Actor Tarun: టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ అంటే ఒకానొక సమయంలో అందరికీ టక్కున తరుణ్ (Tarun)గుర్తుకు వచ్చేవారు. ఈయన బాల నటుడి గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. అప్పట్లో తరుణ్ కు అమ్మాయిలు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉండేది. నువ్వే కావాలి, నువ్వు లేక నేనులేను వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. కెరియర్ పరంగా ఇండస్ట్రీలో తరుణ్ కు ఏ విధమైనటువంటి డోకా లేదని అభిమానులు భావిస్తున్న తరుణంలోనే ఈయన వరుస ఫ్లాప్ సినిమాలను అందుకున్నారు.
ఇలా వరుస సినిమాలు నిరాశపరచడంతో తరుణ్ కూడా సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు..అయితే ఇప్పటివరకు ఈయన తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించలేదు. తిరిగి తరుణ్ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే బాగుంటుందని ఇప్పుడు ఈయన హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంచి సక్సెస్ అందుకుంటారని అభిమానులు భావిస్తున్నారు. అయితే తాజాగా నటుడు రాజీవ్ కనకాల(Rajeev Kanakala) ఒక ఇంటర్వ్యూలో తరుణ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తరుణ్ రాజీవ్ కనకాల చాలా మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే.
తరుణ్ సినిమా ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణాల గురించి ఈయనకు ప్రశ్నలు ఎదురవడంతో రాజీవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు తరుణ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగారు. ఇప్పటికీ కూడా ఈయన హీరోగా ఎంట్రీ ఇస్తే మంచి సక్సెస్ అందుకుంటారు కానీ ఎందుకు ఇండస్ట్రీలోకి రాలేదో అర్థం కాలేదని తెలిపారు. అయితే తరుణ్ ఇండస్ట్రీకి దూరం కావడానికి తరుణ్ తల్లి నటి రోజా రమణి (Roja Ramani)కారణమని వార్తలు వచ్చేంత వరకు నిజమనే ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ తరుణ్ ఇండస్ట్రీకి దూరం కావడానికి తన తల్లి కారణం కాదని తెలిపారు.
బాలనటుడిగా జాతీయ అవార్డు..
రోజా రమణి ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే తరుణ్ కి సంబంధించిన సినిమాల ఎంపిక విషయంలో రోజా రమణి జోక్యం ఉండేదని అందుకే ఆయనకు అవకాశాలు తగ్గిపోయాయనే వార్తలు ఒకానొక సమయంలో చక్కర్లు కొట్టాయి కానీ ఇందులో నిజం లేదని రాజీవ్ తెలిపారు. ఇక ప్రస్తుతం తరుణ్ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న వ్యాపారాలను చూసుకుంటున్నారని తెలుస్తుంది.మరి అభిమానుల కోరిక మేరకు ఈయన తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక తరుణ్ బాల నటుడిగా అంజలి అనే సినిమా ద్వారా తన కెరియర్ ప్రారంభించారు. ఈ సినిమాలో తన నటనకు గాను ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో ఎంతో మంచి కెరియర్ ఉన్న తరుణ్ఇండస్ట్రీకి దూరం కావడంతో అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Rajeev Kanakala:చచ్చిపోయే పాత్రలలో రాజీవ్ కనకాల.. సుమ ఫీలింగ్ అదేనా?