BigTV English
Advertisement

Food on Trains: ట్రైన్ జర్నీ చేస్తూ నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Food on Trains: ట్రైన్ జర్నీ చేస్తూ నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Indian Railway:

దేశంలో నిత్యం కోట్లాది మంది ప్రయాణీకులు రైలు ప్రయాణం చేస్తారు. ప్రతి రోజూ వేలాది రైళ్లు దేశంలోని ప్రతిమూలకు ప్రయాణం చేస్తుంటాయి. తక్కువ ధరలో ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతుంటాయి. రైళ్లలో ప్రయాణీకులకు ఫుడ్ అందిస్తున్నప్పటికీ, చాలా మంది ఆ ఫుడ్ విషయంలో అసంతృప్తిగా ఉంటారు. అందుకే, రైల్వే ఇప్పుడు రన్నింగ్ ట్రైన్ లో ఉన్న ప్రయాణీకులు కూడా నచ్చిన రెస్టారెంట్ నుంచి ఆన్ లైన్ ద్వారా ఫుడ్ తెప్పించుకునే అవకాశం కల్పిస్తోంది. ప్రయాణీకులు తమ సీటు నుంచి కదలకుండానే భోజనాన్ని పొందే వెసులుబాటు కల్పిస్తోంది. నార్త్ ఇండియన్స్ ఇష్టపడే  థాలి, సౌత్ ఇండియన్స్ ఇష్టపడే రైస్ వరకు ఆర్డర్ చేసుకోవచ్చు. రైల్లో ప్రయాణిస్తూ రుచికరమైన ఆహారాన్ని ఎలా ఆర్డర్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


పెద్ద సంఖ్యలో ఆన్‌ లైన్ రైలు ఫుడ్ డెలివరీలు

రైల్వే నేరుగా ప్రయాణీకులకు ఫుడ్ అందిస్తున్నా, చాలా మంది ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేసుకుంటున్నారు. సీటు దగ్గరికే  తాజా వేడి వేడి భోజనం రావడంతో ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. FSSAI ఆమోదించిన భాగస్వామి రెస్టారెంట్లు ఆహార భద్రత, పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తున్నాయి. ఇది స్టేషన్ లోని విక్రేతల కంటే మరింత నమ్మదగిన ఆహారాన్ని అందిస్తున్నాయి. పరిమిత ప్యాంట్రీ కార్ మెనూలతో పోలిస్తే ప్రయాణీకులకు కూడా ఎక్కువ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ యాక్సెస్ తరచుగా ప్రయాణించేవారికి, కుటుంబాలకు సుదూర ప్రయాణాలు చేసే వారికి ఎంతగానో అనుకూలంగా ఉంటుంది.

రైళ్లలో ఆన్‌ లైన్ ఫుడ్ డెలివరీ కోసం ఏం చేయాలి?

⦿ నమ్మకమైన ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకోండి!


రన్నింగ్ ట్రైన్ లో ఉంటూ ఫుడ్ ఆర్డర్ చేసుకునే సమయంలో నమ్మకమైన ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ ను ఎంచుకోవాలి. IRCTC eCatering, RailRestro, Travelkhanaలో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం ఉత్తమం. కస్టమర్ రేటింగ్స్, ఫీడ్ బ్యాక్ పరిశీలించాలి.

⦿ PNR, రైలు నంబర్‌ ఎంటర్ చేయాలి!

యాప్, వెబ్‌ సైట్‌ లో ఫుడ్ ఆర్డర్ చేసే సమయంలో 10 అంకెల PNR నంబర్, రైలు సమాచారాన్ని అందించాలి. వెంటనే మీ ప్రయాణంలో నిర్దిష్ట స్టేషన్లలో డెలివరీ చేయగల రెస్టారెంట్ల జాబితాను చూపుతుంది.

⦿ డెలివరీ స్టేషన్, రెస్టారెంట్‌ను ఎంచుకోండి!

ప్రయాణ సమాచారాన్ని నిర్ధారించిన తర్వాత, ఫుడ్ డెలివరీ చేయాల్సిన స్టేషన్‌ ను ఎంచుకోవాలి. సరైన స్టేషన్‌ను ఎంచుకోవడం ఆలస్యం లేకుండా ఫుడ్ డెలివరీ పొందే అవకాశాన్ని కల్పిస్తుంది.

⦿ నచ్చిన భోజనాన్ని ఎంచుకోండి!

ప్రయాణీకులు శాకాహారం, మాంసాహార భోజనంతో పాటు నచ్చిన వంటకాలను పొందే అవకాశం ఉంటుంది. బిర్యానీలు, థాలిలు, రోటీలు, పన్నీర్ వంటకాలు, దోసెలు, కట్లెట్లు, శాండ్‌ విచ్‌లు సహా బోలెడు ఫుడ్స్ పొందే అవకాశం ఉంటుంది.

⦿ చెల్లింపుల విషయంలో జాగ్రత్త

UPI, డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, క్యాష్ ఆన్ డెలివరీని ఉపయోగించి చెల్లింపు చేయవచ్చు. భద్రత కోసం ఆన్‌ లైన్ లావాదేవీలు ఎన్‌క్రిప్ట్ చేయబడతాయి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ను ఎంచుకోవడం బెస్ట్.

⦿ సీటు దగ్గరికే తాజా భోజనం

ఆర్డర్ కంప్లీట్ అయిన తర్వాత సెలెక్ట్ చేసిన స్టేషన్ లో మీ సీటు దగ్గరికే వేడి వేడి ఫుడ్ వచ్చేస్తోంది. ఫుడ్ డెలివరీ వచ్చిన తర్వాత ప్యాకేజింగ్‌ ను చెక్ చేయాలి. అన్నీ సక్రమంగా ఉంటే హ్యాపీగా జర్నీ చేస్తూ తినేయండి!

Read Also: అరకు లోయకు ప్రత్యేక రైళ్లు, టూరిస్టులకు రైల్వే గుడ్ న్యూస్!

Related News

Vande Bharat Train: వందేభారతా? చెత్త బండా? సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్!

Araku Special Trains: అరకు లోయకు ప్రత్యేక రైళ్లు, టూరిస్టులకు రైల్వే గుడ్ న్యూస్!

Vande Bharat Sleeper: ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్, వందేభారత్ స్లీపర్ రైళ్లు ఇప్పట్లో రానట్టే!

Safest Seats: బస్సుల్లో సేఫెస్ట్ సీట్లు ఇవే.. ప్రమాదం జరిగినా ప్రాణాలతో బయటపడొచ్చు!

Kashmir Tour: కాశ్మీర్ టూర్ బుకింగ్ ఓపెన్.. హైదరాబాద్ నుంచి కేవలం రూ.36వేల లోపే ఐఆర్‌సీటీసీ ప్యాకేజ్

IRCTC Air Travel: రూ.50 లక్షల ఇన్సూరెన్స్‌తో విమాన ప్రయాణం.. విద్యార్థులు, ఉద్యోగులకు ఐఆర్‌సిటిసి ఎయిర్ ఆఫర్

Viral: ఏనుగులకు దారి ఇచ్చేందుకు.. 13 రైళ్లు నిలిపేసిన రైల్వే అధికారులు!

Big Stories

×