BigTV English
Advertisement

Chiranjeevi: మెగాస్టార్ కి భారతరత్న.. బండ్లన్న మాటల వెనుక అర్థం!

Chiranjeevi: మెగాస్టార్ కి భారతరత్న.. బండ్లన్న మాటల వెనుక అర్థం!

Chiranjeevi:బండ్ల గణేష్ (Bandla Ganesh) ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీని ఓ రేంజ్ లో పొగుడుతున్నారు.. అంతేకాకుండా రీసెంట్ గా దీపావళి సందర్భంగా ఇచ్చిన పార్టీకి కూడా మెగాస్టార్ చిరంజీవిని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించడమే కాకుండా చిరంజీవి కారు దిగడంతోనే ఆయన కాళ్లు మొక్కి మరీ ఆహ్వానించాడు. అంతేకాదు స్పెషల్ గా సింహాసనం చేయించి మరీ వార్తల్లో నిలిచారు బండ్లన్న. దానికి సంబంధించిన విజువల్స్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా ఓ సినిమా సక్సెస్ మీట్ లో మెగాస్టార్ (Megastar) కి భారతరత్న ఇవ్వాలి అంటూ మాట్లాడిన మాటలు మరొక్కసారి వైరల్ అవుతున్నాయి. మరి ఇంతకీ బండ్ల గణేష్ ఈ రేంజ్ లో మెగాస్టార్ పై ఎందుకు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు..? బండ్ల గణేష్ మెగాస్టార్ ని ఇంతలా అభిమానించడం వెనుక ఉన్న కారణం ఏంటి ? అనేది ఇప్పుడు చూద్దాం..


త్వరలో చిరంజీవికి భారతరత్న..

నిర్మాతగా..నటుడిగా.. ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించిన బండ్ల గణేష్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చిన్నాచితకా కామెడీ పాత్రలు చేసేవారు.ఆ తర్వాత గబ్బర్ సింగ్ మూవీతో నిర్మాతగా మారి స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించారు.అయితే అలాంటి ఈయన ప్రస్తుతం సినిమాలు తగ్గించినప్పటికీ పలు ఈవెంట్లకు వెళుతూ హైలెట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కిరణ్ అబ్బవరం (Kiran abbavaram) నటించిన కే ర్యాంప్ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ మూవీ సక్సెస్ ఈవెంట్ కి బండ్ల గణేష్ ని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. అయితే ఈ ఈవెంట్లో కిరణ్ అబ్బవరాన్ని చిరంజీవితో పోల్చుతూ నువ్వు ఎప్పటికైనా చిరంజీవి అంతటి వాడివి అవుతావు.. నిన్ను చూస్తుంటే నాకు చిరంజీవి గారిని చూసినట్టుంది. 150 సినిమాల్లో నటించిన చిరంజీవి ఎప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్ లో ఉన్నట్టే ఆలోచిస్తారు. ఆయన ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారు. రేపో మాపో భారతరత్న అందుకుంటారు. నువ్వు ఎప్పుడూ కూడా చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి.

ALSO READ:Awara: రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎప్పుడంటే?


మెగా జపం చేస్తున్న బండ్లన్న..

నీ మనస్తత్వం, నీ యాక్టింగ్ ఎప్పుడు మార్చుకోకు. సినిమాల్లో తెరమీద మాత్రమే నీ స్టైల్ ఉపయోగించు.. బయట మాత్రం ఇలాగే ఒద్దికగా ఉండు అంటూ కిరణ్ అబ్బవరానికి సలహాలు ఇచ్చారు. అయితే ఈ ఈవెంట్లో చిరంజీవికి రేపో మాపో భారతరత్న వస్తుంది అంటూ బండ్లన్న మాట్లాడిన మాటలు సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారాయి. అయితే బండ్ల గణేష్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా మెగాస్టార్ ని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మరి ఎందుకు బండ్ల గణేష్ మెగాస్టార్ ని ఇంతలా పొగుడుతున్నారు.. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉన్న ఈయన ఇప్పుడు చిరంజీవి జపం చేస్తున్నారేంటి అని కొంతమంది ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈయన ఎప్పుడూ కూడా మెగా అభిమానిగానే ఉండేవారు.కానీ పవన్ కళ్యాణ్ పై కాస్త ఎక్కువ ప్రేమను చూపించేవారు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ ని దూరం పెట్టడం కారణంగా చిరంజీవి జపం చేస్తున్నాడని కొంతమంది అంటున్నారు. బండ్ల గణేష్ మాట్లాడిన వీడియో వైరల్ అవ్వడంతో చాలామంది మెగా ఫ్యాన్స్ బండ్లన్న చెప్పినట్టు మెగాస్టార్ కి భారతరత్న రావాలి అంటూ నెట్టింట్లో పోస్టులు చేస్తున్నారు.

Related News

AA22 ×A6: అల్లు అర్జున్ అట్లీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. కన్ఫామ్ చేసిన బన్నీ!

#NTRNeel: డైరెక్టర్‌తో గొడవలకు పుల్‌స్టాప్… కొత్త షెడ్యూల్‌కి రెడీ అవుతున్న ఎన్టీఆర్!

The Raja Saab : ఇంకా ఓటీటీ డీల్ కాలేదు… VXF కాలేదు… పైగా 218 కోట్ల తలనొప్పి ?

Kalki -Shambhala: ప్రభాస్ కల్కి సినిమాకు.. ఆది శంభాలకు లింక్

Aadi Sai Kumar: శంబాల ఆఖరి ప్రయత్నం.. షాకింగ్ డెసిషన్ తీసుకున్న హీరో!

Bandla Ganesh: బండ్లన్న స్పీచ్ వెనుక కిరణ్… ఆ ఇద్దరు ముగ్గురు హీరోలే టార్గెటా ?

The Raja Saab: ప్రభాస్ రాజా సాబ్ వాయిదా… ఫైనల్లీ నిర్మాతలు స్పందించారు.. ఏం అన్నారంటే ?

Akshay Kumar: 100 కోడిగుడ్లతో కొట్టించుకున్న అక్షయ్ కుమార్.. షాక్ లో ఫ్యాన్స్!

Big Stories

×