IND VS SA: 2025 నవంబర్ 2 క్రికెట్ అభిమానులకు చారిత్రాత్మకమైన రోజు. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్ లో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో.. సౌత్ ఆఫ్రికాని 52 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ప్రపంచ చంపియన్ గా నిలిచింది టీమ్ ఇండియా. ఈ విజయం భారత మహిళా క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఈ గెలుపు స్త్రీ శక్తికి ప్రతీక. ఇకనుండి నారీమణులు క్రీడల్లో పాల్గొనడానికి ముందుకు వస్తారు.
Also Read: Jemimah Rodrigues: మరోసారి దొరికిపోయిన జెమిమా… హిందూ ధర్మాన్ని అవమానిస్తూ!
మహిళలు వంటింట్లో గరిట తిప్పడమే కాదు.. వరల్డ్ కప్ కూడా సాధించగలమని నిరూపించారు మన క్రీడాకారులు. వారు ఆడిన తీరు కోట్లాదిమంది భారత మహిళల గుండెల్లో ఉత్సాహాన్ని నింపింది. భారత్ ప్రపంచ కప్ ఫైనల్ లో గెలిచిన అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో వరల్డ్ కప్ అందుకున్న తర్వాత ఓ యువ అభిమాని మాట్లాడిన తీరు ప్రస్తుతం అందరికీ ఆకట్టుకుంటుంది. ఆ చిన్నారి స్పష్టమైన ఇంగ్లీష్ భాషలో ఇరగదీసింది. దీంతో ఆ చిన్నారికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఫైనల్ మ్యాచ్ అనంతరం ఓ బాలిక టీమిండియా విజయంపై ఓ ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడింది. ముంబైకి చెందిన ఈ చిన్నారి క్యూట్ క్యూట్ మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆ చిన్నారి ఇంగ్లీషులో మాట్లాడుతూ.. “నా నోట మాట రావట్లేదు. ఫైనల్ లో ప్రతి ప్లేయర్ తమ బెస్ట్ ఇచ్చారు. ప్రతి క్రీడాకారిని ప్రాణం పెట్టి ఆడింది. ముఖ్యంగా దీప్తి శర్మ, షఫాలి వర్మ అద్భుతంగా ఆడారు. వారికి సహకరించిన మిగతా వాళ్ల తీరు కూడా బాగుంది. ఈ గెలుపుతో ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. నిజంగా మన అమ్మాయిలు చూపించిన తెగువ, అంకిత భావం అమోఘం” అంటూ ఇంగ్లీషులో అద్భుతంగా మాట్లాడింది. ఈ క్రమంలో ఆ చిన్నారి ఆంగ్లంలో అంత స్పష్టంగా మాట్లాడడం చూసి చుట్టుపక్కల ఉన్న వారంతా షాక్ అయ్యారు.
Also Read: IND VS SA: నీకు సిగ్గుందా.. ఏబీ డివిలియర్స్ పై నటి హాట్ కామెంట్స్.. ఇండియాకే వెళ్లిపో !
ఈ చిన్నారి మాట్లాడిన వీడియో ట్విట్టర్ {ఎక్స్} లో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోని ఇంగ్లీష్ క్రికెట్ అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో తిరిగి మళ్లీ షేర్ చేసింది. “ప్రపంచ కప్ గెలిచిన అనంతరం భారత జట్టు తర్వాత ఎక్కువగా వైరల్ అయింది ఈ అమ్మాయే. ఈ చిన్నారి ఇంగ్లీషులో అలవోకగా మాట్లాడడం చూసి నేనే షాక్ అయ్యాను. ఈ వీడియోను ప్రతి ఒక్కరు తప్పక చూడాలి” అని ఎక్స్ లో రాసుకొచ్చింది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">