E-Paper
Advertisement

AP: మళ్లీ ‘ప్రత్యేక హోదా’.. వైసీపీ వ్యూహమేంటి?

AP: మళ్లీ ‘ప్రత్యేక హోదా’.. వైసీపీ వ్యూహమేంటి?
Advertisement

AP: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా.. ఎప్పుడో కనుమరుగైన అంశం. మళ్లీ లేవనెత్తింది వైసీపీ. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో మరోసారి ‘ప్రత్యేక’ ప్రస్తావన తీసుకొచ్చింది.

అప్పుడప్పుడు ఢిల్లీ వేదికగా ఏపీకి ప్రత్యేక హోదా అంశం పలువురు వైసీపీ నాయకుల నోళ్లలో నానుతోంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో మళ్లీ ఈ అంశాన్ని లేవనెత్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను ప్రస్తావించారు. కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు.

Advertisement

అలాగే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని విజయసాయిరెడ్డి అన్నారు. బెంగళూరు మెట్రోకు కేటాయించినట్లుగానే విశాఖ మెట్రోకు కేంద్రం నుంచి 20 శాతం నిధులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. దీనిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అభ్యంతరం తెలిపారు.

ప్రత్యేక హోదాను వైసీపీ వదిలేయలేదని గుర్తు చేయడానికే.. ఇలా అప్పుడప్పుడూ స్పెషల్ స్టేటస్ గొంతుక వినిపిస్తుంటారు ఆ పార్టీ ఎంపీలు. ప్రధాని మోదీని సీఎం జగన్ కలిసిన ప్రతీసారి ఆయన ఇచ్చే డిమాండ్ల జాబితాలో ఏపీకి ప్రత్యేక హోదా అనే పదం జత చేస్తూ ఉంటారు. ఇక అంతే. మళ్లీ సైలెన్స్. ఇదంతా రొటీన్ గా చేసే డిమాండేనంటూ లైట్ తీసుకుంటున్నారు ఏపీ ప్రజలు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×