E-Paper
Advertisement

కూటమిని విడగొట్టేందుకు వైసీపీ స్కెచ్.. విజయ్‌ విక్టరీని చూపిస్తూ పవన్ టార్గెట్, ఇంతకీ అంబటి ఏమన్నారు?

కూటమిని విడగొట్టేందుకు వైసీపీ స్కెచ్.. విజయ్‌ విక్టరీని చూపిస్తూ పవన్ టార్గెట్, ఇంతకీ అంబటి ఏమన్నారు?
Advertisement

Amaravati:  ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ మరోసారి టార్గెట్ చేసిందా? ఎలాగైనా కూటమి నుంచి జనసేనను విడగొట్టేందుకు కొత్త స్కెచ్ వేసిందా? తమిళనాడులో విజయ్ విక్టరీని చూపిస్తూ పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసిందా? అంబటి రాంబాబు ట్వీట్ వెనుక అసలు  ఉద్దేశం ఏంటి?

కూటమిని విడగొట్టేందుకు వైసీపీ స్కెచ్

Advertisement

‘కూటమిని విడగొడితే గానీ.. వైసీపీ అధికారంలోకి  రావడం కష్టమని తేల్చేశారు వైసీపీ ఎగ్జిట్ నేత విజయ సాయిరెడ్డి’.  గతంలో అంటే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో వీఎస్ఆర్ వేసిన స్కెచ్ వర్కవుటయ్యింది. సాయిరెడ్డి చెప్పిన మాటల ఫార్మూలాని వైసీపీ నేతలు తప్పకుండా పాటిస్తున్నారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం-టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటుకు కావల్సిన మెజార్టీ రాకున్నా, అతి పెద్ద పార్టీగా ఘన విజయం సాధించింది. విజయ్ విక్టరీని ఉద్దేశిస్తూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై పరోక్షంగా సెటైర్లు వేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఎక్స్ వేదికగా ఆయన చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.

Advertisement

విజయ్‌ విక్టరీని చూపిస్తూ పవన్ టార్గెట్ చేసిన అంబటి

కేవలం ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన‌ట్టు’ అంటూ ఆ పోస్ట్ పెట్టారు అంబటి. రాజకీయాల్లోకి వచ్చిన విజయ్.. ఒంటరిగా గెలవగా, ఏపీలో పవన్ కల్యాణ్ పొత్తుల ద్వారా విజయం సాధించడాన్ని పోల్చినట్టు స్పష్టమవుతోంది. అంతకుముందు అంబటి మరో ట్వీట్‌ చేశారు.

తమిళనాడులో స్టాలిన్-ఉదయనిధి ఓటమి.. భవిష్యత్తులో చంద్రబాబు-లోకేష్ పడుతుందని కంపేర్ చేసే ప్రయత్నం చేశారు. అంతకుమించి ఆయనేమీ రాయలేదు.. కాకపోతే ఊహించుకోవాలని వదిలి పెట్టేశారు మాజీ మంత్రి.  ఓ విధంగా చెప్పాలంటే పవన్‌ని  ఉద్దేశించి అంబటి ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

ALSO READ: ప్రభుత్వ స్కూల్ టెన్త్ టాపర్లకు అపూర్వ గౌరవం.. గన్నవరం నుంచి హైదరాబాద్ కు ఫ్లైట్ జర్నీ

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. కూటమి మరో పదేళ్లు ఇలాగే కొనసాగాలని తాను బలంగా కోరుకుంటున్నానని అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. వైసీపీలో ఏదో చిన్న ఆశ. కూటమిని విడగొడితే రూలింగ్‌లోకి రావచ్చని ఆశపడుతున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, కూటమిని విచ్ఛిన్నం చేసేపనిలో పడిందని అంటున్నారు నేతలు.

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×