India vs Turkey: భారత్ చేసిన సాయాన్ని మరచి పాక్‌కి ఆయుధాలు సరఫరా చేసిన టర్కీకి మన కేంద్రం వరుస షాకులు ఇస్తోంది. భారత్‌లోని పలు విమానాశ్రయాల్లో గ్రౌండ్ హ్యాండ్లింగ్, భద్రతాపరమైన, ఇతర విధులు నిర్వహిస్తున్న టర్కీకి చెందిన సెలబీ ఎయిర్‌పోర్టు సర్వీసెస్ సేవలను నిలిపివేసింది. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని BCAS జారీ చేసింది. సెలబీకి 2022 నవంబర్ 21న BCAS నుంచి అనుమతులు వచ్చాయి. ఇప్పుడు ఆ అనుమతులను రద్దు చేసింది కేంద్రం.
మన దేశంలోని యాపిల్ వ్యాపారులు కూడా స్వచ్ఛందంగా టర్కీపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. టర్కీ నుంచి యాపిల్స్ దిగుమతి చేసుకోవాన్ని ఆపేశారు. దీంతో అక్కడి యాపిల్ వ్యాపారానికి గట్టి దెబ్బ తగిలింది. ఓవరాల్‌గా టర్కీ ఎకానమీలో భారతీయుల వాటా కీలకమే. ఇవన్నీ మర్చిపోయి ఆ దేశంలో పాక్‌కి సపోర్టు చేసింది. దాయాదికి డ్రోన్లు, ఆయుధాలు సరఫరా చేసింది. 2023లో టర్కీలో భూకంపం వస్తే కేంద్రం పెద్ద ఎత్తున సాయం చేసింది. ఆపరేషన్ దోస్త్ పోరుతో వంద టన్నుల రిలీఫ్ మెటీరియల్, మెడికల్ యూనిట్స్ పంపించింది మన కేంద్రం. కానీ.. టర్కీ మనపై పరోక్షంగా యుద్ధ డోన్లను పంపించింది.
ఆపరేషన్ సిందూర్ టైంలో పాకిస్థాన్‌కు మద్దతిచ్చిన టర్కీ, అజర్‌బైజాన్‌లపై మన దేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే అజర్‌బైజాన్, టర్కీలకు భారీ షాక్ తగిలింది. మన ట్రావెల్ ఏజెన్సీలు కూడా ఆ రెండు దేశాలకు ఆన్‌లైన్ బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. టర్కీ ట్రిప్స్‌ను ఇండియన్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు.
కొత్త బుకింగ్‌లు 60 శాతం పడిపోయాయని, క్యాన్సలేషన్‌లు 250 శాతానికి పెరిగాయంటూ ట్రావెల్ సంస్థ మేక్ మై ట్రిప్ తెలిపింది. టర్కీకి బుకింగ్స్‌ను ఇప్పటికే కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు నిలిపివేశాయి. ఇస్తాంబుల్, అజర్‌బైజాన్‌కు వెళ్లే వాళ్లు ఆగిపోతున్నారని ట్రావెల్ ఏజెంట్స్ చెబుతున్నారు. టూరిస్టులను వెళ్లొద్దని చెబుతున్నారు. అయితే టూర్లు క్యాన్సిల్ చేసుకోవద్దంటూ టర్కీ రిక్వెస్ట్ చేస్తోంది. టూరిస్టులకు రక్షణ కల్పిస్తామంటూ టర్కీ టూరిజం డిపార్ట్‌మెంట్ ప్రకటన చేసింది.
ఈ ప్రకటనతో ఆ రెండు దేశాలకు ఆర్థికంగా పెద్ద ఎదురుదెబ్బగా మారనుంది. మన దేశానికి సంఘీభావంతో పాటు పాటు మన సాయుధ బలగాలపై గౌరవంతో పర్యటకుల నిర్ణయాన్ని మేమూ గౌరవిస్తున్నాం అని మేక్‌మైట్రిప్ వెల్లడించింది. ఒకవేళ భారతీయులు ఎవరైనా ఆ రెండు దేశాలకు వెళ్లాల్సి వస్తే అక్కడి సున్నితమైన ప్రాంతాల పర్యటనల్లో చాలా అలర్ట్‌గా ఉండాలని సూచిస్తున్నాయి.
Also Read: పాకిస్తాన్‌కు అండగా ఉంటాం.. టర్కీ అధ్యక్షుడి ప్రకటన
భద్రత దృష్ట్యా పర్యాటకులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించేందుకు భయపడుతుండటంతో బుకింగ్‌లు రద్దు అవుతున్నాయని తెలుస్తోంది. భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా అంతర్జాతీయ ప్రయాణాలపై కూడా ప్రభావం పడింది. పాకిస్తాన్‌కు మద్దతు తెలిపిన దేశాలకు ట్రావెల్ సంస్థలు బుకింగ్‌లు నిలిపివేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
హోటల్స్, రెస్టారెంట్స్, టూరిస్టు ప్రదేశాలకు వచ్చే ప్రయాణికులకు ఎప్పటిలాగే వస్తున్నారని టర్కీ ప్రకటించింది. టర్కీకి వచ్చే ప్రయాణికులు టూర్ క్యాన్సిల్ చేసుకోవడానికి ఎలాంటి కారణం లేదని స్పష్టం చేశారు. భారతీయలకు ఎలాంటి ఢోకా లేదని.. భద్రతా సమస్యలు అసలే లేవని తెలిపింది. మీ భద్రతకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది.