BigTV English
Advertisement

Rashmika: 29 ఏళ్లకే అరుదైన రికార్డు.. బడా బడా హీరోలకు కూడా సాధ్యం కానీ!

Rashmika: 29 ఏళ్లకే అరుదైన రికార్డు.. బడా బడా హీరోలకు కూడా సాధ్యం కానీ!

Rashmika:రష్మిక మందన్న (Rashmika Mandanna) .. 2014లో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె అదే ఏడాది “క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా” టైటిల్ దక్కించుకుంది. అలాగే “క్లీన్ అండ్ క్లియర్” బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పనిచేసిన ఈమె.. కిరిక్ పార్టీ అనే సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న రష్మిక.. పునీత్ రాజ్ కుమార్ తో అంజనీపుత్ర, గణేష్ తో ఛమక్ అనే కన్నడ చిత్రాలలో నటించింది. ఆ తర్వాత నాగశౌర్య హీరోగా వచ్చిన ఛలో సినిమా చేసి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 2021లో సుల్తాన్ అనే సినిమాతో తమిళ సినీరంగంలోకి అడుగు పెట్టిన రష్మిక.. అదే ఏడాది బాలీవుడ్ లో గుడ్ బై సినిమా చేసి బాలీవుడ్ రంగ ప్రవేశం కూడా చేసింది.


డబుల్ హ్యాట్రిక్.. అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన రష్మిక..

ఇకపోతే గీతాగోవిందం, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు అంటూ పలు చిత్రాలు చేసి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది రష్మిక. ఆ తర్వాత సుకుమార్ (Sukumar ), అల్లు అర్జున్ (Allu Arjun) కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమాతో ఈమె రేంజ్ మారిపోయిందనే చెప్పాలి. వరుసగా పుష్ప, పుష్ప 2, యానిమల్, సికందర్, ఛావా, కుబేర , థామా అంటూ వరుసగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటించడమే కాకుండా.. ఒక్కో మూవీతో 100 కోట్ల క్లబ్లో చేరి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఉన్న స్టార్ హీరోలు ఎవరూ కూడా ఇలా వరుస చిత్రాలతో రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన దాఖలాలు లేవు. దీన్ని బట్టి చూస్తే 29 ఏళ్ల వయసులోనే ఈ అరుదైన రికార్డును సాధించి బడా హీరోలను సైతం ఆశ్చర్యపరిచింది రష్మిక మందన్న.

ALSO READ:Chiranjeevi: మెగాస్టార్ కి భారతరత్న.. బండ్లన్న మాటల వెనుక అర్థం!


రష్మిక సినిమాల కలెక్షన్స్..

ఈ సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సాధించిన కలెక్షన్స్ విషయానికి వస్తే.. పుష్ప సినిమాతో 370 కోట్లు, పుష్ప 2 – 1469.95 కోట్లు, యానిమల్ – 556 కోట్లు, ఛావా – 800 కోట్లు, సికందర్ – 200 కోట్లు, కుబేర 130 కోట్లు, థామా 120 కోట్లు ఇలా వరుస చిత్రాలతో 100 కోట్ల క్లబ్లో చేరిపోయి రికార్డు క్రియేట్ చేసింది రష్మిక మందన్న.

రష్మిక మందన్న తదుపరి చిత్రాలు..

ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో దీక్షిత్ శెట్టి – రష్మిక మందన్న కాంబినేషన్లో వస్తున్న చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. నవంబర్ 7వ తేదీన తెలుగు, హిందీ భాషలలో.. నవంబర్ 14వ తేదీన తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కాబోతోంది. అలాగే మైసా అనే చిత్రంలో నటిస్తున్న ఈమె.. మరొకవైపు రెయిన్బో చిత్రంలో కూడా నటిస్తోంది. అంతేకాదు ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రష్మిక. ఏదేమైనా రష్మిక మరో రెండు మూడేళ్లు బిజీగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.

Related News

Bandla Ganesh: బండ్లన్నకు బంపర్ ఆఫర్ ఇచ్చిన మెగాస్టార్..కథల వేటలో బిజీగా!

Jigris Movie : ‘జిగ్రీస్’కు అండగా తరుణ్ భాస్కర్… క్రేజీ డైరెక్టర్ చేతుల మీదుగా ‘మీరేలే’ సాంగ్ రిలీజ్

The Raja saab: ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో షాక్ ఇచ్చిన రాజా సాబ్ టీమ్.. నిరీక్షణ తప్పదా?

AA22 ×A6: అల్లు అర్జున్ అట్లీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. కన్ఫామ్ చేసిన బన్నీ!

#NTRNeel: డైరెక్టర్‌తో గొడవలకు పుల్‌స్టాప్… కొత్త షెడ్యూల్‌కి రెడీ అవుతున్న ఎన్టీఆర్!

The Raja Saab : ఇంకా ఓటీటీ డీల్ కాలేదు… VXF కాలేదు… పైగా 218 కోట్ల తలనొప్పి ?

Kalki -Shambhala: ప్రభాస్ కల్కి సినిమాకు.. ఆది శంభాలకు లింక్

Aadi Sai Kumar: శంబాల ఆఖరి ప్రయత్నం.. షాకింగ్ డెసిషన్ తీసుకున్న హీరో!

Big Stories

×