AP Cabinet Meeting Today: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉదయం 11 గంటలకు మొదలైంది. సుమారు 4 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో మంత్రులు పలు ప్రధాన అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో న్యూ లిక్కర్ పాలసీ నివేదికకు ఆమోదం తెలిపారు. ఇటీవలే బుడమేరు బెజవాడను ముంచెత్తిన విషయం తెలిసిందే. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా.. బుడమేరుకు మరమ్మతులు, లైనింగ్ పనులు చేయించేందుకు ఆమోదం కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రేపటి నుంచి రాష్ట్రంలో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం కానుండగా.. వాటిపై కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గత పాలకుల హయాంలో కీలకంగా ఉన్న వాలంటీర్ల వ్యవస్థపై సుదీర్ఘంగా చర్చించింది.
ఏపీ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు
Also Read: ఏపీలో కూడా హైడ్రాను ఏర్పాటు చేసి బుడమేరును కాపాడాలి: సీపీఐ నారాయణ
ఏపీ కేబినెట్ సమావేశానికి ముందు మంత్రి నారా లోకేష్.. ఇతర మంత్రులతో తన ఛాంబర్ లో సమావేశమయ్యారు. ఆయన నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు మంచి స్పందన వస్తోందని, ప్రజలు తనకు ఇచ్చిన వినతులను సంబంధిత మంత్రులకు అందజేసి.. వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.