BigTV English

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

ఏపీలో రెండు జడ్పీటీసీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలు పొలిటికల్ హీట్ పెంచాయి. ఈ రెండు స్థానాలకు ఈనెల 12(మంగళవారం) ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా, నేటితో ప్రచారం పూర్తయింది. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో రెండు పార్టీలు కొత్త పుంతలు తొక్కాయి. ముఖ్యంగా పులివెందులలో వైసీపీ పరువుని పూర్తిగా తీసేసింది టీడీపీ. ఆ స్థాయిలో ఎన్నికల ప్రచారం చేపట్టింది. ఖైదీల వలె దుస్తులు ధరించిన కొంతమంది యువకులు వీధుల్లో తిరుగుతూ వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టారు. బాబాయిని చంపిన అబ్బాయి బ్యాచ్ కు ఓటు వేద్దామా అంటూ వారు ప్రజల్ని ప్రశ్నించారు. ఖైదీల వేషధారణతో డప్పు వాయిద్యాలతో టీడీపీ శ్రేణుల చేపట్టిన ప్రచారం సంచలనంగా మారింది.


ప్రతిష్టాత్మకం పులివెందుల
2 స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నా.. పులివెందుల మాత్రం రెండు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. 2021లో వైసీపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి ఈ స్థానం నుంచి ఏకగ్రీవంగా గెలుపొందారు. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో ఆయన మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఈసారి ఆయన కుమారుడు హేమంత్ రెడ్డిని ఎన్నికల బరిలో నిలిపింది వైసీపీ. కూటమి అభ్యర్థిగా టీడీపీ నేత లతారెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికను ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందంటున్న వైసీపీ.. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని ఓడించడం ద్వారా అది నిజమేనని రుజువు చేయాలనుకుంటోంది. ఇక పులివెందుల జడ్పీటీసీని కైవసం చేసుకుంటే అది జగన్ కి అవమానంగా మారుతుందని భావిస్తోంది టీడీపీ. అందుకే ఇక్కడ ఉప ఎన్నికను కూటమి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంత్రులే స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించడం విశేషం.

ఏకగ్రీవాలే ఎక్కువ..
పులివెందుల మున్సిపాల్టీ, మున్సిపాల్టీలో కలసిన గ్రామాలు మినహా మిగతా 5 ఎంపీటీసీ స్థానాల పరిధిలోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. పులివెందుల జడ్పీటీసీ పరిధిలో మొత్తం 10,601 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ దాదాపు అన్నీ ఏకగ్రీవాలే, అయితే 2016లో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయగా, వారి అభ్యర్థికి 2600 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఆ లెక్కన టీడీపీకి 25 శాతం మాత్రమే ఓటు బ్యాంక్ ఉందనే అంచనాలున్నాయి. అయినా కూడా టీడీపీ గెలుపు ధీమాతో ఉంది. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమ అభ్యర్థిని గెలిపిస్తాయని అంటున్నారు ఆ పార్టీ నేతలు.

సింపతీ ఓటు పడుతుందా..?
జడ్పీటీసీ మరణించగా, ఆయన కొడుకుని అభ్యర్థిగా నిలబెట్టింది వైసీపీ. అయితే సింపతీ ఓటు ఏమాత్రం వారికి ఉపయోగపడుతుందనేది తేలాల్సి ఉంది. ఇటు కూటమి మాత్రం పులివెందులలో వైసీపీని ఓడించి, జగన్ కి గట్టి సమాధానం చెప్పాలని చూస్తోంది. పోటా పోటీ ప్రచారంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అధికార దుర్వినియోగం జరుగుతోందంటూ ఆల్రడీ వైసీపీ రచ్చ చేస్తోంది. పులివెందుల ఉప ఎన్నిక కాబట్టి, బాబాయ్ హత్య కేసుని కూటమి హైలైట్ చేస్తోంది. బాబాయ్ ని హత్య చేయించిన అబ్బాయ్ బ్యాచ్ కి ఓట్లు వేద్దామా అంటూ ప్రశ్నిస్తూ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించారు టీడీపీ నేతలు.

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×