BigTV English

YCP MLA’s in Assembly: అసెంబ్లీలో మాట్లాడని వైసీపీ ఎమ్మెల్యేలు.. గెలిచి ప్రయోజనమేంటి.?

YCP MLA’s in Assembly: అసెంబ్లీలో మాట్లాడని వైసీపీ ఎమ్మెల్యేలు.. గెలిచి ప్రయోజనమేంటి.?

YCP MLA’s in Assembly: ఫ్యాన్ పార్టీలో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు తెగ మదన పడుతున్నారట. అటు అసెంబ్లీకి వెళ్ళలేక ఇటు పార్టీలో సరైన ప్రాధాన్యత దొరకడం లేదని ఆవేదన చెందుతున్నారట. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచింది 11 మంది ఎమ్మెల్యేలే. దాంతో 10% సీట్లు కూడా దక్కించుకోలేని వైసీపీ‌కి ప్రధాన ప్రతిపక్ష హోదా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌కి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కకుండా పోయాయి. ఇక ఆ కోపంతో అసెంబ్లీకి గైర్హాజరవుతున్న జగన్ ఎమ్మెల్యేలను కూడా శాసన సభలోకి రానీయటం లేదు. ఆ క్రమంలో వైసీపీ నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు గెలిచి ఉపయోగం ఏంటని కలవరం చెందుతున్నారట.


అసెంబ్లీలో జనసేనకు 21.. వైసీపీకి 11 స్థానాలు

మొత్తం 175 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ 11 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. తెలుగుదేశం జనసేన బీజెపీల కూటమి ఏకంగా 164 స్థానాలు కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ 135 సీట్లు జనసేన 21 స్థానాలు బీజెపీ ఎనిమిది నియోజక వర్గాల్లో విజయం సాధించాయి. జనసేన అయితే 100% స్ట్రైక్ రేట్‌తో పోటీ చేసిన 21 స్థానాలు గెలుపొంది. ఆ క్రమంలో 11 సీట్లకు పరిమితమై మొత్తం సీట్లలో 10% కూడా దక్కించుకోలేకపోయిన వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. సభా నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా ఇవ్వడం అసాధ్యమని చెప్పడంతో జగన్ తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందే అని స్పీకర్‌కి లేఖ రాయడంతో పాటు న్యాయ పోరాటం మొదలుపెట్టారు.


అసెంబ్లీలో ఇప్పటి వరకు మాట్లాడని వైసీపీ ఎమ్మెల్యేలు

కోర్టుల్లో ఏది తేలకపోవడం.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతూ ఉండడంతో వైసీపీ అధ్యక్షుడు జగన్ తనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు అసెంబ్లీకి హాజర్ కారని ప్రకటించారు. ఆ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలది ఒక చిత్రమైన పరిస్థితిగా మారిందట. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభంజనంలోను గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఇప్పటివరకు మాట్లాడలేదు. వైసీపీకి చెందిన హేమ హేమీలు అంతా ఓటమి పాలయ్యారు. గెలిచిన వాళ్ళలో జగన్, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి, మరో ఇద్దరు ముగ్గురిని పక్కన పెడితే చాలా మంది ఎమ్మెల్యేలు కొత్తవారే.

నియోజకవర్గంలో ప్రజలు ముందు దోషులుగా నిలబడుతున్న ఎమ్మెల్యేలు

అంతటి ఎదురీతలోను గెలిచి సభలో కొత్తగా ఎన్నికైన వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షుడు నిర్ణయంతో 15 నెలలుగా సభకు వచ్చి అధ్యక్ష అనే ఛాన్స్ ని కోల్పోయారు. అదే సమయంలో ఇటు నియోజక వర్గంలో ప్రజల ముందు వారు దోషులుగా నిలబడిన పరిస్థితి. వైసీపీ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్ళు తాము మొదటిసారి గెలిచామని అసెంబ్లీకి వెళ్ళాలని కోరుకుంటున్నట్లు జగన్ను అభ్యర్థించారట. ఈ సందర్భంలోనే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి నేతృత్వంలో మీరు అసెంబ్లీకి వెళ్ళాలని జగన్ సూచించారట. అయితే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మాత్రం అసెంబ్లీకి పోవడం తనకు ఇష్టం లేదని జగన్ కి తేల్చి చెప్పారట ఈ నేపథ్యంలోనే అసెంబ్లీకి వెళ్ళాలన్న ఆలోచన వైసీపీ కొత్త ఎమ్మెల్యేలు విలవించుకున్నారట. అధ్యక్షుని దిక్కరించలేక సమావేశాలకు వెళ్ళలేక కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటున్నారు.

