‘జగన్ కోసం’ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చిన రిక్వస్ట్ కి మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. తన ఆఫీస్ ని ట్యాగ్ చేస్తూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే జగన్ కోసం అకౌంట్ కి పెద్దగా ఫాలోవర్లు లేరు, ఒకవేళ ఉన్నా.. ఈ ట్వీట్ తర్వాత జగన్ అభిమానులు ఆ అకౌంట్ ని అన్ ఫాలో చేశారా అనేది అనుమానం. ఆ అకౌంట్ లో అన్నీ జగన్ ని అభిమానించే ట్వీట్లు ఉండటం గమనార్హం. జగన్ పేరుతో సాయం కోరడం, నారా లోకేష్ నేరుగా స్పందించడంతో ఈ ట్వీట్ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
అసలేం జరిగింది?
హేమలత అనే మహిళ అనారోగ్యం కారణంగా కుటుంబ సభ్యులు రూ.8 లక్షల వరకు వైద్యానికి ఖర్చు పెట్టారని, వారిది పేద కుటుంబం అని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా వారికి తెలియదని, అందుకే నారా లోకేష్ ని ట్యాగ్ చేస్తున్నానని జగన్ కోసం అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది. దీనికి నారా లోకేష్ వెంటనే స్పందించారు. ఈ సంఘటనను తన దృష్టికి తెచ్చినందుకు లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. హేమలత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని ఆందోళనకు గురయ్యానని, ఆ కుటుంబానికి అవసరమైన సాయం కోసం తన టీమ్ సపోర్ట్ చేస్తుందని, ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని లోకేష్ ట్వీట్ వేశారు.
Thank you for bringing this to my attention. I’m deeply concerned about Hemalatha garu’s health condition. My team will reach out to guide the family on the required assistance and help them with the process. Wishing her a quick recovery. @OfficeofNL https://t.co/R7oKg8IW4X
— Lokesh Nara (@naralokesh) October 12, 2025
ట్వీట్ చేస్తే చాలు..
సోషల్ మీడియాలో రాజకీయ నాయకులంతా యాక్టివ్ గానే ఉన్నా, చాలామంది ఎలివేషన్లకు ప్రాధాన్యత ఇస్తుంటారు. పర్సనల్ అకౌంట్లను సోషల్ మీడియా నిర్వహించే ఏజెన్సీలకు అప్పగించి సైలెంట్ గా ఉండేవారు చాలామందే ఉన్నారు. కానీ మంత్రి నారా లోకేష్ అలా కాదు, ఆయన ట్విట్టర్లో యాక్టివ్ గా ఉండటమే కాదు, తనను మెన్షన్ చేస్తూ సాయం కోసం వేసే ట్వీట్లను ప్రత్యేకంగా చూస్తుంటారు. వారికి తగిన సాయం చేయాలని ఆదేశిస్తుంటారు. గతంలో కూడా ఇలాంటి చాలా సందర్భాలున్నాయి. కానీ ఈసారి సాయం అడిగింది, జగన్ అభిమానిని అని చెప్పుకునే ఒక అకౌంట్ నుంచి కావడం, దానికి లోకేష్ కూడా సానుకూలంగా స్పందించడం విశేషం.
Also Read: అలా వద్దు, ఇలా చేయండి. విజయ్ కు పవన్ సలహా..?
ఎన్నో అర్జీలు ఇచ్చినా, ఎంతోమంది అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాని కొన్ని సమస్యలు ఇలా నాయకుల పర్సనల్ అకౌంట్లను ట్యాగ్ చేస్తూ పెట్టే మెసేజ్ ల ద్వారా పరిష్కారమవుతుంటాయి. దానికి ఇది తాజా ఉదాహరణ. 2019 -2024 మధ్యలో కూడా నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా కొన్ని వ్యక్తిగత సమస్యలకు స్పందించి సహాయం చేసేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత విస్తృతంగా ఆయన సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తున్నారు. పార్టీతో సంబంధం లేకుండా చాలామందికి ప్రభుత్వం తరపున, వ్యక్తిగతంగా సాయం అందించారు.
Also Read: బాలకృష్ణకు మినిస్టర్ పోస్ట్..? అసలేంటి కథ?