BigTV English

Samantha : పెళ్లైన డైరెక్టర్ తో సమంత ఎఫైర్… మేనేజర్ బానే మేనేజ్ చేశాడా..?

Samantha : పెళ్లైన డైరెక్టర్ తో సమంత ఎఫైర్… మేనేజర్ బానే మేనేజ్ చేశాడా..?

Samantha : ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha ) గత కొంతకాలంగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru) తో డేటింగ్ లో ఉన్నట్లు రూమర్స్ బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రాజ్ కి ఇదివరకే పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ సమంత.. రాజ్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ.. అందరిని ఆశ్చర్యపరుస్తోంది. దీనికి తోడు సమంత ఎక్కడికి వెళ్లినా తనతో పాటు డైరెక్టర్ ను కూడా తీసుకు వెళ్తూ ఉండడంతో రూమర్స్ మరింత బలపడ్డాయి. అయితే ఈ రూమర్స్ దావానంలా విస్తరిస్తున్న వేళ అటు రాజ్ కానీ ఇటు సమంతా కానీ ఎవరు స్పందించలేదు. కానీ నిన్నటికి నిన్న సమంత, రాజ్ భుజంపై తలవాల్చి మరీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో స్వయంగా షేర్ చేయడంతో వీరి బంధం బలపడిందని నెటిజెన్స్ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ వార్తలకి మరింత బలం చేకూరేలా రాజ్ భార్య శ్యామల (Shyamala) కూడా ఒక పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ను బట్టి చూస్తే వీరిద్దరి రిలేషన్ గురించి ఆమె పెట్టిందేమో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


పెళ్లయిన డైరెక్టర్ తో సమంత డేటింగ్.. మేనేజర్ ఏమన్నారంటే..

పైగా సమంత రాజ్ నిడిమోరు డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే రాజ్ తన భార్యకు విడాకులు ఇచ్చి సమంతాను వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్న వేళ.. సమంత మేనేజర్ స్పందించారు.సమంత మేనేజర్ మాట్లాడుతూ..” రాజ్ నిడిమోరు, సమంత డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ వట్టి పుకార్లు మాత్రమే.. ఏది కూడా అధికారికంగా ప్రకటించే వరకు నమ్మకూడదు” అంటూ వార్తలకు చెక్ పెట్టారు. అయితే ఇది చూసిన చాలామంది బాగానే మేనేజ్ చేశాడే.. ఎంతైనా సమంత మేనేజర్ కదా.. ఆ మాత్రం మేనేజ్ చేయాల్సిందేలే.. అంటూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే మరొకవైపు సమంత , రాజ్ నిడిమోరు వివాహం తర్వాత కలిసి ఉండడానికి ఒక ఇల్లు కూడా కొనుగోలు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది.


సమంతపై నెగిటివిటీ పెరుగుతోందా..

ఇక సమంత విషయానికి వస్తే.. అక్కినేని వారసుడైన నాగచైతన్యను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. కానీ నాలుగేళ్ల వైవాహిక బంధానికి పులిస్టాప్ పెట్టి 2021లోనే విడాకులు తీసుకున్నారు. ఇక వివాహం తర్వాత ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. మయోసైటిస్ వ్యాధి బారిన కూడా పడింది. ఇక ఈ వ్యాధి నుంచి బయటపడిన ఈమె ఇటీవలే వరుస వెబ్ సిరీస్లలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్లో యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టిన ఈమె ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లెవెల్ లోనే నటిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇక అందుకే హీరోలతో సమానంగా పారితోషకం కూడా డిమాండ్ చేస్తూ అందరికీ షాక్ కలిగిస్తోందని చెప్పవచ్చు. ఇకపోతే సమంత ఇప్పుడు అటు కెరియర్ పరంగా ఇటు వ్యక్తిగతంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉండడంతో.. అభిమానులు ఈమెపై వస్తున్న నెగెటివిటీని తీసుకోలేకపోతూ ఉండడం గమనార్హం.

Related News

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Big Stories

×