BigTV English

Jagan: జగన్‌ను ఆ ‘దేవుడే’ కాపాడాలి.. ఇది తెలుసుకోకపోతే!

Jagan: జగన్‌ను ఆ ‘దేవుడే’ కాపాడాలి.. ఇది తెలుసుకోకపోతే!

జగన్ పై హిందూ వ్యతిరేకి అనే ముద్ర ఉంది. వైసీపీ హయాంలో తిరుమలను అపవిత్రం చేసే కార్యక్రమాలు చాలా జరిగాయనే ఆరోపణలున్నాయి. తాడేపల్లిలో తిరుమల గుడి సెట్టింగ్ వేసిన జగన్ హిందువులకు మరింత ఆగ్రహాన్ని తెప్పించారనే ప్రచారం కూడా ఉంది. దేవుడి దగ్గరకు తాను వెళ్లాలి కానీ, తన దగ్గరకే దేవుడ్ని తీసుకు రావడం తగదన్నారు చాలామంది. అధికారం కోల్పోయి తర్వాత కూడా జగన్ లో పెద్దగా మార్పేమీ కనపడ్డం లేదని విమర్శిస్తోంది ఆయన వైరివర్గం. కనీసం పండగలు, పబ్బాలకయినా ఆయన దేవుళ్లను ధ్యానించేందుకు ఇష్టపడటం లేదని వారు అంటున్నారు. దీనికి తగ్గట్టే జగన్ ప్రవర్తన కూడా ఉండటం ఇక్కడ విశేషం. జగన్ మతం ఏదయినా కావొచ్చు, కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అన్ని మతాలను గౌరవించాలి, ఆదరించాలనేది ప్రజల వాదన. కనీసం పార్టీ ఆఫీస్ లో జరిగిన విజయదశమి వేడుకలకు కూడా జగన్ రాలేదంటే ఆయనకు హిందూ పండగలపై ఏమాత్రం గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఏదో తూతూమంత్రంగా పార్టీ ఆఫీస్ లో దేవుళ్ల పటాలకు దండలు వేసి దండం పెట్డుటారు వైసీపీ నేతలు. జగన్ మాత్రం యదావిధిగా కేరాఫ్ బెంగళూరు.


తిరుమల విషయంలో జగన్ కి నెగెటివ్ మార్కులు
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆలయాలపై దాడులు, రథాలు తగలబడటం ఇలాంటి ఘటనలు వరుసగా జరిగాయి. దాన్ని కవర్ చేసుకోడానికి జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి సతీసమేతంగా హాజరవడం ఆనవాయితీ. కానీ జగన్ ఏనాడూ ఆ పని చేయలేదు. మిగతా నేతల విషయంలో ఎవరూ ఆక్షేపించరు కానీ, సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఆ ఆనవాయితీని పాటించకపోవడం మాత్రం భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. కొండపై అప్పటి టీటీడీ ఈవో భార్య జగన్ రెడ్డి రక్షకా గోవిందా అంటూ నినాదాలు చేసినప్పుడు కూడా చాలామంది నొచ్చుకున్నారు. మొత్తంగా కొండపై జగన్ హయాంలో ఎన్నో వింతలు విశేషాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలున్నాయి.

అధికారం కోల్పోయాకా అంతే
2024లో కూటమి అధికారంలోకి వచ్చింది, వైసీపీ అధికారం కోల్పోయింది. ఆ తర్వాత కూడా జగన్ లో పెద్దగా మార్పేమీ రాలేదని అంటున్నారు. ఆ పార్టీ నేతలు కూడా పెద్దగా మారలేదనే వాదన వినపడుతోంది. టీటీడీ ఈవోగా పనిచేసిన కరుణాకర్ రెడ్డి తాజాగా అలిపిరి వద్ద శని దేవుడి విగ్రహాన్ని అడ్డు పెట్టుకుని మొదలు పెట్టిన రగడ మరోసారి సంచలనంగా మారింది. శనిదేవుడికి, తిరుమల శ్రీవారికి తేడా తేలియని వ్యక్తి టీటీడీ ఈవోగా పనిచేశారా అనే చర్చ మొదలైంది. అలాంటి వారికి జగన్ టీటీడీ ఈవో పదవి ఇచ్చారా అనే విమర్శలు వచ్చాయి. ఒక్క తిరుమల విషయంలోనే కాదు, హిందువుల మనోభావాలను అడుగడుగునా వైసీపీ దెబ్బతీసిందని వైరి వర్గాలు ఆటాడేసుకుంటున్నాయి.

Also Read: దేవరగట్టు కర్రల సమరంలో ముగ్గురు మృతి

జగన్ ఏం చేయాలి?
జగన్ నటించాల్సిన పనిలేదని, హిందూ ధర్మ పరిరక్షకుడిగా తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు జనం. కానీ హిందూ మతాన్ని గౌరవించడం, హిందూ పండగలకు కూడా హాజరవడం అత్యవసరం అనే వాదన వినపడుతోంది. ఆ విషయంలో ఆయన తనని తాను మార్చుకోకపోతే, ప్రజల దృష్టిలో హిందూ ద్వేషిగానే మిగిలిపోతారని అంటున్నారు. ప్రత్యర్థుల చేతికి తనకు తానే ఆ ఆయుధాన్ని ఇచ్చినవారవుతారు.

Also Read: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం..

Related News

North Andhra Floods: ఉత్తరాంధ్ర వరదల్లో నలుగురు మృతి.. బాధితులకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం

Kurnool News: దేవరగట్టు కర్రల సమరంలో నెత్తురోడింది.. ముగ్గురు మృతి, 100 మందికి పైగా

AP GST Collections: ప‌న్నుల రాబ‌డిలో ప‌రుగులు తీస్తున్న ఏపీ.. సెప్టెంబ‌ర్ నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వ‌సూళ్లు

AP Heavy Rains: తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్.. ప్రజలు బయటకు రావొద్దు

Visakha Heavy Rains: వాయుగుండం ఎఫెక్ట్.. విశాఖలో భారీ వర్షాలు, గాలుల బీభత్సం

Kurnool News: దసరా ఫెస్టివల్.. రాత్రికి దేవరగట్టులో కర్రల సమరం.. భారీగా ఏర్పాటు

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Big Stories

×