BigTV English
Advertisement

Telangana politics: రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ ఉక్కిరిబిక్కిరి, బైపోల్‌లో బీఆర్ఎస్‌ని గెలిపిస్తారా?

Telangana politics: రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ ఉక్కిరిబిక్కిరి, బైపోల్‌లో బీఆర్ఎస్‌ని గెలిపిస్తారా?

Telangana politics: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ ఎమ్మెల్యే రాజాసింగ్ లైమ్ లైట్‌లోకి వచ్చేశారు.  బీజేపీ అభ్యర్థిపై ఇంకా ప్రకటన చేయకపోవడాన్ని కొందరు నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారా? లేకుంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారా అంటూ సూటిగా ప్రశ్నలు సంధించారు.


బీజేపీలో మరోసారి అంతర్గత విభేదాలు

బీజేపీలో ఒకప్పుడు ఫైర్‌బ్రాండ్ నేత ఎమ్మెల్యే రాజాసింగ్. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోరు. చెప్పాల్సిన మూడు మాటలు ముక్కుసూటిగా చెప్పేస్తారు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీలో జరుగుతున్న వ్యవహారాలను అప్పుడప్పుడు బయటపెట్టారు.. పెడుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో కీలక నేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రాజాసింగ్.


తెలంగాణ రాష్ట్ర బీజేపీలో మరోసారి అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారా? కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారా అంటూ సూటి ప్రశ్నలు లేవనెత్తారు. సోషల్ మీడియాలో ప్రజలు ఈ విషయాన్ని పదేపదే అడుగుతున్నారంటూ కిషన్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

కిషన్‌రెడ్డి టార్గెట్‌గా రాజాసింగ్ కామెంట్స్

ఒవైసీ-మీకు మధ్య ఒప్పందం వల్లే ఎంఐఎం అభ్యర్థిని నిలపలేదా అని ప్రశ్చించారు రాజాసింగ్. మీ గౌరవం ప్రమాదంలో ఉందన్నారు. భారీ తేడాతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోతే, అధిష్టానం పెద్దలకు మీ ముఖం ఎలా చూపెడతారని అన్నారు. నా జిల్లాను సర్వనాశనం చేసి, తనను బయటకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో ఒకరోజు మీరు వెళ్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారాయన.

ఉపఎన్నికకు సంబంధించి సోమవారం నుంచి నామినేషన్లు స్వీకరణ మొదలైంది. ఇప్పటివరకు బీజేపీ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద దుమారం మొదలైంది. గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు 8 జిల్లాలు ఉంటాయి.

ALSO READ: దొంగఓట్లకు పాల్పడింది వారే, బీఆర్ఎస్‌పై మంత్రి పొన్నం ఫైర్

గోషామహల్ నియోజకవర్గం గొల్కొండ జిల్లా పరిధిలోకి వస్తోంది. గతంతో కూడా కిషన్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. తన జిల్లాను సర్వనాశనం చేసింది కిషన్‌రెడ్డి అని, ఆయనకు ఏదోరోజు అదే గతి పడుతుందన్నారు. ఆయన సికింద్రాబాద్ నుంచి వెళ్లిపోవాల్సి వస్తుందన్నారు. ఒప్పందం మేరకు ఓవైసీ పార్టీ అభ్యర్థిని నిలపలేదా? అంటూ ప్రశ్నించారు. బీజేపీ ఎవరిని గెలిపించబోతోంది? బీజేపీ కీలక నేతలకు ఇప్పటికే సమాచారం వెళ్లినట్టు వార్తలు లేకపోలేదు. మొత్తానికి ఉప ఎన్నిక సందర్భంగా రాజాసింగ్ కదిపిన తేనెతుట్టు ఎటువైపు వెళ్తుందో చూడాలి.

 

 

Related News

Rajgopal Reddy: వైన్ షాప్స్ టైమింగ్స్ మార్పు.. ఇక నుంచి ఇన్ని గంటలకే.. రాజగోపాల్ రెడ్డి కీలక ఆదేశాలు

Asaduddin Owaisi: జూబ్లీహిల్స్‌లో మా మద్దతు ఆ పార్టీకే.. ఓవైసీ సంచలన నిర్ణయం.. గెలుపు ఆ పార్టీదే..?

Kaleshwaram Project Corruption: కాళేశ్వరం ఇంజనీర్లపై ఈడీ ఫోకస్.. అవినీతి ఇంజనీర్ల ఆస్తులు జప్తు

Jubilee Hill Bypoll: దొంగ ఓట్లకు పాల్పడింది వారే.. బీఆర్ఎస్-బీజేపీపై మంత్రి పొన్నం ఫైర్

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్‌.. ఖరారు కాని బీజేపీ అభ్యర్థి, తెరపైకి విక్రమ్ గౌడ్?

Rains Updates: ఏపీ-తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ జిల్లాలకు హెచ్చరికలు, ఏ క్షణమైనా ఉరుములు

IPS Puran Kumar: ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య దారుణం.. ఛండీగడ్‌లో డిప్యూటీ సీఎం భట్టి

Big Stories

×