Prakash Raj: సౌత్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ప్రకాష్ రాజ్ (Prakash Raj)ఇటీవల కాలంలో సినిమాలలో కంటే కూడా వివాదాల ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన ఇప్పటికే పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ సినిమాలకు సంబంధించిన అంశాల గురించి మాత్రమే కాకుండా రాజకీయాలకు సంబంధించిన విషయాలు గురించి మాట్లాడుతూ వివాదాలలో నిలుస్తున్నారు. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ అనే విధంగా వివాదం కొనసాగింది.
తాజాగా ఈయన సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఇటీవల కేరళ రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అవార్డుల గురించి ఈయన మాట్లాడటమే కాకుండా జాతీయ అవార్డుల(National Film Awards) గురించి సంచలనమైన ఆరోపణలు చేశారు. కేరళ స్టేట్ ఫిలిం అవార్డు(Kerala State Film Awards) జ్యూరీ చైర్మన్ గా ఉన్న ప్రకాష్ రాజ్ అవార్డుల గురించి మాట్లాడుతూ..జాతీయ చలనచిత్ర అవార్డుల విషయంలో జ్యూరీ సభ్యులు రాజీ పడుతున్నారని తెలిపారు. ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడటానికి తాను అసలు ఏమాత్రం భయపడనని ఈయన వెల్లడించారు.
ఈ విధంగా జ్యూరీ సభ్యులు రాజీ పడటం వల్ల కొంతమందికి మాత్రమే అవార్డులు వస్తున్నాయని, రాజీ పడటానికి మమ్ముట్టి లాంటి గొప్ప వారికి ఇలాంటి అవార్డులు అవసరంలేదని ఈయన వెల్లడించారు. తనని కేరళ స్టేట్ ఫిలిం అవార్డ్ జ్యూరీ చైర్మన్ గా ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. వారు నన్ను ఆహ్వానించినప్పుడు అనుభవం ఉన్న ఒక వ్యక్తి అవసరమని, ఈ విషయంలో తాము ఎలాంటి జోక్యం చేసుకోమని పూర్తి అధికారం తనకే ఉంటుందని చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉంది. కానీ జాతీయ చలనచిత్ర అవార్డుల విషయంలో ఈ ధోరణి లేదని తెలిపారు.
ఓజి సినిమాతో హిట్..
జాతీయ చలనచిత్ర అవార్డుల విషయంలో కొందరిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని అవార్డులను ప్రకటిస్తున్నారని నటన నైపుణ్యం ఉన్న వారిని పక్కన పెడుతున్నారని పరోక్షంగా ఈయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ప్రకాష్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల అభిమానులు కూడా విభిన్న రీతిలో స్పందిస్తూ ప్రకాష్ రాజ్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇకపోతే పిల్లలకు సంబంధించిన సినిమాలు కూడా రావాలని, యువకులను మాత్రమే కాకుండా పిల్లలను కూడా భాగస్వామ్యం చేయాలి అంటూ ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ దర్శక నిర్మాతలకు రచయితలకు కూడా సలహాలు ఇచ్చారు. ఇక ఈయన చివరిగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం పలు సినిమాల పనులలో ప్రకాష్ రాజ్ బిజీగా ఉన్నారు.
Also Read: Tarun: తరుణ్ సినిమాలు చేయకపోవడానికి ఆ నటి కారణమా.. అసలు విషయం చెప్పిన రాజీవ్!