BigTV English

APPolitics:3రాజధానులు..బుగ్గన అలా..సజ్జల ఇలా..క్లారిటీ మిస్..

APPolitics:3రాజధానులు..బుగ్గన అలా..సజ్జల ఇలా..క్లారిటీ మిస్..

APPolitics:ఏపీలో రాజధాని ఇష్యూ హీటెక్కింది.ఏపీకి ఒక్కటే రాజధాని అని అది విశాఖ మాత్రమేనని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి.విపక్షాలు భగ్గుమంటున్నాయి. టీడీపీ తాము అధికారంలోకి వస్తే అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని స్పష్టం చేస్తోంది.అటు రాజధాని అంశంపై ప్రజల్లోనే తేల్చుకుందామని జనసేన సవాల్ చేస్తోంది. రాజధానిగా విశాఖను..ఏపీ ప్రజలు ఒప్పుకోవడం లేదని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు.ఈ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి,నిజాయితీ ఉంటే ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. విశాఖకు రాజధాని రావడం వల్ల బాగుపడతామని ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అనుకోవడం లేదన్నారు.రాజకీయ లబ్ధి కోసం ప్రజలు,ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మనోహర్ మండిపడ్డారు.


ఏపీలో మూడు రాజధానులు ఉండవని బుగ్గన ఇచ్చిన స్టేట్ మెంట్ పై ఆగ్రహజ్వాలలు రేగుతున్న నేపథ్యంలో వైసీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ విధానం అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.విశాఖ పరిపాలన రాజధానిగా ఉంటుందని, అమరావతి శాసన రాజధానిగా,కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటాయన్నారు.పాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజలను ఎల్లో మీడియా కన్ప్యూజ్‌ చేస్తోందని సజ్జల మండిపడ్డారు.ఎవరూ అపోహ పడవద్దని ప్రజలకు సూచించారు. ఎన్నికల కోసం తాము రాజకీయం చేయబోమన్నారు.అధికార వికేంద్రీకరణ చేయాలని శివరామకృష్ణ కమిటీ చెప్పలేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఘోర తప్పిదం చేశారని సజ్జల మండిపడ్డారు.

ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి 3 రాజధానులు ఉంటాయని చెబుతున్నారు. మరి ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బెంగళూరు పర్యటనలో ఏపీకి ఒక్క రాజధానే ఉంటుందని ఎందుకు చెప్పారు? ఇటీవల సీఎం జగన్ విశాఖకు పరిపాలన తరలిస్తామని ఢిల్లీలో చెప్పారు. ఇలా ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి బయట రాష్ట్రాల్లో విశాఖపట్నం ఏపీ కేపిటల్ అని ప్రమోట్ చేస్తున్నారు.అమరావతి ప్రాంత నుంచి మాత్రం మీడియా ముందుకు వచ్చి సజ్జల ఏపీకి 3 రాజధానులు ఉంటాయని చెబుతున్నారు. ఓవరాల్ గా చూస్తే రాజధాని ఇష్యూలో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. రాజధానిపై క్లారిటీ మిస్ అవుతోంది


Tags

Related News

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు

AP Liquor Case: లిక్కర్ కేసులో కొత్త విషయాలు.. ముడుపుల చేర్చడంలో వారే కీలకం, బిగ్‌బాస్ చుట్టూ ఉచ్చు

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Big Stories

×