BigTV English
Advertisement

Google in Vizag: విశాఖలో డేటా సెంటర్.. గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం, రూ.1,33,000 కోట్ల భారీ పెట్టుబడి!

Google in Vizag: విశాఖలో డేటా సెంటర్.. గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం, రూ.1,33,000 కోట్ల భారీ పెట్టుబడి!

Delhi News: విశాఖను గ్లోబల్ కనెక్టివిటీ హబ్ గా ఏర్పాటు చేస్తున్నట్లు గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ థామస్ కురియన్ తెలిపారు. విశాఖలో గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. విశాఖ నుంచి 12 దేశాలతో సబ్ సీ -కేబుల్ విధానం ద్వారా అనుసంధానం అవుతుందన్నారు. అమెరికా వెలుపల పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారన్నారు. జెమినీ-ఏఐ, గూగుల్ అందించే ఇతర సేవలూ ఈ డేటా సెంటర్ ద్వారా అందుతాయన్నారు.


విశాఖలో గిగావాట్ డేటా సెంటర్

మంగళవారం ఢిల్లీ వేదికగా ‘భారత్ ఏఐ శక్తి’ పేరుతో గూగుల కార్యక్రమం నిర్వహించింది. దీనికి సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు నిర్మలసీతారామన్, అశ్వినివైష్ణవ్, మంత్రి లోకేష్, గూగుల్ కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ థామస్ కురియన్ మాట్లాడారు. 2029 నాటికి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పూర్తి చేయాలని ప్రణాళిక పెట్టుకుంది.


సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో అడుగుపెడు తోందన్నారు. గతంలో హైదరాబాద్ లో హైటెక్ సిటీ అభివృద్ధి చేశామన్నారు. ప్రస్తుతం విశాఖను ఐటీ హబ్‌గా తీర్చదిద్దబోతున్నట్లు చెప్పుకొచ్చారు. ఆనాడు హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ కంపెనీని తీసుకొచ్చామని గుర్తు చేశారు. సాంకేతికతలో నూతన ఆవిష్కరణలు వస్తున్నాయని, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఏపీ ముందు ఉందన్నారు.

గూగుల్ కంపెనీ-ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం

గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటులో ప్రధాని మోదీ కీలకంగా వ్యవహరించారని వివరించారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు వైష్ణవ్, నిర్మలకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే గూగుల్ డేటా సెంటర్ ను విశాఖకు తీసుకు రావడంలో లోకేష్ ప్రధాన పోసించినట్టు తెలిపారు. రియల్ టైమ్ డేటా, హిస్టారికల్ డేటా సాయంతో వేగంగా నిర్ణయాలు తీసుకునే ఆస్కారం ఉందన్నారు. వచ్చేఏడాది ఫిబ్రవరిలో గ్లోబర్ ఏఐ కాన్ఫరెన్స్ నిర్వహణపై ఆలోచన చేస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. ఇతర దేశాలతో పోల్చితే టెక్నాలజీ అందిపుచ్చుకోవడంలో భారత్ ప్రత్యేకమన్నారు.

డిజిటల్ కనెక్టివిటీ, డేటా సెంటర్, ఐఏ, రియల్ టైమ్ డేటా కలెక్షన్లు ముఖ్యమైనవని అన్నారు. కేవలం హార్డ్ వర్క్ కాదని, స్మార్ట్ వర్క్ నినాదం తీసుకొచ్చినట్టు తెలిపారు. 2047 నాటికి వికసిత్ భారత్ మన అందరి లక్ష్యమన్నారు. రానున్న ఐదేళ్లలో 15 బిలియన్ డాలర్లు (రూ.1,33,000 కోట్లు) ఖర్చు చేస్తామని గూగుల్ సంస్థ చెప్పడం ఆనందంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు.

సాంకేతికత ప్రపంచాన్ని మార్చేస్తోందని కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్ అన్నారు. సాంకేతిక రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, నైపుణ్యం ఉన్న యువతకు మరిన్ని అవకాశాలు రాబోతున్నాయని చెప్పారు. కేంద్రప్రభుత్వ సహకారంతో ఏపీలో మరిన్ని ప్రాజెక్టు రాబోతున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు. డిజిటల్ హబ్ గా దేశానికి మంచి గుర్తింపు వస్తుందన్నారు. గూగుల్ విశాఖలో అడుగుపెట్టడం సంతోషంగా ఉందన్నారు.

ALSO READ: ఏపీలో మహిళలకు శుభవార్త.. ఇంకెందుకు ఆలస్యం

రాష్ట్రంలో పెట్టుబడులకు కొదవలేదని, విజనరీ నాయకుడు చంద్రబాబు నాయకత్వంలో మరిన్ని ప్రాజెక్టులు రానున్నట్లు చెప్పుకొచ్చారు.  అంతకుముందు సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు నిర్మలసీతారామన్, అశ్వినివైష్ణవ్, మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. గూగుల్ కంపెనీతో ఏపీ ప్రభుత్వం చారిత్రక ఒప్పందం చేసుకుంది.

 

 

Related News

AP Liquor Case: ఎంపీ మిథున్‌రెడ్డి ఇంట్లో సిట్ సోదాలు, నాలుగు బృందాలు తనిఖీలు

YS Jagan: నకిలీ మద్యం, నకిలీ బీరు.. జగనూ! ఇదంతా నువ్వు చేసిందే కదయ్యా!

Modi – Jagan: కర్నూలు సభలో మోదీ ఆ ఒక్క పని చేయగలరా? అదే జరిగితే..

AP Govt: ఏపీలో మహిళలకు శుభవార్త, ఇంకెందుకు ఆలస్యం, హాయిగా వ్యాపారాలు పెట్టుకోవచ్చు,

Delhi Politics: ఎంపీలతో ప్రత్యేకంగా సీఎం చంద్రబాబు భేటీ, వైసీపీ నేరాలపై అలర్ట్ అంటూ..

Tirumala News: హైకోర్టు సీరియస్.. తిరుమలలో సీఐడీ డీజీ, సీల్డ్ కవర్‌లో నివేదిక?

Jogi Ramesh: జోగి రమేష్ కి ఉచ్చు బిగిసినట్టేనా? అప్పట్లో తప్పించుకున్నా ఇప్పుడు జైలు ఖాయమేనా?

Big Stories

×