BigTV English
Advertisement

AP Govt: ఏపీలో మహిళలకు శుభవార్త, ఇంకెందుకు ఆలస్యం, హాయిగా వ్యాపారాలు పెట్టుకోవచ్చు,

AP Govt: ఏపీలో మహిళలకు శుభవార్త, ఇంకెందుకు ఆలస్యం, హాయిగా వ్యాపారాలు పెట్టుకోవచ్చు,

AP Govt: ఏపీలో మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్టింది.. పెడుతూనే ఉంది. ముఖ్యంగా డ్వాక్రా మహిళలను పొదుపు సంఘాల సభ్యులుగా కాకుండా వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర పథకాలతో కలిసి భారీ రాయితీలతో కూడిన రుణాలను అందిస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేందుకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. గ్రామాల్లో ప్రత్యేక సభలు నిర్వహించి ఆసక్తి- అర్హులైన మహిళలను ఎంపిక చేస్తున్నారు అధికారులు.


మహిళల వ్యాపారాలు.. ఆపై రాయితీ వివరాలు

యూనిట్ విలువ లక్ష వరకు ఉంటుంది. అందులో రాయితీ సబ్సిడీ 35 వేలు కాగా, బ్యాంకు రుణం 65 వేలు వరకు ఉంటుంది. అయితే ఈ యూనిట్లు చిన్న స్థాయి వ్యాపారాలకు సరైనవి. వాటిలో చిన్న కిరాణా షాపులు, పచ్చళ్ల తయారీ, చిన్న డెయిరీ ఫాంలు మొదలైనవి ఉండనున్నాయి.


రెండు లక్షల వరకు సబ్సిడీ వివరాలు

యూనిట్ ఖర్చు 2 లక్షల రూపాయలు. అందులో రాయితీ అంటే సబ్సిడీ 75 వేలు కాగా, మిగతాది బ్యాంకు రుణం ఇప్పించనుంది. ఈ నిధుల ద్వారా ఆవులు లేదా గేదెలు, గొర్రెలు, మేకలు, షెడ్ నిర్మాణం చేయవచ్చు. ఈ యూనిట్లు గ్రామీణ మహిళలకు డెయిరీ, పశు పోషణ వ్యాపారాల్లో అండగా నిలుస్తాయి.

పైన చెప్పినవి కాకుండా పెద్ద యూనిట్లకు రాయితీ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. యూనిట్ ఖర్చు 2 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంటే రాయితీ ఈ విధంగా ఉంటుంది. అందులో రాయితీ లక్షా 35 వేలు ఉంటుంది. బేకరీలు, పేపర్ ప్లేట్ల తయారీ వాటికి 2 లక్షల నుండి 5 లక్షల వరకు పెట్టుబడి ఇస్తుంది. వ్యవసాయ పరికరాలు వాటికి 5 లక్షల నుండి 10 లక్షల వరకు బ్యాంకు రుణం ఇప్పించనుంది.

ALSO READ: ఎంపీలతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ

ప్రోత్సాహం అందిస్తున్న ఇతర వ్యాపారాల జాబితాను ఒక్కసారి చూద్దాం. కిరాణా షాపులు, పచ్చళ్ల తయారీ, డెయిరీ ఫాం, సిమెంటు బ్రిక్స్ యూనిట్ వంటివి ఉన్నాయి. అలాగే ఐస్‌క్రీమ్, కారంపొడి, తేనె తయారీ కూడా. వీటితోపాటు గార్మెంట్స్, ఎంబ్రాయిడరీ, జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్లు ఇందులో ఉన్నాయి.

ఈ పథకం ద్వారా ఎంపికైన డ్వాక్రా మహిళలు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించవచ్చు. ప్రభుత్వం సబ్సిడీతోపాటు వారికి ట్రైనింగ్ కూడా అందించనుంది. మరిన్ని వివరాల కోసం స్థానిక డ్వాక్రా సంఘాలు లేకుంటే గ్రామ- వార్డు సచివాలయాలను సంప్రదించవచ్చు.

Related News

YS Jagan: నకిలీ మద్యం, నకిలీ బీరు.. జగనూ! ఇదంతా నువ్వు చేసిందే కదయ్యా!

Modi – Jagan: కర్నూలు సభలో మోదీ ఆ ఒక్క పని చేయగలరా? అదే జరిగితే..

Delhi News: విశాఖలో గిగావాట్ డేటా సెంటర్.. ఢిల్లీ వేదికగా గూగుల్-ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం

Delhi Politics: ఎంపీలతో ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు భేటీ, వైసీపీ నేరాలపై అలర్ట్ అంటూ..

Tirumala News: హైకోర్టు సీరియస్.. తిరుమలలో సీఐడీ డీజీ, సీల్డ్ కవర్‌లో నివేదిక?

Jogi Ramesh: జోగి రమేష్ కి ఉచ్చు బిగిసినట్టేనా? అప్పట్లో తప్పించుకున్నా ఇప్పుడు జైలు ఖాయమేనా?

Jagan – Lokesh: ‘జగన్ కోసం’ నారా లోకేష్ సాయం.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్

Big Stories

×