AP Liquor Scam Case: వైసీపీ ‘లిక్కర్’ గుట్టు బయటపడుతోందా? ఇప్పటివరకు అరెస్టయిన ఐదుగురు నిందితులు సిట్ విచారణలో ఏం చెప్పారు? అందరి మాటలు తాడేపల్లి ప్యాలెస్ కేరాఫ్ అని చెబుతున్నారా? ఇంతకీ నిందితుడు సజ్జల శ్రీధర్‌రెడ్డి సిట్ అధికారుల ముందు ఎందుకు కన్నీరుపెట్టారు? లిక్కర్ వ్యవహారం గుట్టు మొత్తం బయటపెట్టేనట్టేనా? రేపో మాపో మరికొందరు అరెస్టు కావడం ఖాయమా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
మద్యం కుంభకోణం కేసు వైసీపీని కుదిపేస్తోంది. కొత్త కొత్త వ్యక్తులు బయటపడుతున్నారు. గతంలో వినని పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నలుగురు నిందితులను విచారిస్తున్న సిట్ అధికారులు, మరిన్ని అరెస్టులు ఉంటాయని అంటున్నారు. ఎందుకంటే ఈ వ్యవహారంపై ఎటు చూసినా మూలాలన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయని అంటున్నారు.
గురువారం ఏడు గంటలపాటు శ్రీధర్ రెడ్డిని విచారించారు సిట్ అధికారులు. మొత్తం విషయాలను పూసగుచ్చి మరీ ఆయన చెప్పారట. దివంగత మాజీ ఎంపీ ఎస్‌పీవై రెడ్డి అల్లుడు సజ్జల శ్రీధర్‌రెడ్డి. లిక్కర్ తయారు చేసే డిస్టలరీ ఓనర్. గతంలో ఈయన టీడీపీలో ఉండేవారు. మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా వైసీపీలోకి వెళ్లారు. లిక్కర్ కేసులో ఆయన్ని సిట్ అధికారులు విచారిస్తున్నారు.
విచారణ సందర్భంలో ఆయన ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడట. ఓ పార్టీ అధినేత తనను పిలిచి ఆదాయం వచ్చేలా చూడాలని, రాజ్ కసిరెడ్డితో కలిసి ప్లాన్ చేయాలని చెప్పారట. ఆ ఈ ప్రక్రియలో హైదరాబాద్‌లోని ఫేమస్ హోటల్‌లో డిస్టలరీ ఓనర్లను పిలిచి వారితో మాట్లాడారు.
ALSO READ: వైసీపీపై మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు.. డీఎస్సీ ఆపడానికి కుట్ర
లిక్కర్ వ్యాపారం గురించి అంతా తెలుసుకున్నారు. దాని తర్వాత విజయసాయిరెడ్డి, ఆ తర్వార మరొక ప్లేస్‌లో సమావేశం జరిగింది. అదాన్‌కు 60 కోట్లు, ఎస్పీవై ఆగ్రోకు 45 కోట్లు శరత్ చంద్రారెడ్డి అరబిందో నుంచి ఇప్పించారని తెలిపారట. అందులో నాటి సీఎం, ఎంపీ పాత్ర ఏమిటి? అన్న ప్రశ్నలు రైజ్ చేశారట. ఎస్పీవై ఆగ్రో వచ్చిన 45 కోట్లలో ఓ ఎంపీ కమిషన్‌గా 13 కోట్లను తీసుకున్నారట.
ఈ సమయంలో తన కంపెనీ తీసుకుని, తనను బయటకు పంపారంటూ కన్నీరుమున్నీరు అయ్యారట నిందితుడు శ్రీధర్‌రెడ్డి. ఆ తర్వాత వ్యాపార వ్యవహారాలు ఏం జరిగాయో తనకు తెలీదని వివరించారట. మొత్తం ఐదేళ్లలో జరిగిన లిక్కర్ వ్యాపారం 99 వేల కోట్ల పైచిలుకు కాగా, అందులో 600 కోట్ల రూపాయలు వైట్ ట్రాన్స్యాక్షన్ జరిగింది. మిగిలిన మొత్తమంతా క్యాష్ రూపంలో తీసుకున్నారు.
రోజువారీ మద్యం అమ్మకాల గురించి ఓ ఫోన్ నెంబర్ నుంచి లిస్టు వచ్చేదని, దాని తర్వాత సరుకు వచ్చేదని వివరించినట్టు సమాచారం. కొత్త కొత్త కంపెనీలు వచ్చేవని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టుకు ముందు శరత్ చంద్రారెడ్డి అకౌంట్ నుంచి అదాన్ కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్న శ్రీనివాస్ ఖాతాకు రూ. 60 కోట్లు వచ్చినట్టు తెలుస్తోంది.
అధికారులు అడిగిన కొన్ని ప్రశ్నలకు శ్రీధర్‌రెడ్డి నీళ్లు నమిలినట్లు సమాచారం. శ్రీధర్ రెడ్డి చెప్పిన సమాధానాల్లో చాలావరకు రాజ్ కసిరెడ్డి, ఓ ఎంపీ, ఆనాటి ముఖ్యమంత్రి పేర్లు చెప్పినట్టు తెలుస్తోంది. ఇదంతా శ్రీధర్ రెడ్డి వ్యవహారం. మిగతా ముగ్గురు నిందితులు గోవిందప్పుతోపాటు మరో ఇద్దర్ని సిట్ అధికారులు విచారిస్తున్నారు. దాని తర్వాత మిగతా అరెస్టులు ఉంటాయని అంటున్నారు. మరోవైపు ఇదే కేసును ఈడీ కూడా దర్యాప్తు చేస్తోంది.