Araku Coffee: అరకు లోయలో నివసించే గిరిజన రైతుల జీవితాల్లో పెద్ద మార్పు రాబోతోంది. ఒకప్పుడు కాఫీ సాగు కేవలం జీవనాధారమే అయినా, ఇకపై అది వారికి లక్షలు సంపాదించే అవకాశమవుతోంది. ఈ మార్పుకు కారణం ఏపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం. గిరిజన అభివృద్ధి కోసం మొత్తం 21 అవగాహన ఒప్పందాలు (MoUs) కుదుర్చుకోవడంతో, ఆరాకూ కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు, మరింత ఆదాయం రాబట్టే మార్గం సుగమం కానుంది.
ఈ ఒప్పందాల్లో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రపంచ ప్రఖ్యాత కాఫీ బ్రాండ్ స్టార్‌బక్స్ ఇప్పుడు ఆరాకూ కాఫీని తమ మెనూలో చేర్చబోతోంది. అంటే, న్యూయార్క్ నుంచి టోక్యో వరకు, పారిస్ నుంచి సిడ్నీ వరకు ఎక్కడైనా స్టార్‌బక్స్ కాఫీ షాప్‌లోకి వెళ్లినా, మన ఆరాకూ కాఫీ రుచి చూసే అవకాశం ఉంటుంది. ఈ కాఫీని ప్రపంచానికి అందించడానికి టాటా కన్జ్యూమర్స్ ముందుకు వచ్చింది.
దీంతో పాటు, ప్రస్తుత కాఫీ తోటల విస్తీర్ణాన్ని మరో 1,600 హెక్టార్లు పెంచనున్నారు. ఇది అరకూ, పొరుగు గిరిజన ప్రాంతాల్లో ఉన్న వందల కుటుంబాలకు నేరుగా ఆదాయం పెంచే అవకాశం. రైతులు ఇప్పటి వరకు కాఫీని మధ్యవర్తుల ద్వారా తక్కువ ధరలకు అమ్ముకుంటూ వచ్చారు. ఇకపై ప్రభుత్వం, టాటా కన్జ్యూమర్స్ నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేస్తాయి. దీని వల్ల ధరలు రెట్టింపు అవుతాయి, మధ్యవర్తుల దోపిడీ తగ్గిపోతుంది.
కాఫీతో పాటు, ఈ MoUsలో పసుపు సాగు కూడా ఒక ప్రధాన అంశం. గిరిజన ప్రాంతాల్లో పసుపు పంట ఉత్పత్తిని పెంచి, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీని వల్ల పసుపు ధరలు పెరగడంతో పాటు, రైతులకు సంవత్సరం పొడవునా స్థిరమైన ఆదాయం లభిస్తుంది.
Also Read: Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!
అంతేకాదు, పర్యాటక ప్రాజెక్టులు కూడా ఈ ఒప్పందాల్లో భాగం. అరకూ సహజ సౌందర్యం, గిరిజన సంస్కృతి, స్థానిక వంటకాలు, హస్తకళలు ఇవన్నీ పర్యాటకులకు ఆకర్షణగా మారేలా, ఎకోటూరిజం, హోమ్‌స్టేలు, సాంస్కృతిక ఉత్సవాల రూపకల్పన జరుగుతోంది. పర్యాటకులు ఎక్కువగా రాగానే, స్థానికులకు గైడ్‌లు, హోమ్‌స్టే నిర్వాహకులు, హస్తకళల వ్యాపారస్తులుగా మారనుండడంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
మొత్తం 21 ఒప్పందాలు గిరిజన ప్రాంతాల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం రూపొందించబడ్డాయి. ఇవి అమలైన తర్వాత, అరాకూ కాఫీ పేరు గ్లోబల్ బ్రాండ్‌గా నిలిచి, పసుపు, హస్తకళలు, పర్యాటక రంగం అన్నీ కలిసి గిరిజన కుటుంబాలకు సంవత్సరానికి లక్షల రూపాయల ఆదాయం తెచ్చే అవకాశం ఉంది.
ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను గిరిజనుల ఆర్థిక స్వావలంబన” దిశగా మలుపు తిప్పే చారిత్రాత్మక అడుగుగా పేర్కొంది. రాబోయే ఏళ్లలో అరకూ పేరు కేవలం పర్యాటకుల కోసం అందమైన లోయగానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్థిక సక్సెస్ స్టోరీగా మారబోతోంది.