తక్కువ మంది సభ్యులున్నా సభలో గట్టిగా వాయిస్ వినిపించే అవకాశం

వైసీపీ ఎమ్మెల్యేలను సభకు పంపిస్తే ప్రభుత్వాన్ని నిలదీస్తారు. అది కాదు అనుకుంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. ఆ విధంగా పొలిటికల్ గా వైసీపీ హైలైట్ కావడానికి ఎంతో ఉపయోగం ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల మాట. గతంలోనే తక్కువ సభ్యులు ఉన్న పార్టీలు కూడా సభలో బలమైన వాయిస్ వినిపించిన సందర్భాలు ఉన్నాయి. నిజం చెప్పాలంటే కరెక్ట్ స్ట్రాటజీ కూడా అదే అని అంటుంటారు. కానీ వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను ఏమి కాకుండా చేశారు అని అంటున్నారు. అంతేకాకుండా డమ్మీలుగా మార్చేశారా అన్న చర్చ కూడా సాగుతుంది.

వైసీపీకి బలంగా ఉండాల్సిన గెలిచిన ఎమ్మెల్యేలు

వైసీపీకి గెలిచిన ఎమ్మెల్యేలే బలం వారి పార్టీకి ఉన్న పెద్ద ఆస్తిగా చూడాల్సి ఉంది. వారిని ముందుపెట్టి వైసపీ రాజకీయం చేయాలి. జగన్ అసెంబ్లీకి రాదలుచుకోకపోతే ఆయన తనవరకు ఆగిపోయిన తన ఎమ్మెల్యేలను సభకు పంపించి ప్రజా సమస్యల మీద చర్చ జరిగేలా చూడొచ్చనేది రాజకీయ విశ్లేషకుల మాట. అలా చేస్తే సభలో ప్రజా సమస్యలపై వైసీపీ వానిని వినిపించే అవకాశం ఉంటుంది. అయితే ఎమ్మెల్యేల సేవలను కూడా జగన్ పూర్తి స్థాయిలో వాడుకోవడం లేదని చర్చ నడుస్తుంది. కూటమి ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలంటే ఓడిపోయిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలకి ఆ బాధ్యత అప్పగిస్తున్నారు. వారే మీడియా ముందుకు వస్తున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉంటే ఓడిన ఎమ్మెల్యేలు మాత్రం మీడియా ఫోకస్ తీసుకుంటూ ఉండడం వైసీపీ ఎమ్మెల్యేలు చర్చగా మారుతుంది. పోనీ పార్టీ ఎమ్మెల్యేలకు పార్టీ పదవుల్లో అయినా సముచిత స్థానం దక్కుతుందా అంటే అది లేదంటున్నారు.

Also Read: జగిత్యాలలో దారుణం.. మెసేజ్‌ చేశాడని.. కొట్టి చంపేశారు

ఇటు పార్టీలో తగిన ప్రాధాన్యత లభించడం లేదని అటు అసెంబ్లీలో కూడా పూర్తి స్థాయిలో తమ పాత్ర పోషించలేకపోతున్నారని కొత్తగా ఎన్నికైన ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలు మదన పడుతున్నారట అయితే ఇవన్నీ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలు కావడంతో పార్టీ అధ్యక్షుని నిర్ణయాలను ప్రశ్నించే సాహసం ఎవరు చేయలేకపోతున్నారట..

Related News

AP News: పోరుబాటలో గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగులు.. వాట్సాప్‌ గ్రూప్‌‌ల నుంచి ఎగ్జిట్, అక్టోబర్ ఒకటిన

Ntr Vidya Lakshmi Scheme 2025: ఏపీలో డ్వాక్రా మహిళలకు కొత్త పథకాలు.. ఒక్కొక్కరికి లక్ష

AP Ministers: దక్షిణ కొరియాలో ఏపీ మంత్రులు.. ఎందుకు వెళ్లారంటే?

AP Power Charges: ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. నవంబర్ నుంచి తగ్గనున్న విద్యుత్ బిల్లులు

Tirumala Garuda Seva: భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. అంగరంగ వైభవంగా శ్రీవారి గరుడ సేవ

GST Relief To Farmers: జీఎస్టీ తగ్గింపుతో రైతులకు భారీ ఊరట.. వేటిపై ధరలు తగ్గనున్నాయంటే?

AP Weather: అక్టోబర్ 1 నాటికి మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ప్రాజెక్టుల్లో వరద ప్రవాహాలు

Big Stories

×