E-Paper
Advertisement

Balagam Venu : DSP హీరోగా బలగం వేణు కొత్త సినిమా.. మరి ఎల్లమ్మ పరిస్థితి?

Balagam Venu : DSP హీరోగా బలగం వేణు కొత్త సినిమా.. మరి ఎల్లమ్మ పరిస్థితి?
Advertisement

Balagam Venu : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య చిన్న సినిమాగా వచ్చిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. ఒక చిన్న స్టోరీ తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలలో బలగం సినిమా కూడా ఒకటి. జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయిన కమెడియన్ వేణు ఈ సినిమాతో దర్శకుడుగా మారాడు. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ వేణు తో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ హీరోలు పోటీ పడుతున్నారు. నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేస్తాడా అని జనాలు కూడా ఎదురుచూస్తున్నారు. అయితే వేణు రెండో సినిమాగా ఎల్లమ్మ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఎప్పుడో అనౌన్స్ చేశారు కానీ ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. తాజాగా మరో సినిమాని వేణు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మూవీ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

DSP హీరోగా డైరెక్టర్ వేణు కొత్త సినిమా..

బలగం ఫేమ్ డైరెక్టర్ వేణు ప్రస్తుతం మరో కొత్త సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీకి హీరోగా స్టార్ హీరోని సెలెక్ట్ చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ, వేణు మాత్రం డిఫరెంట్ గా ఆలోచించాడు.. తెలుగు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ తో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. వీరిద్దరి కాంబోలో సినిమా ఫిక్స్ అయిన విషయాన్ని త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా ఈ కాంబో ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

Advertisement

Also Read : వల్లికి కడుపు మంట.. భాగ్యం మాస్టర్ ప్లాన్.. ప్రేమ, ధీరజ్ ఒక్కటవుతారా..?

ఎల్లమ్మను వదిలేశాడా..?

బలగం సినిమా తర్వాత వేణు ఎల్లమ్మ సినిమాని అనౌన్స్ చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. సినిమా పేరునైతే అనౌన్స్ చేశారు కానీ ఇప్పటివరకు ఆ సినిమా గురించి ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. మొన్నటి వరకు హీరో నితిన్ ఇందులో నటించబోతున్నాడంటూ అనుకున్నారు. కానీ ఈ సినిమా నుంచి నితిన్ ను తప్పించినట్లు వార్త ప్రచారంలో ఉంది. వరుస ప్లాప్ లలో ఉండటమే. దాంతో, ఆడియన్స్ లో నెగిటీవ్ ఇంపాక్ట్ పడింది. ఆ ఇంపాక్ట్ ఎల్లమ్మ సినిమాపై పడకూడదని టీం ఈ డెసిషన్ తీసుకున్నారట.. ఈ సినిమాలో హీరోగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీని గురించి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఈ సినిమా కన్నా ముందు మరో సినిమాని వేణు సెట్స్ మీదకు తీసుకెళ్లే అవకాశం ఉంది.. మరి ఈ మూవీకి ఎలాంటి టైటిల్ ని ఫిక్స్ చేస్తాడు అన్నది ఆసక్తిగా మారింది.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×