BigTV English

Ambati Rambabu : ఆ విషయం మీ మాజీకే చెప్పండి..! రేణు దేశాయ్ కు అంబటి కౌంటర్..

Ambati Rambabu : ఆ విషయం మీ మాజీకే చెప్పండి..! రేణు దేశాయ్ కు అంబటి కౌంటర్..

Ambati Rambabu : బ్రో మూవీలోని శ్యాంబాబు పాత్రపై రేగిన వివాదం మరింత ముదిరింది. పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కు ఏపీ మంత్రి అంబటి కౌంటర్ ఇచ్చారు. అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు సినిమాలో పెట్టి శునకానందం పొందొద్దని అని ట్వీట్ చేశారు.


పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడుతూ గురువారం రేణు దేశాయ్ ఓ వీడియో పోస్టు చేశారు. అందులో రాజకీయంగా పవన్ కు మద్దతు తెలుపుతున్నాని చెప్పారు. అదే సమయంలో బ్రో మూవీలో శ్యాంబాబు క్యారెక్టర్ వివాదం గురించి తనకు పెద్దగా అవగాహన లేదన్నారు. కానీ పవన్‌పై సినిమా, వెబ్‌ సిరీస్‌ చేస్తామని ఇటీవల మంత్రి అంబటి రాంబాబు అన్నవిషయాన్ని గుర్తు చేశారు. పవన్ పెళ్లిళ్లు, భార్యలు, పిల్లల గురించి ఈ సినిమా ఉంటుందని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.

దయచేసి పిల్లలను అందులోకి లాగవద్దని రేణు దేశాయ్ విజ్ఞప్తి చేశారు. తన పిల్లలనే కాదు, ఏ పిల్లలను, ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగొద్దని సూచించారు. రాజకీయంగా ఏదైనా ఉంటే మీరూ మీరూ చూసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు స్పందించారు. మీ మాజీ భర్తకే ఆ విషయం చెప్పాలంటూ కౌంటర్ ఇచ్చారు.


పవన్‌ కల్యాణ్‌, ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన బ్రో మూవీలో శ్యాంబాబు పాత్రను పృథ్వీరాజ్‌ పోషించాడు. ఈ పాత్ర మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించించే పెట్టారనే విమర్శలు వచ్చాయి. సంక్రాంతి సమయంలో మంత్రి డ్యాన్స్ చేసిన మాదిరిగా ఓ డ్యాన్స్ బిట్ ను పృథ్వీతో చేయించారు. ఈ సన్నివేశం పెనుదుమారాన్ని రేపింది. తనను ఉద్దేశించే ఆ పాత్ర పెట్టారని అంబటి అప్పుడే ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ జీవితంపై సినిమా తీస్తానని ప్రకటించారు. కొన్ని టైటల్స్ పరిశీలనలో ఉన్నాయంటూ వాటి పేర్లు వెల్లడించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక సినిమాల్లో తన క్యారెక్టర్‌ పెట్టి పవన్ శునకానందం పడుతున్నారని మంత్రి అంబటి మండిపడ్డారు.

బ్రో వివాదంపై రేణు దేశాయ్ స్పందించిన తీరుపై తాజాగా అంబటి రాంబాబు మండిపడ్డారు. మీ మాజీకే చెప్పండి అంటూ సైటర్ వేశారు.

Related News

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు

AP Liquor Case: లిక్కర్ కేసులో కొత్త విషయాలు.. ముడుపుల చేర్చడంలో వారే కీలకం, బిగ్‌బాస్ చుట్టూ ఉచ్చు

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Big Stories

×