్ మొత్తం యానిమల్ పార్క్ గురించే చర్చించుకుంటున్నారు. యానిమల్ సినిమానే అలా ఉంది అంటే యానిమల్ పార్క్ మూవీ ఎలా ఉంటుందో అని తెగ ఎగ్జైట్ అవుతున్నారు. అయితే ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ (Prabhas) తో స్పిరిట్ మూవీ చేసే బిజీలో ఉన్నారు. ఒకవేళ ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరి వరకు పూర్తయితే వచ్చే యేడాది యానిమల్ పార్క్ మూవీ షూటింగ్లో డైరెక్టర్ జాయిన్ కాబోతున్నట్టు తెలుస్తోంది.
రణబీర్ కపూర్ రాబోయే సినిమాలు..
రణబీర్ కపూర్ రాబోయే సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన నితేష్ తివారి డైరెక్షన్లో వస్తున్న రామాయణ మూవీలో రాముడి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగం వచ్చే యేడాది అనగా 2027 దీపావళికి విడుదల కాబోతోంది. అలాగే సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో రాబోతున్న లవ్&వార్ సినిమాలో కూడా రణబీర్ కపూర్ నటిస్తున్నారు. అలాగే బ్రహ్మాస్త్ర సీక్వెల్ లో కూడా రణబీర్ కపూర్ నటించబోతున్నారు.
Ranbir Kapoor Drops An Exciting Update On Animal Park And Fans Can’t Keep Calm As He Reveals He Can’t Wait To Be Back On Set
.
.
.#RanbirKapoor #AnimalPark #Bollywood #Movies #FilmNews #Entertainment #FYP #Explore #Viral #Trending #Instagram #IndiaForums pic.twitter.com/NjAvdYCzSW— India Forums (@indiaforums) September 29, 2025