చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ఇంటిపైకి వెళ్లి నానా రచ్చ చేశారు అప్పటి మంత్రి జోగి రమేష్. కూటమి అధికారంలోకి వచ్చాక ఆయన అరెస్ట్ ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ ఎందుకో కుదరలేదు. ఓ కేసులో జోగి రమేష్ కొడుకు అరెస్టై రిమాండ్ ఖైదీగా జైలులో ఉండి బెయిల్ పై బయటకు వచ్చారు. తాజాగా జోగి రమేష్ అరెస్ట్ ఖాయమని తెలుస్తోంది. కల్తీ లిక్కర్ వ్యవహారంలో అరెస్ట్ అయిన జనార్దన్ రావు, జోగి రమేష్ పేరు బయటపెట్టారు. ఆయన కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందన్నారు. తీరా జోగి ప్రెస్ మీట్ పెట్టి తన తప్పేం లేదన్నారు. ప్రమాణాలకు సిద్ధమయ్యారు. తనను అరెస్ట్ చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. చివరకు బీసీ కార్డ్ కూడా వాడారు. అయినా కూడా జోగికి టైమ్ బాగో లేదని తెలుస్తోంది, అరెస్ట్ తప్పదని అర్థమవుతోంది.
కూటమిపై గుడ్డకాల్చి వేసేలా
కల్తీ లిక్కర్ కేసులో నిందితుడైన జనార్దన్ రావు సంచలన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మాజీ మంత్రి జోగి రమేష్ పథకం ప్రకారమే ఇదంతా జరిగిందని ఆయన చెప్పారు. కేవలం కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే లిక్కర్ ని కల్తీ చేసేలా ప్రోత్సహించారన్నారు. తంబళ్లపల్లిలో తయారు చేస్తే, చంద్రబాబుపై నిందలు వేయొచ్చనే ఆలోచన కూడా జోగి రమేష్ దేనని అన్నారు. తనతో అన్ని తప్పులు చేయించి, తనను ఆఫ్రికాకు పంపించి తిరిగి రావొద్దని చెప్పారని, కానీ చివరకు హ్యాండిచ్చారని చెప్పుకొచ్చారు. కల్తీ లిక్కర్ వ్యవహారం ఇటు అటు తిరిగి, చివరకు జోగి రమేష్ వద్దకు చేరింది.
అది సందింటి వారి సారా..
ఆఫ్రికా ఫార్ములా సారా..#YSRCPDirtyLiquorPolitics #LiquorScamByJagan#ScamsterJagan#PsychoFekuJagan#EndOfYCP#AndhraPradesh pic.twitter.com/QTHbBFktqS
— Telugu Desam Party (@JaiTDP) October 13, 2025
బయటకొచ్చిన జోగి..
జోగి రమేష్ పై ఎప్పుడు ఏ ఆరోపణలు వచ్చినా వెంటనే కులం కార్డు బయటకు తీస్తారు. తన వర్గం వారు ఊరుకోబోరని హెచ్చరిస్తారు, బీసీలపై దాడి చేస్తారా అని ప్రశ్నిస్తారు. సరిగ్గా ఇప్పుడు కూడా అదే అన్నారు. బీసీలని తొక్కేస్తున్నారని అన్నారు జోగి రమేష్. అంతే కాదు, తనపై ఆరోపణలు రావడంతో ఆయనకు ఏం చేయాలో తోచలేదు. తిరుమల వెంకన్న సన్నిధికి వచ్చి తాను తప్పు చేశానని చంద్రబాబు చెబితే ఏ శిక్షకైనా రెడీ అంటున్నారు. అసలు చంద్రబాబు ఎందుకు వస్తారు, ఆయన ఎందుకు ఒట్టు వేస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సిల్లీ ఛాలెంజ్ లు చేసి వైసీపీ నేతలు పరువు పోగొట్టుకుంటున్నారని మండిపడుతున్నారు. పైగా కుటుంబ సభ్యుల్ని కూడా ఈ వివాదంలోకి లాగేశారు జోగి రమేష్.
LIVE: Former Minister Sri Jogi Ramesh Press Meet https://t.co/U1Wr9FArLl
— YSR Congress Party (@YSRCParty) October 13, 2025
వైసీపీ ఉక్కిరి బిక్కిరి..
కల్తీ లిక్కర్ వ్యవహారం బయటపడిన తర్వాత వైసీపీ దాన్ని రాజకీయం కోసం ఉపయోగించుకోవాలనుకుంది. అయితే అరెస్ట్ అయిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన టీడీపీ ఆ విషయంపై లోతుగా దర్యాప్తు చేయించింది. చివరకు ఆ పని చేసిన వారు గతంలో వైసీపీ అని తేలింది. కూటమి హయాంలో తప్పు బయట పడగానే వారిని సస్పెండ్ చేశామని టీడీపీ నేతలంటున్నారు. ఈ విషయంలో కూడా వైసీపీ ఇరకాటంలో పడింది. ఇప్పుడు జోగి రమేష్ పేరు బయటకు రావడంతో రాజకీయ కక్షసాధింపులు అంటూ వైసీపీ మీడియా, సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. అయితే జోగి రమేష్ అరెస్ట్ కి మాత్రం టైమ్ దగ్గరపడిందని అంటున్నారు నెటిజన్లు.
Also Read: ‘జగన్ కోసం’ నారా లోకేష్ సాయం..