Flight Tickets Offers 2025: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తన ప్రయాణికులకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి నెల జీతం వచ్చే సమయానికి అందించే “పే డే డీల్స్” ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మారాయి. తక్కువ ధరల్లో ఎక్కువ ప్రయాణం చేయాలని కలగంటున్న వారికి ఇది బంగారు అవకాశమే అని చెప్పాలి.
తక్కువ ధరకు విమాన టికెట్లు
దేశీయ విమానాల కోసం కేవలం 1200 రూపాయల నుండి టికెట్లు అందిస్తుండగా, అంతర్జాతీయ రూట్లలో కేవలం 3724 రూపాయల నుండి టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా ఇంత తక్కువ ధరలు ఎయిర్ ట్రావెల్‌లో చూడటం అరుదు. అందుకే ఈ ఆఫర్ గురించి తెలిసిన వారు ఆలస్యం చేయకుండా వెంటనే బుకింగ్ చేసుకోవడం మంచిది.
ఎప్పటి వరకు అంటే..
ఈ పే డే డీల్స్ సెప్టెంబర్ 28 నుండి అన్ని ఛానల్స్‌లో బుకింగ్‌కి అందుబాటులో ఉంటాయి. కానీ ఒక రోజు ముందుగానే, అంటే సెప్టెంబర్ 27 నుంచే స్పెషల్ యాక్సెస్ ఓపెన్ అయింది. దీనికి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అధికారిక వెబ్‌సైట్ లేదా AIX మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవాలి. అలాగే “FLYAIX” అనే కోడ్ ఉపయోగిస్తే ముందస్తు బుకింగ్ ప్రయోజనం లభిస్తుంది. దీని వలన మీరు ఇతరుల కంటే ముందే తక్కువ రేట్ల టికెట్లు సొంతం చేసుకోవచ్చు. బుకింగ్ డేట్ సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 1 వరకు కొనసాగుతుంది.
Also Read: Smart phones 2025: టాప్ 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్.. రూ. 20 వేల కంటే తక్కువ బడ్జెట్ ఫోన్లు ఇవే..
ఎప్పటి వరకు ఉపయోగించుకోవచ్చు
కానీ ట్రావెల్ మాత్రం అక్టోబర్ 12 నుండి నవంబర్ 30 వరకు చేసుకోవచ్చు. అంటే దసరా తర్వాతి ఫ్యామిలీ ట్రిప్స్ కానీ, దీపావళి హాలిడేస్ కానీ, వర్క్ రీలేటెడ్ ట్రావెల్స్ కానీ ప్లాన్ చేసుకోవడానికి ఇది అద్భుతమైన టైమ్. తక్కువ ధరల్లో బుకింగ్ అయ్యాక మనం సౌకర్యంగా ప్రయాణం చేయవచ్చు.
విమానంలో మీల్స్?
ఈ ఆఫర్‌లో కేవలం టికెట్ ధరలే కాదు, అదనంగా పలు “FabDeals” కూడా ఉన్నాయి. విమానంలో రుచికరమైన హాట్ మీల్స్, మనకు నచ్చిన సీటు సెలక్షన్, అదనపు లగేజ్ సౌకర్యం, అలాగే “Xpress Ahead” ప్రైయారిటీ సర్వీసెస్ అన్నీ ఈ సర్వీసులు కూడా ప్రత్యేక రాయితీలతో లభ్యమవుతున్నాయి. అంటే ఒక్కసారిగా మొత్తం ప్రయాణ అనుభవం మరింత సౌకర్యవంతం, మరింత సులభం అవుతుంది.
అవకాశాన్ని వినియోగించుకోండి
చాలా సార్లు ఇలాంటి ఆఫర్లు మనకు కనిపిస్తాయి కానీ ఆలస్యం చేస్తే టికెట్లు సేల్ అవ్వడం సహజం. అందుకే ఇప్పుడే వెబ్‌సైట్‌కి వెళ్లి లేదా మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఎక్కువ ఖర్చు లేకుండా మీ డ్రీమ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం. కాబట్టి మీ జీతం వచ్చిన వెంటనే ఈ “పే డే డీల్స్” ను స్మార్ట్‌గా యూజ్ చేసుకుని, తక్కువ ధరలో ఎక్కువ ప్రయాణం చేసే అనుభవాన్ని మిస్ అవ్వకండి.
💸 PayDay just got better! ✈️
Grab Xpress Lite fares starting from ₹1200 on domestic routes and ₹3724 on international routes.📅 Book by 1 Oct and travel from 12 Oct till 30 Nov 2025.
Book our PayDay deals from 28 Sep across all channels, and unlock early access with… pic.twitter.com/MdVaIUkI0m
— Air India Express (@AirIndiaX) September 26, 2025